Lady teacher: ప్రియుడికి రొమాన్స్ పాఠాలు చెబుతోందని ?, ఉద్యోగం మానేసి భార్యకు కాపలా !

చెన్నై: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. ఫేమస్ క్లబ్ లో భర్త ఉద్యోగం చేస్తున్నాడు. కూతుర్లను బాగా చదివించిన దంపతులు సంతోషంగా జీవించారు. వివాహం జరిగిన 22 ఏళ్ల తరువాత లేడీ టీచర్ ప్రవర్తన మీద ఆమె భర్తకు అనుమానం మొదలైయ్యింది. రోజు పిల్లలకు పాఠాలు చెబుతున్న తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడికి రొమాన్స్ పాఠాలు చెబుతోందని రగిలిపోయాడు. భార్య మీద విపరీతమైన డౌట్ రావడంతో ఉద్యోగం మానేసి భార్యకు కాపలాగా కుర్చుకున్నాడు. రాత్రి ఇంట్లో ఇదే విషయంలో భార్యతో గొడవపడి ఆమెను చితకబాదేశాడు. ఇంటి కిటికి అద్దాలు, సోకేష్ అద్దాలు ద్వంసం చేశాడు. చివరికి లేడీ టీచర్ ను హత్య చేసి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించి భర్త పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు.

 ఇద్దరు కుమార్తెలు

ఇద్దరు కుమార్తెలు

చెన్నై సిటీ సమీపంలోని కుండ్రత్తూరులో రమేష్ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 22 ఏళ్ల క్రితం అలుమేలు అలియాస్ అలివేలు (42) అనే మహిళను రమేష్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రమేష్, అలివేలు దంపతులు ఇన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశారు. అలివేలు, రమేష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

 టీచర్ గా ఉద్యోగం చేస్తున్న భర్త

టీచర్ గా ఉద్యోగం చేస్తున్న భర్త

రమేష్ భార్య అలివేలు చెన్నైలో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. చెన్నై సిటీలోని ఓ ఫేమస్ క్లబ్ లో చాలా సంవత్సరాల నుంచి రమేష్ ఉద్యోగం చేస్తున్నాడు. కూతుర్లను బాగా చదివించిన రమేష్, అలివేలు దంపతులు ఇంతకాలం సంతోషంగా జీవించారు. వివాహం జరిగిన 22 ఏళ్ల తరువాత లేడీ టీచర్ అలివేలు ప్రవర్తన మీద ఆమె భర్త రమేష్ కు అనుమానం మొదలైయ్యింది.

 లేడీ టీచర్ కు ప్రియుడు ఉన్నాడని భర్తకు డౌట్

లేడీ టీచర్ కు ప్రియుడు ఉన్నాడని భర్తకు డౌట్

రోజు పిల్లలకు పాఠాలు చెబుతున్న తన భార్య అలివేలు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడికి రొమాన్స్ పాఠాలు చెబుతోందని ఆమె భర్త రమేష్ రగిలిపోయాడు. గత ఏడాది నుంచి రమేష్, అలివేలు దంపతుల మద్య ఇదే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు, బంధువులు సర్దిచెబుతున్నా రమేష్, అలివేలు దంపతుల మద్య గొడవలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.

 ఉద్యోగం మానేసి భార్యకు కాపలాగా కుర్చున్న భర్త

ఉద్యోగం మానేసి భార్యకు కాపలాగా కుర్చున్న భర్త

భార్య అలివేలు మీద విపరీతమైన డౌట్ రావడంతో మూడు నెలల క్రితం ఉద్యోగం మానేసిన రమేష్ ఇంటిలో ఆమెకు కాపలాగా కుర్చుకున్నాడు. అలివేలుకు ఎవరు ఫోన్ చేసినా రమేష్ రిసీవ్ చేస్తున్నాడు. అలివేలు వేరే వ్యక్తులకు పోన్ చెయ్యకుండా ఆమె మొబైల్ ఫోన్ రమేష్ దగ్గర పెట్టుకుంటున్నాడు. స్కూల్ కు వెళ్లి వస్తున్న భార్య అలివేలుకు ఆమె భర్త రమేష్ కపలాగా వెళ్లి వస్తున్నాడు.

 ఆవేశంతో ఊగిపోయి భార్యను చంపేశాడు

ఆవేశంతో ఊగిపోయి భార్యను చంపేశాడు

బయటకు వెళ్లిన రమేష్ మద్యం సేవించి రాత్రి ఇంటికి వెళ్లాడు. రాత్రి ఇంట్లో అక్రమ సంబంధం విషయంలో భార్య అలివేలుతో గొడవపడి రమేష్ చేతికి చిక్కిన వస్తువులు తీసుకుని ఆమెను చితకబాదేశాడు. ఆవేశంలో రమేష్ అతని ఇంటి కిటికి అద్దాలు, సోకేష్ అద్దాలు ద్వంసం చేశాడు. చివరికి లేడీ టీచర్ అలివేలును పదునైన ఆయుధంతో కొట్టి హత్య చేశాడు.

 పోలీసులకు అడ్డంగా చిక్కిపోయిన భర్త

పోలీసులకు అడ్డంగా చిక్కిపోయిన భర్త

భార్య అలిమేలును హత్య చేసి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన రమేష్ గస్తీ తిరుగుతున్న పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు. నా భర్త అలిమేలు వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను మోసం చేస్తోందని, అందుకే ఆమెను చంపేశానని రమేష్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+