
Lady: భర్త ముందే బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్లిన భార్య, రాత్రికి రానని భర్తకు ఫోన్, హోటల్ లో దారుణ హత్య !
గురుగ్రామ్/న్యూఢిల్లీ: ఇంటి నుంచి భర్త కళ్ల ముందే బయటకు వెళ్లిన భార్య తరువాత ఇంటికి తిరిగిరాలేదు. తాను ప్రియుడితో కలిసి బయటకు వెళ్లానని తరువాత భార్య ఆమె భర్తకు ఫోన్ చేసి చెప్పింది. నీ చావు నువ్వు చావు, ఎప్పుడు ఇంటికి వస్తావో అప్పుడు రా అంటూ భర్త సైలెంట్ గా ఉండిపోయాడు. మరుసటి రోజు భార్య ప్రియుడు ఆమె భర్తకు ఫోన్ చేశాడు. పలానా ఏరియాలోని లాడ్జ్ లో నీ భార్య హత్యకు గురైయ్యిందని భర్తకు ఫోన్ లో చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు. భార్య హత్యకు గురైయ్యింది అని తెలుసుకున్న భర్త హోటల్ దగ్గరకు పరుగు తీశాడు. హోటల్ గదిలో భార్యను దారుణంగా పొడిచి చంపేసి శవాన్ని ఫ్యాన్ కు వేలాడదీశారని గుర్తించిన భర్త షాక్ అయ్యి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. పోలీసుల విచారణలో తన భార్య ఏం పని చేస్తోందో అనే విషయం భర్త చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. తన భార్యను ఇంటి నుంచి ఎవరు బయటకు పిలుచుకుని వెళ్లాడు ? అనే సమాచారం మొత్తం భర్త చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రాత్రి హత్యకు గురైన మహిళతో పాటు అదే లాడ్జ్ లో ఆమెతో కలిసి ఎంజాయ్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Illegal affair: భర్తకు 90 తక్కువ, క్వాటర్ ఎక్కువ, పక్కరూమ్ లో భార్య మిడ్ నైట్ మసాలా చూసి షాక్ !

పైకి దంపతులు
దేశరాజధాని ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ లో మోహమ్మద్ షాహిద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మోహమ్మద్ షాహిద్ రేష్మా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. మోహమ్మద్ షాహిద్, రేష్మా దంపతులు గురుగ్రామ్ లోని సెక్టార్ 14 సమీపంలో నివాసం ఉంటున్నారు. చుట్టుపక్క వారికి పైకి దంపతుల్లా కనపడుతున్న షాహిద్, రేష్మా దంపతుల మద్య చాలా తేడాలు ఉన్నాయని సమాచారం.

భర్త ముందే బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్లిన భార్య
గురుగ్రామ్ లో రింకు అనే యువకుడు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రాత్రి రేష్మా ఇంటి దగ్గరకు రింకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో రేష్మా, ఆమె భర్త మోహమ్మద్ షాహిద్ ఉన్నారు. తరువాత భర్త షాహిద్ కళ్ల ముందే రేష్మా ఆటో డ్రైవర్ రింకుతో కలిసి బయటకు వెళ్లిపోయింది. తరువాత రేష్మా రాత్రి ఇంటికి వస్తుందని అర్దరాత్రి వరకు ఆమె భర్త మోహమ్మద్ షాహిద్ ఎదురు చూశాడు.

రాత్రి ఇంటికి రాను అని భర్తకు చెప్పిన భార్య
ఇంటి నుంచి భర్త మోహమ్మద్ షాహిద్ కళ్ల ముందే బయటకు వెళ్లిన భార్య రేష్మా అర్దరాత్రి దాటినా ఇంటికి తిరిగిరాలేదు. తాను ప్రియుడు రింకుతో కలిసి బయటకు వెళ్లానని తరువాత భార్య రేష్మా ఆమె భర్త మోహమ్మద్ షాహిద్ కు ఫోన్ చేసి చెప్పింది. నీ చావు నువ్వు చావు, ఎప్పుడు ఇంటికి వస్తావో అప్పుడు రా అంటూ భర్త మోహమ్మద్ షాహిద్ సైలెంట్ గా ఉండిపోయాడు.

నీ భార్యను చంపేశారు...... వెళ్లి చూసుకో
మరుసటి రోజు భార్య రేష్మా ప్రియుడు రింకు ఆమె భర్త మోహమ్మద్ షాహిద్ కు ఫోన్ చేశాడు. గురుగ్రామ్ లోని అతుల్ కటారియా చౌక్ ఏరియా సమీపంలోని లాడ్జ్ లో నీ భార్య రేష్మా హత్యకు గురైయ్యిందని ఆమె భర్త మోహమ్మద్ షాహిద్ కు ఫోన్ లో చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు. భార్య రేష్మా హత్యకు గురైయ్యింది అని తెలుసుకున్న భర్త మోహమ్మద్ షాహిద్ హోటల్ దగ్గరకు పరుగు తీశాడు. హోటల్ గదిలో భార్య రేష్మాను దారుణంగా పొడిచి చంపేసి శవాన్ని ఫ్యాన్ కు వేలాడదీశారని గుర్తించిన భర్త మోహమ్మద్ షాహిద్ మైండ్ బ్లాక్ కావడంతో అతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నా భార్య సెక్స్ వర్కర్
విషయం తెలుసుకున్న గురుగ్రామ్ సెక్టార్ 14 పోలీసులు లాడ్జ్ లోకి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. పోలీసుల విచారణలో తన భార్య రేష్మా ఏం పని చేస్తోందో అనే విషయాన్ని ఆమె భర్త మోహమ్మద్ షాహిద్ చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. తన భార్య రేష్మా సెక్స్ వర్కర్ అని, ముందు రోజు రాత్రి ఆటో డ్రైవర్ రింకుతో కలిసి బయటకు వచ్చిందని మోహమ్మద్ షాహిద్ పోలీసులకు చెప్పాడు.
Recommended Video

రింకునే హంతకుడు ?
తన భార్య రేష్మాను ఇంటి నుంచి రింకు అనే వ్యక్తి బయటకు పిలుచుకుని వెళ్లాడని ఆమె భర్త మోహమ్మద్ షాహిద్ సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రాత్రి హత్యకు గురైన రేష్మాతో పాటు లాడ్జ్ లో ఆటో డ్రైవర్ రింకుతో పాటు మరెవరు ఉన్నారు ?, అదే లాడ్జ్ లో బస చేసిన వ్యక్తులు ఎవరు ? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐటీ హబ్ గురుగ్రామ్ లోని ప్రముఖ హోటల్ లో సెక్స్ వర్కర్ దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది. హోటల్ లోని రూమ్ లో రాత్రి రేష్మాతో రింకుతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు ? అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. 32 సంవత్సరాల సెక్స్ వర్కర్ ను పక్కాప్లాన్ తో హత్య చెయ్యడం ఐటీ హబ్ గురుగ్రామ్ లో హాట్ టాపిక్ అయ్యింది.