Godman: టాప్ లీడర్స్, కేంద్ర మాజీ మంత్రులు స్వామీజీకి ఫ్యాన్స్, రేప్ కేసులో మిర్చి బాబా అరెస్టు, మ్యాటర్!

భోపాల్/గ్వాలియర్: నేను దేవమానవుడు అంటూ భక్తులను ఆకట్టుకున్న బాబా ఇంతకాలం మంచి పేరు ప్రతిష్టలు సంపాధించుకున్నాడు. ఆశ్రమానికి ప్రతినిత్యం వందలు, వేల సంఖ్యలో భక్తులు వెళ్లి వస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రులు, రాజకీయ ప్రముఖులు ఆయన ఆశ్రమానికి వెళ్లి వస్తుండటంతో చాలా ఫేమస్ అయ్యాడు. కేంద్ర మాజీ మంత్రి ఓడిపోతే తాను జలసమాధి అవుతానని ఆ బాబా గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర మాజీ మంత్రి ఓడిపోయిన సమయంలో జలసమాధి కావడానికి విఫలయత్నం చేసి హాట్ టాపిక్ అయ్యాడు. అలాంటి ఫేమస్ బాబా రేప్ కేసులో అరెస్టు కావడం కలకలం రేపింది. పిల్లలు పుట్టలేదని వెళ్లిన తన మీద బాబా అత్యాచారం చేశాడని ఓ వివాహిత మహిళ కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

వైరాగ్యనందగిరి స్వామీజీ అలియాస్ మిర్చీ బాబా

వైరాగ్యనందగిరి స్వామీజీ అలియాస్ మిర్చీ బాబా

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో నివాసం ఉంటున్న వైరాగ్యానంద గిరి అలియాస్ మిర్చి బాబా నివాసం ఉంటున్నాడు. నేను దేవమానవుడు అని మిర్చి బాబా ప్రచారం చేసుకున్నాడు. నేను దేవమానవుడు అంటూ భక్తులను ఆకట్టుకున్న మిర్చి బాబా ఇంతకాలం మంచి పేరు ప్రతిష్టలు సంపాధించుకున్నాడు.

కాంగ్రెస్ కు ప్రచారం

కాంగ్రెస్ కు ప్రచారం

గత లోక్ సభ ఎన్నికల్లో మిర్చి బాబా కాంగ్రెస్ తరపున మధ్యప్రదేశ్ లో ప్రచారం చేశారు. కేంద్ర మాజీ మంత్రులు, రాజకీయ ప్రముఖులు మిర్చి బాబా ఆశ్రమానికి వెళ్లి వస్తుండటంతో చాలా ఫేమస్ అయ్యాడు. కేంద్ర మాజీ మంత్రి దిగ్వజయ్ సింగ్ విజయం సాధించాలని మిర్చి బాబా కొన్ని రోజుల పాటు పెద్ద ఎత్తున పూజలు, యాగాలు చేసి హంగామా చేశారు.

ఫేమస్ బాబాకు షాక్

ఫేమస్ బాబాకు షాక్

దిగ్వజయ్ సింగ్ ఎన్నికల్లో ఓడిపోతే తాను జలసమాధి అవుతానని మిర్చి బాబా గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మాజీ మంత్రి దిగ్వజయ్ సింగ్ ఓడిపోయిన సమయంలో జలసమాధి కావడానికి మిర్చి బాబా విఫలయత్నం చేసి హాట్ టాపిక్ అయ్యాడు. ఆసమయంలో వందల సంఖ్యలో పోలీసులు అడ్డుకోవడంతో మిర్చి బాబా జల సమాధి కాలేకపోయారు.

మిర్చి బాబా మీద రేప్ కేసు పెట్టిన భక్తురాలు

మిర్చి బాబా మీద రేప్ కేసు పెట్టిన భక్తురాలు

మిర్చి బాబాకు ఆశ్రమానికి ప్రతినిత్యం వందలు, వేల సంఖ్యలో భక్తులు వెళ్లి వస్తున్నారు. అలాంటి ఫేమస్ మిర్చి బాబా మీద ఓ భక్తురాలు రేప్ పెట్టింది. రేప్ కేసులో మిర్చి బాబా అరెస్టు కావడం కలకలం రేపింది. పిల్లలు పుట్టలేదని వెళ్లిన తన మీద జులై 17వ తేదీన మిర్చి బాబా అత్యాచారం చేశాడని ఓ వివాహిత మహిళ కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. మిర్చి బాబాను గ్వాలియర్ లోని హోటల్ లో అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచామని ఏసీపీ రిచా చౌబే స్థానిక మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+