Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady: లైవ్ లో అంగన్ వాడి ఉద్యోగిని సుధా ఆత్మహత్యాయత్నం, ప్రభుత్వం మోసం చేసింది, జీతాలు !

చెన్నై/శివగంగై: అంగన్ వాడి కేంద్రంలో ఉద్యోగం చేస్తున్న మహిళ అక్కడ వచ్చే జీతంతో కాలం గడుపుతోంది. చాలా సంవత్సరాల నుంచి అంగన్ వాడి కేంద్రంలోనే ఆమె ఉద్యోగం చేస్తున్నది. ఇటీవల పంచాయితీ కార్యాలయం ఆవరణంలో ఉన్న అంగన్ వాడి కేంద్రం తరలించడానికి అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మహిళా, శిశు సంక్షేమ శాఖా ప్రాజెక్టు డైరెక్టర్ అంగన్ వాడి కేంద్రం దగ్గరకు వెళ్లి అంగన్ వాడి కేంద్రం అక్కడి నుంచి వేరే ఊరికి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారితో మాట్లాడటానికి అక్కడికి ఉద్యోగం చేస్తున్న మహిళ వెళ్లింది. ఆ సమయంలో ప్రాజెక్టు డైరెక్టర్ ఆమెను దూషించారని ఆరోపణలు ఉన్నాయి. అంగన్ వాడి కేంద్రంలో ఉద్యోగం చేస్తున్న మహిళ ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ తనకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ లైవ్ లోని ఆత్మహత్యాయత్నం చేసింది. ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్యాయత్నం చేసే సమయంలో మహిళ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది. అంగన్ వాడి లేడీ ప్రస్తుతం ఐసీయూలో మృత్యువుతో పోరాడుతోంది.

 అంగన్ వాడి కేంద్రంలో ఉద్యోగం

అంగన్ వాడి కేంద్రంలో ఉద్యోగం

తమిళనాడులోని శివగంగై జిల్లాలోని కలైయూర కోవిల్ సమీపంలోని ఇరుంబూర్ గ్రామంలోని పంచాయితీ యూనియన్ కార్యాలయం ఆవరణంలో అంగన్ వాడి కేంద్రం ఉంది. అంగన్ వాడి కేంద్రంలో ఉద్యోగం చేస్తున్న సుధా అనే మహిళ అక్కడ వచ్చే జీతంతో కాలం గడుపుతోంది. చాలా సంవత్సరాల నుంచి అంగన్ వాడి కేంద్రంలోనే సుధా ఉద్యోగం చేస్తున్నది.

 అంగన్ వాడి కేంద్రం తరలించాలని ?

అంగన్ వాడి కేంద్రం తరలించాలని ?

ఇటీవల ఇరుంబూర్ లోని పంచాయితీ కార్యాలయం ఆవరణంలో ఉన్న అంగన్ వాడి కేంద్రం తరలించడానికి అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారని సమాచారం. శివగంగై జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖా ప్రాజెక్టు డైరెక్టర్ పంచవర్ణం ఇరంబూరులోని అంగన్ వాడి కేంద్రం దగ్గరకు వెళ్లి అక్కడ పరిస్థితిని అంచనా వేశారని తెలిసింది.

 అధికారితో మాట్లాడిన సుధా

అధికారితో మాట్లాడిన సుధా

శివగంగై జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖా ప్రాజెక్టు డైరెక్టర్ పంచవర్ణ ఇరంబూరులోని అంగన్ వాడి కేంద్రం దగ్గరకు వెళ్లి అంగన్ వాడి కేంద్రం అక్కడి నుంచి వేరే ఊరికి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా స్థాయి అధికారి పంచవర్ణంతో మాట్లాడటానికి అక్కడ అంగన్ వాడి కేంద్రంలో ఉద్యోగం చేస్తున్న సుధా వెళ్లింది.

 అన్యాయం చేస్తున్నారని సుధా ఆవేదన

అన్యాయం చేస్తున్నారని సుధా ఆవేదన

ఆ సమయంలో ప్రాజెక్టు డైరెక్టర్ పంచవర్ణం అంగన్ వాడి ఉద్యోగిని సుధాను దూషించారని ఆరోపణలు ఉన్నాయి. అంగన్ వాడి కేంద్రం ఇక్కడి నుంచి తరలిస్తే తనకు అన్యాయం జరుగుతోందని, చాలా సంవత్సరాల నుంచి తాను ఇక్కడే ఉద్యోగం చేస్తున్నానని, తాను ఎలాంటి తప్పు చెయ్యలేదని అంగన్ వాడి ఉద్యోగిని సుధా అక్కడికి వెళ్లిన అధికారులకు చెప్పింది.

 ఫేస్ బుక్ లైవ్ లో నిద్రమాత్రలు మింగేసిన సుధా

ఫేస్ బుక్ లైవ్ లో నిద్రమాత్రలు మింగేసిన సుధా

అంగన్ వాడి కేంద్రంలో ఉద్యోగం చేస్తున్న సుధా ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ అధికారులు తనకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ లైవ్ లోనే ఆత్మహత్యాయత్నం చేసింది. ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్యాయత్నం చేసే సమయంలో సుధా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది. అంగన్ వాడి లేడీ సుధా ప్రస్తుతం శివగంగై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో మృత్యువుతో పోరాడుతోంది.

Recommended Video

    Sonu Sood Meets Crowd Of People Hoping For Help At Outside Of His House | Oneindia Telugu
     పక్క రాష్ట్రంలో ఇలా ఉంటే..... అక్కడ అలా ఉంది

    పక్క రాష్ట్రంలో ఇలా ఉంటే..... అక్కడ అలా ఉంది

    విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు, పోలీసులు ఆసుపత్రి చేరుకుని సుధా నుంచి వివరాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాలు వారి డిమాండ్లు పరిష్కరించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సమయంలోనే పక్క రాష్ట్రం తమిళనాడులో అంగన్ వాడి ఉద్యోగిని సుధా లైవ్ లో ఆత్మహత్యాయత్నం చెయ్యడం శివగంగై జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+