హౌసింగ్ సోసైటీలో అరాచకం, లేడీ సెక్యూరిటీ గార్డుపై గ్యాంగ్ రేప్, హత్య చేసి చివరికి !
ఘాజిమాబాద్/లక్నో: ఓ యువతి ఉద్యోగం చేసి ఆమె కుటుంబ సభ్యులకు ఆర్థికంగా ఆదుకోవాలని అనుకుంది. బంధువుల సహాయంలో ఓ హౌసింగ్ సోసైటీలో ఆ యువతి ఉద్యోగం సంపాధించింది. యువతి ఉద్యోగం చేస్తున్న చోటే ఉద్యోగం చేస్తున్న ముగ్గురు కామాంధులు ఆ యువతి మీద సామూహిక అత్యాచారం చేసి హత్య చెయ్యడం కలకలం రేపింది.
ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లోని హౌసింగ్ సొసైటీలో పనిచేస్తున్న 19 ఏళ్ల సెక్యూరిటీ గార్డు మీద సూపర్‌వైజర్, మరో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు సామూహిక అత్యాచారం చేసి తరువాత ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో సోమవారం మరణించినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు అజయ్ (32)ని అరెస్టు చేసి కేసు విచారణ చేస్తున్నామని ఘాజియాబాద్ పోలీసులు తెలిపారు.

ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఆమెను ఘజియాబాద్‌లో కాకుండా గ్రేటర్ నోయిడాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చించారని, తరువాత అరెస్టు నుండి తప్పించుకోవడానికి పారిపోయారని పోలీసులు చెబుతున్నారు. మహిళ పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించగా సోమవారం రాత్రి మృతి చెందిందని పోలీసులు తెలిపారు.
జార్ఖండ్‌కు చెందిన మహిళ హౌసింగ్ సొసైటీ సమీపంలో ఆమె అత్తతో కలిసి నివసిస్తుందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.సూపర్‌వైజర్‌తో పాటు మరో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఆమెను కొట్టారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనంతరం ఎదురుతిరగడానికి లేడీ సెక్యూరిటీ గార్డు ప్రయత్నించగా ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు.
నిందితులు ముగ్గురు తప్పించుకునేందుకు అక్కడే పని చేస్తున్న కొందరు ఇతర సహోద్యోగులు సహకరించారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా, మిగతా వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని, త్వరలో అందరిని అరెస్టు చేస్తామని ఘాజియాబాద్ పోలీసు అధికారులు అంటున్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications