చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Cheating:అర్దరాత్రి పెళ్లికూతురు జంప్,వేరే అమ్మాయితో అబ్బాయి పెళ్లి,క్లైమాక్స్ లో శవమైన గర్ల్ ఫ్రెండ్, రివర్స్

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తేన్ కాశి: యువతి, యువకుడికి పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడి పెళ్లి ఫిక్స్ కావడం, అమ్మాయి, అబ్బాయి దూరపు బంధువులు కావడంతో పెళ్లికి బంధవులు అందరిని పిలిచి వివాహం జోరుగా చెయ్యాలని అనుకున్నారు. యువతి, యువకుడి పెళ్లి నిశ్చితార్థం జరిగిపోయింది. పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. ఇరు వైపుల కుటుంబ సభ్యులు అందరికి పెళ్లి పత్రికలు పంచిపెట్టారు. దూరపు ప్రాంతంలో నివాసం ఉంటున్న బంధువులు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురి ఇంటికి చేరుకున్నారు. ముహుర్తం ముందు రోజు రాత్రి పెళ్లి కూతురు ప్రియుడితో లేచిపోయింది. మరుసటి రోజు అనుకున్న ముహూర్తానికి పెళ్లి కొడుకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇంత వరకు సినిమా స్టోరీలాగా కథ సాగిపోయింది. అయితే క్లైమాక్స్ లో ప్రియుడితో లేచిపోయిన యువతి నిర్జన ప్రదేశంలో శవమై కనిపించడం కలకలం రేపింది.

Fried wife: డ్రాప్ ఇస్తామని కారులో పిలుచుకుని వెళ్లి ఏం చేశారంటే ?, చాలాకాలం నుంచి స్కెచ్, వీడియోతో !Fried wife: డ్రాప్ ఇస్తామని కారులో పిలుచుకుని వెళ్లి ఏం చేశారంటే ?, చాలాకాలం నుంచి స్కెచ్, వీడియోతో !

ఒకే ఏరియాలో అమ్మాయి అబ్బాయి

ఒకే ఏరియాలో అమ్మాయి అబ్బాయి

తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాలోని కల్లికడైకురిచ్చి ప్రాంతంలో ఇసాకి రశ్మీ అలియాస్ రశ్మీ (23) అనే యువతి నివాసం ఉంటున్నది. ఇదే ప్రాంతంలో వెంకటేష్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వెంకటేష్, రశ్మీకి పెళ్లి చేద్దామని ఇరు వైపుల కుటుంబ సభ్యులు కొంతకాలంగా ఆలోచించారు.

నిశ్చితార్థం జరిగిపోయింది

నిశ్చితార్థం జరిగిపోయింది


రశ్మీ, వెంకటేష్ పెళ్లి చెయ్యాలని పెద్దలు కుర్చుని మాట్లాడుకున్నారు. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న వెంకటేష్, రశ్మీ పెళ్లి ఫిక్స్ కావడం, అమ్మాయి, అబ్బాయి దూరపు బంధువులు కావడంతో పెళ్లికి బంధవులు అందరిని పిలిచి వివాహం జోరుగా చెయ్యాలని ఇరువైపుల కుటుంబ సభ్యులు అనుకున్నారు. వెంకటేష్, రశ్మీల పెళ్లి నిశ్చితార్థం రెండు నెలల ముందే జరిగిపోయింది.

ప్రియుడితో పెళ్లి కూతురు జంప్

ప్రియుడితో పెళ్లి కూతురు జంప్

సెప్టెంబర్ 1వ తేదీన పెళ్లి చెయ్యాలని డేట్ ఫిక్స్ చేశారు. వెంకటేష్, రశ్మీల కుటుంబ సభ్యులు అందరికి పెళ్లి పత్రికలు పంచిపెట్టారు. దూరపు ప్రాంతంలో నివాసం ఉంటున్న బంధువులు పెళ్లి కొడుకు వెంకటేష్, పెళ్లి కూతురు రశ్మీ ఇంటికి చేరుకున్నారు. ముహుర్తం ముందు రోజు ఆగస్టు 31వ తేదీ రాత్రి పెళ్లి కూతురు రశ్మీ ఆమె ప్రియుడు రామ్ కుమార్ తో లేచిపోయింది.

వేరే అమ్మాయితో పెళ్లి కొడుకు పెళ్లి

వేరే అమ్మాయితో పెళ్లి కొడుకు పెళ్లి

రశ్మీ ఆమె ప్రియుడు రామ్ కుమార్ తో లేచిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. మా అమ్మాయి రశ్మీ కనపడటం లేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు. అయితే మరుసటి రోజు అనుకున్న ముహూర్తానికి పెళ్లి కొడుకు వెంకటేష్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రియుడు రామ్ కుమార్ తో లేచిపోయిన రశ్మీ కొన్ని రోజులు చెన్నైలో అతనితో కలిసి కాపురం చేసింది. అయితే మోజు తీరిపోయిందని రామ్ కుమార్ రశ్మీని చెన్నైలో వదిలేసి వెళ్లిపోయాడు.

క్లైమాక్స్ లో షాక్...... అడవిలో శవమైన రశ్మీ

క్లైమాక్స్ లో షాక్...... అడవిలో శవమైన రశ్మీ

రామ్ కుమార్ వదిలేసి వెళ్లిపోవడంతో ఇంటికి వెళ్లడానికి ధైర్యం చెయ్యలేని రశ్మీ ఆమె తండ్రి బంధువుల ఇంటికి వెళ్లింది. ఈనెల 6వ తేదీన ఇద్దరు వ్యక్తులు రశ్మీతో మాట్లాడాలని ఫోన్ చేసి ఆమెను బైక్ లో తేన్ కాశీ జిల్లాలోని కడయం సమీపంలోని అటవి ప్రాంతంలోకి పిలుచుకుని వెళ్లి ఆమెను దారుణంగా హత్య చేశారు. గురువారం రశ్మీ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది.

 పెళ్లికొడుకు తమ్ముడు హంతకుడు

పెళ్లికొడుకు తమ్ముడు హంతకుడు

రంగంలోకి దిగిన పోలీసులు రశ్మీ లేచిపోవడంతో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న వెంకటేష్ తమ్ముడు ఆనంద్ (22) అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తన అన్న వెంకటేష్ ను పెళ్లి చేసుకుంటానని ముహుర్తం ముందు రోజు వరకు అందరిని నమ్మించిన రశ్మీ చివరికి ప్రియుడు రామ్ కుమార్ తో పారిపోయి మా కుటుంబం పరువు తీసిందని, అందుకే స్నేహితుడు శివ (20)తో కలిసి రశ్మీని హత్య చేశామని ఆంనద్ అంగీకరించాడని తేన్ కాశీ పోలీసులు చెప్పాడు. ప్రియుడితో జీవితాంతం బతకాలని వెళ్లిన రశ్మీ మోసపోయి చివరికి హత్యకు గురికావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

English summary
Lady: Two arrested in murder case of young woman death near Tenkasi in Tamul Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X