Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady Tiger: ఎర్రచీర ఆంటీ ఎవరో కాని ఇరగదీసింది, నడిరోడ్డులో నగ్నంగా రౌడీ, తండ్రి పొలిటీషియన్!

చెన్నై/ మదురై/ కడలూరు: తండ్రి పొలిటీషియన్, కొడుకు రౌడీషీటర్, మామ రాజకీయ నాయకుడు, బావమరిది చిల్లర ఎదవ. అంతే పొలిటీషియన్ కొడుకు, బావమరిది ఫుల్ గా మద్యం సేవించారు. నడిరోడ్డు మీద బైక్ లు నిలిపిన రౌడీషీటర్, అతని బావమరిది రెండు వేటకొడవళ్లు చేతిలో పెట్టుకుని వచ్చిపోయే అమ్మాయి, ఆంటీలను అసభ్యంగా మాట్లాడారు. అసలే రౌడీషీటర్ కావడం, తండ్రి రాజకీయ నాయకుడు కావడంతో స్థానికులు ఎవ్వరూ వారిని ఏమీ మాట్లాడలేకపోయారు. సహనం కోల్పోయిన స్థానిక మహిళలకు చిర్రెత్తిపోయింది. నడిరోడ్డులో రౌడీషీటర్ బట్టలు చింపేసిన ఆంటీలు మద్యం మత్తులో ఉన్న అతనికి సినిమా చూపించారు. ఎర్రచీర కట్టుకున్న ఆంటీ అయితే రౌడీషీటర్ చేతిలోని తల్వార్ లాక్కొని రారారేయ్ చూసుకుందాం, నువ్వు ఏమైనా పోటుగాడివా అంటూ రెచ్చిపోయింది. ఆంటీల దెబ్బతో దిమ్మతిరిగిపోయి ఇంతకాలం పులిలా రెచ్చిపోయిన ఆ రౌడీషీటర్ పిల్లిలాగా జారుకున్నాడు. రౌడీషీటర్ల బిత్తల పురాణం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

తండ్రి పొలిటీషియన్.... కొడుకు రౌడీషీటర్

తండ్రి పొలిటీషియన్.... కొడుకు రౌడీషీటర్

తమిళనాడులోని కడలూరు జిల్లాలోని వేప్పూర్ లో పచ్చయప్పన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పచ్చయప్పన్ తమిళనాడులో ప్రముఖ రాజకీయ పార్టీ నాయకుడు. తోండన్ కురిచి పంచాయితీ అధ్యక్షుడిగా పచ్చయప్పన్ విజయం సాధించాడు. పంచాయితీ అధ్యక్షుడు పచ్చయప్పన్ కొడుకు భాస్కర్ అలియాస్ భాస్కరన్ పెద్ద రౌడీషీటర్.

బావ బావమరిదికి ఇదే పని

బావ బావమరిదికి ఇదే పని

పొలిటీషియన్ పచ్చయప్పన్ కొడుకు భాస్కర్, బావమరిది వెల్లయన్ ప్రతినిత్యం ఫుల్ గా మద్యం సేవిస్తున్నారు. నడిరోడ్డు మీద బైక్ లు నిలిపిన రౌడీషీటర్ భాస్కర్, అతని బావమరిది వెల్లయన్ రెండు వేటకొడవళ్లు చేతిలో పెట్టుకుని వచ్చిపోయే అమ్మాయి, ఆంటీలను అసభ్యంగా మాట్లాడుతున్నారు. అసలే భాస్కర్ రౌడీషీటర్ కావడం, అతని మీద ఇప్పటికే అనేక కేసులు ఉండటం, అతని తండ్రి పచ్చయప్పన్ రాజకీయ నాయకుడు కావడంతో స్థానికులు ఎవ్వరూ వారిని ఏమీ మాట్లాడలేకపోతున్నారు.

మత్తు తలలోని నరాలకు ఎక్కేసింది

మత్తు తలలోని నరాలకు ఎక్కేసింది

రౌడీషీటర్ భాస్కర్, అతని బావమరిది వెల్లియన్ నడిరోడ్డు పక్కన కుర్చుకుని మద్యం బాటిల్స్ తీసుకుని అక్కడే పీకలదాక మద్యం సేవించారు. రౌడీషీటర్ భాస్కర్, వెల్లియన్ పక్కన రెండు వేటకొడవళ్లు పెట్టుకోవడంతో వారి చేష్టలు చూసిన స్థానికులు ఏమీ మాట్లాడలేకపోయారు. రౌడీ భాస్కర్, వెల్లియన్ కు మద్యం మత్తు తల్లోని నారాల్లోకి ఎక్కడంతో వేటకొడవళ్లు చేతిలో పట్టుకుని రోడ్డు మీద నానా హంగామా చేశారు. వీరి చేష్టలతో రోడ్డు పక్కన ఆడుకుంటున్న స్థానిక పిల్లలు భయంతో వారి ఇళ్లలోకి పరుగు తీశారు.

నేను ఎవరో తెలుసా..... చంపేస్తా

నేను ఎవరో తెలుసా..... చంపేస్తా

రోడ్డు మీద నడిచి వెలుతున్న అమ్మాయిలు, వివాహిత మహిళలను అసభ్యంగా దూషించడం మొదలుపెట్టిన భాస్కర్ నేను ఎవరో తెలుసా, రౌడీ, నాకు ఎదురు చెబితే చంపేస్తా అంటూ వేటకొడవలి చూపిస్తూ దాన్ని గాల్లో తిప్పుతూ అందర్నీ భయపెట్టాడు. ఆంటీ భలే ఉందిరా, రాత్రి దీనితో ఎంజాయ్ చెయ్యాలి, దీని కూతురు భలే ఉందిరా బావమరిది, దానితో నువ్వు ఎంజాయ్ చెయ్యి అంటూ చాలా నీచంగా మాట్లాడారు. రౌడీ భాస్కర్ ఆగడాలను మహిళల భర్తలు ప్రశ్నించడానికి వెళ్లడంతో భాస్కర్ వారి మీద వేటకొడవలితో దాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. ఆ దెబ్బతో భయంతో మహిళల భర్తలు ప్రాణ భయంతో పరుగు తీసి ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.

ఆంటీల ఎంట్రీతో సీన్ రివర్స్

ఆంటీల ఎంట్రీతో సీన్ రివర్స్

రౌడీ భాస్కర్ కు అప్పటికే మద్యం మత్తు తలకు ఎక్కడం, మళ్లీ బావమరిదితో కలిసి వాడు రోడ్డు మీద మందు బాటిల్ ఓపెన్ చేసి తాగడంతో స్థానిక మహిళలకు చిర్రెత్తిపోయింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఆరు మంది మహిళలు ధైర్యంగా ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. మహిళలు అందరూ మాట్లాడుకుని నేరుగా రౌడీ భాస్కర్ దగ్గరకు ఒకేసారి వెళ్లి వారిని చుట్టుముట్టారు. రౌడి భాస్కర్, అతని బావమరిది వెల్లియన్ చేతిలో ఉన్న వేటకొడవళ్లు లాక్కోవడానికి ఆంటీలు ప్రయత్నించారు. ఆ సమయంలో మరింత రెచ్చిపోయిన రౌడీ భాస్కర్ గాల్లోకి వేటకొడవలి తిప్పుతూ మర్యాదగా వెళ్లిపోండి, లేదంటే చంపేస్తా అంటూ రెచ్చిపోయాడు. అయితే మహిళలు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.

ఎర్రచీర ఆంటీ ఎవరో కానీ......ఇరగదీసింది

ఎర్రచీర ఆంటీ ఎవరో కానీ......ఇరగదీసింది

ఆరు మందిలో ఎర్రచీర కట్టుకుని ఎర్రగా, లావుగా బలంగా ఉన్న ఆంటీ రౌడీషీటర్ చేతిలో ఉన్న వేటకొడవలి లాక్కొనింది. తరువాత వేటకొడవలి పక్కకు విసిరేసిన ఎర్రచీర ఆంటీ భాస్కర్ షర్టు చంపేసి పంచె లాగేసింది. అంతే మహిళలు అందరూ కలిసి రౌడీ భాస్కర్ ను నగ్నంగా తయారు చేసి నడిరోడ్డు మీద నిలబెట్టారు. ఆ సమయంలో ఒక్కసారిగా షాక్ కు గురైన రౌడీషీటర్ భాస్కర్, అతని బావమరిది వెల్లియన్ షాక్ కు గురై ఏం చెయ్యాలో అర్థం కాక నడిరోడ్డులో నిలబడ్డారు.

ఆడపులుల దెబ్బతో వీడియో వైరల్

ఆడపులుల దెబ్బతో వీడియో వైరల్

ఇంతకాలం రెచ్చిపోయిన రౌడీషీటర్ భాస్కర్ ఆడపులుల దెబ్బకు నడిరోడ్డులో నగ్నంగా నిలబడి ఉన్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే భాస్కర్ విషయంలో ఇంత వరకు ఎవ్వరూ ఫిర్యాదు చెయ్యలేదని, వీడియో ఆధారంగా విచారణ చేస్తున్నామని స్థానిక పోలీసులు అంటున్నారు. మొత్తం మీద ఆడపుల దెబ్బకు రౌడీషీటర్ తోక ముడిచడంతో కడలూరుతో పాటు తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+