Model: మోడల్ నగ్న ఫోటోలతో షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్ డ్రామాలు, లక్షల్లో డిమాండ్, రివర్స్ గేర్ తో క్లైమాక్స్ !
చెన్నై/ తిరుప్పూర్: మోడలింగ్ రంగంలో ఉన్న యువతి తాను ఇంకా పెద్ద మోడల్ కావాలని, దేశం మొత్తం తన గురించి మాట్లాడుకోవాలని ఆశపడింది. మోడలింగ్ లో ఇంకా ఎక్కువ అవకాశాలు రావాలని ఎదురు చూసింది. ఇదే సందర్బంలో తాను విదేశాల్లో మోడలింగ్ చేస్తున్నానని ఓ యువతి పేరుతో మోడల్ కు మెసేజ్ వెళ్లింది. బోల్డ్ మోడలింగ్ చెయ్యడానికి మీకు ఇష్టం అయితే మీకు మంచి అవకాశాలు ఇప్పిస్తామని ఆ యువతి మోడల్ కు చెప్పింది. సోషల్ మీడియా ఫ్రెండ్ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కు ఆ మోడల్ నగ్నంగా తీసుకున్న ఫోటోలు పంపించడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది. ఈ వ్యవహారంలో షార్ట్ ఫిలిమ్స్ తీసి సినిమా డైరెక్టర్ కావాలని ఎదురు చూస్తున్న యువకుడు అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

చెన్నైలో మోడల్
చెన్నైలో ఓ అందమైన యువతి నివాసం ఉంటున్నది. ఇప్పటికే మోడలింగ్ రంగంలో ఉన్న చెన్నై యువతి తాను ఇంకా పెద్ద మోడల్ కావాలని, దేశం మొత్తం తన గురించి మాట్లాడుకోవాలని ఆశపడింది. మోడలింగ్ లో ఇంకా ఎక్కువ అవకాశాలు రావాలని చెన్నై యువతి చాలా ఆశగా ఎదురు చూసింది.

ఇంగ్లాండ్ లో నేను మోడల్
ఇటీవల చెన్నై యువతికి సోషల్ మీడియాలో ధీక్షాజ్యోతి అనే యువతి పేరుతో మెసేజ్ వెళ్లింది. తాను ఇంగ్లాండ్ లో మోడలింగ్ చేస్తున్నానని దీక్షాజ్యోతి అనే యువతి పేరుతో చెన్నై మోడల్ కు పదేపదే మెసేజ్ లు వెళ్లాయి. బోల్డ్ మోడలింగ్ చెయ్యడానికి మీకు ఇష్టం అయితే మీకు మంచి అవకాశాలు ఇప్పిస్తామని దీక్షాజ్యోతి చెన్నై మోడల్ కు చెప్పింది.

విచ్చలవిడిగా పంపించేసింది
ఎలాగైన పెద్ద మోడల్ అయిపోవాలి అనుకున్న చెన్నై యువతి దీక్షాజ్యోతి చెప్పినట్లు బోల్డ్ గా కొన్ని ఫోటోలు తీసి దీక్షాజ్యోతికి పంపించింది. అయితే ఇలాంటి ఫోటోలు ఉంటే నీకు అవకాశం రాదని, అర్దనగ్నంగా, నగ్నంగా ఉన్న ఫోటోలు పంపించాలని చెన్నై మోడల్ కు చెప్పింది. చెన్నై మోడల్ ఆమె నగ్నంగా, అర్దనగ్నంగా ఉన్న ఫోటోలు చాలా తీసి దీక్షా జ్యోతికి పంపించింది.

రూ. 3 లక్షలు డిమాండ్
సోషల్ మీడియా ఫ్రెండ్ దీక్షాజ్యోతి ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కు, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కు చెన్నై మోడల్ ఆమె అర్దనగ్నంగా, నగ్నంగా తీసుకున్న ఫోటోలు పంపించిన కొంతకాలం తరువాత అవతలి వ్యక్తి నుంచి ఫోన కాల్ వచ్చింది. నాకు రూ. 3 లక్షలు ఇవ్వకుంటే నీ నగ్న ఫోటోలు మొత్తం సోషల్ మీడియాలో, ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేస్తానని బెదిరించాడు.

సినిమా డైరెక్టర్ కావాలని వచ్చి ఏం చేశాడంటే ?
హడలిపోయిన మోడల్ చెన్నై మెట్రోపొలిటన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు మోడల్ నగ్న ఫోటోలు పంపించిన మొబైల్ వాట్సాప్ నెంబర్ ను తిరుప్పూర్ కు చెందిన రంజిత్ ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో రంజిత్ చాలా షార్ట్ ఫిలిమ్స్ తీశాడని, సినిమా డైరెక్టర్ కావాలని చెన్నై వచ్చాడని పోలీసులు అన్నారు.

మ్యాటర్ రివర్స్ చెప్పిన డైరెక్టర్
మోడల్ నగ్న ఫోటోలు సంపాదించి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడని అరెస్టు అయిన రంజిత్ రివర్స్ లో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తాను, మోడల్ చాలా సంవత్సరాల నుంచి స్నేహితులు అని, మోడల్ తో తనకు గొడవ జరిగిందని, అందుకే తన మీద ఆమె బ్లాక్ మెయిల్ కేసు పెట్టిందని రంజిత్ చెప్పాడని పోలీసులు అంటున్నారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications