lady techie: కారులో ఇంటర్వ్యూ, మాల్ పార్కింగ్ ఏరియాలో మత్తు మందు ఇచ్చి ?

గురుగ్రామ్/న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువతి టెక్కీగా ఉద్యోగంలో చేరింది. కొంతకాలం ఉద్యోగం చేసిన యువతి తరువాత ఆన్ లైన్ ఉద్యోగం, వర్క్ ఫ్రమ్ ఉద్యోగం సంపాధించాలని ప్రయత్నించింది. లేడీ టెక్కీ ఆమె రెజ్యూమ్ ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసింది. ఓ యువకుడిని ఆ యువతికి ఫోన్ కాల్ వెళ్లింది. ఇంటర్వూకు రావాలని అతను చెప్పాడు. సర్టిఫికెట్లు అన్నీ తీసుకున్న యువతి అతను చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. కారులో యువతిని కుర్చోబెట్టుకుని ఓ మాల్ లోని బేస్ మెంట్ లోని కారు పార్కింగ్ దగ్గరకు వెళ్లి అతను అసలు సినిమా మొదలుపెట్టాడు.

 లేడీ టెక్కీకి నీళ్లలో మత్తు మందు ఇచ్చి

లేడీ టెక్కీకి నీళ్లలో మత్తు మందు ఇచ్చి

హర్యానాలోని గురుగ్రామ్‌లో 27 ఏళ్ల మహిళా టెక్నీ మీద ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. గురుగ్రామ్ మాల్‌లోని బేస్‌మెంట్‌లో పార్క్ చేసిన కారులో లేడీ టెక్కీ మీద ఆ కామాంధుడు అత్యాచారం చేశాడని కేసు నమోదు అయ్యిందని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన యువతికి ఉద్యోగం ఇస్తామని, ఇంటర్వ్యూకు రావాలని పిలిపించి నీళ్లలో మత్తు మందు కలిపి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 51లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో కామాంధుడి మీద బాధితురాలు ఫిర్యాదు చేసింది.

 ఏం జరిగిందంటే ?

ఏం జరిగిందంటే ?

పోలీసులు కేసు నమోదు చేసి కామాంధుడి కోసం గాలిస్తున్నారు.
తాను ఆన్‌లైన్ జాబ్ సంపాధించాలని ఎదురు చూస్తున్నానని, తుషార్ శర్మా అనే వ్యక్తి నంబర్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని బాధితురాలు పోలీసులకు చెప్పింది. తరువాత తనకు ఫోన్ చేసి మీకు కచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తానని తుషార్ శర్మా హామీ ఇచ్చాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. గత శనివారం గురుగ్రామ్ లోని సహారా మాల్‌లో ఇంటర్వ్యూ ఉందని, నువ్వు కచ్చితంగా రావాలని తనకు ఫోన్ చేసి చెప్పారని బాధితురాలు అంటోంది.

 కారులోనే మాయమాటలు, ఇంటర్వ్యూ

కారులోనే మాయమాటలు, ఇంటర్వ్యూ

తరువాత తాను తన సర్టిఫికెట్లు అన్ని తీసుకుని మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మాల్ గేటు వద్ద తుషార్ శర్మా కోసం ఎదురు చూశానని, కొంత సేపటి తరువాత అతను రావడంతో అతన్ని కలిశానని బాధితురాలు పోలీసులకు చెప్పింది. తరువాత నిందిడు కారును మాల్‌లోని బేస్‌మెంట్‌కు తీసుకెళ్లి అక్కడ కారును పార్క్ చేశాడు. తరువాత నిందితుడు తుషార్ శర్మా తనకు తాగడానికి నీళ్లు ఇచ్చాడని, ఆ నీళ్లు తాగిన కొంత సేపటి తరువాత తాను స్పృహ కోల్పోయినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

 కారులోనే రేప్ చేసి అక్కడే వదిలేసి ?

కారులోనే రేప్ చేసి అక్కడే వదిలేసి ?

తుషార్ శర్మా తనను బలవంతంగా అతని కారులోనే అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. ఆ తరువాత మాల్ లోని బేస్ మెంట్ లోని పార్కింగ్ ఏరియాలో తనను వదిలేసిన తుషార్ శర్మా అక్కడి నుంచి పారిపోయాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. ఈ విషయం ఎవరికైనా చెబితే నిన్ను చంపేస్తానని తతను తుషార్ శర్మా బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

 సీసీటీవీ కెమెరాల్లో ?

సీసీటీవీ కెమెరాల్లో ?

మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తుషార్ శర్మాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పోలీసు అధికారులు అంటున్నారు. ఇదే సమయంలో పోలీసులు మాల్ యాజమాన్యం నుంచి సీసీటీవీ ఫుటేజీలను తీసుకుని నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద ఉద్యోగం ఇస్తామని లేడీ టెక్కీ మీద కారులోనే అత్యాచారం జరగడం గురుగ్రామ్ లో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+