Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady: భర్త వాకింగ్ కు వెళితే ఇంట్లోకి ఎంట్రీ, మహిళ రివర్స్, బైక్ లో పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు !

బెంగళూరు: వివాహిత మహిళ మీద కన్ను వేసిన అదే ప్రాంతంలోని కామాందుడు ఆమెను అనుభవించాలని అనేక ప్రయత్నాలు చేశాడు. వివాహం చేసుకుని భర్తతో కాపురం చేస్తున్నానని, నీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే నా భర్త నన్ను వదిలేస్తే నాజీవితం నాశనం అవుతుందని, దయచేసి నన్ను వదిలేయాలని ఆమె ఆ కామాందుడికి చెప్పింది. మహిళ మీద వ్యామోహం పెంచుకున్న అతను ఆమెను తన కోరిక తీర్చాలని చాలాకాలం నుంచి టార్చర్ పెడుతున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె మాత్రం అతని ప్రలోభాలకు లొంగలేదు. వేకువ జామున భర్త నిద్రలేచి వాకింగ్ వెళ్లిన సమయంలో మహిళ ఇంటిలోకి చొరబడిన ఆ నిందితుడు ఆమె మీద అత్యాచారం చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. మహిళ ఎదురు తిరుగడంతో అప్పటికే బైక్ లో వెంట తీసుకెళ్లిన పెట్రోల్ పోసి ఆమెకు నిప్పంటించి ఇంటి బయట తాళం వేసి పరారైనాడు. తీవ్రగాయాలై మహిళ ఆసుపత్రిలో 18 గంటలు మృత్యువుతో పోరాటం చేసింది. కోరిక తీర్చడానికి నేను నిరాకరించడంతో ఆ కామాంధుడు తన మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడని ఆమె స్థానిక మెజిస్ట్రేట్ కు, పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చి ప్రాణాలు వదిలేయడం కలకలం రేపింది.

భర్తతో కాపురం చేస్తున్న భార్య మీద కన్ను

భర్తతో కాపురం చేస్తున్న భార్య మీద కన్ను

కర్ణాటకలోని యాదగిరి జిల్లా సురపుర తాలుకాలోని శహాపురలో 23 సంవత్సరాల వయసు ఉన్న సౌజన్య (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. వివాహం చేసుకున్న సౌజన్యా ఆమె భర్తతో కాపురం చేస్తున్నది. భర్తతో చక్కగా కాపురం చేస్తున్న సౌజన్య చూడటానికి అందంగా ఉంటుందని సమాచారం.

 కామాంధుడి కన్నుపడింది

కామాంధుడి కన్నుపడింది

శహాపురలోనే గంగప్ప అలియాస్ గంగ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న సౌజన్య, గంగప్పకు ముందే పరిచయం ఉంది. సౌజన్యా మీద గంగప్ప కన్నుపడింది. వివాహిత మహిళ సౌజన్యా మీద కన్ను వేసిన అదే ప్రాంతంలోని కామాందుడు గంగప్ప ఆమెను అనుభవించాలని చాలాకాలం నుంచి అనేక ప్రయత్నాలు చేశాడు.

 నో చెప్పిన మహిళ

నో చెప్పిన మహిళ


సౌజన్యా భర్త బయటకు వెళ్లిన తరువాత గంగప్ప ఆమె ఇంటి దగ్గరకు వెళ్లి ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించేవాడు. నువ్వు అంటే నాకు ఇష్టమని, నా కోరిక తీర్చాలని, నాతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని గంగప్ప వివాహిత మహిళ సౌజన్యను టార్చర్ పెట్టాడని తెలిసింది. నేను ఇప్పటికే వివాహం చేసుకుని భర్తతో కాపురం చేస్తున్నానని, నీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే నా భర్త నన్ను వదిలేస్తే నాజీవితం నాశనం అవుతుందని, దయచేసి నన్ను వదిలేయాలని సౌజన్యా కామాందుడు గంగప్పకు నచ్చచెప్పింది.

 వాకింగ్ వెళ్లిన భర్త.... ఎంట్రీ ఇచ్చిన కామాంధుడు

వాకింగ్ వెళ్లిన భర్త.... ఎంట్రీ ఇచ్చిన కామాంధుడు


సౌజన్యా మీద వ్యామోహం పెంచుకున్న గంగప్ప ఆమెను తన కోరిక తీర్చాలని చాలాకాలం నుంచి టార్చర్ పెడుతున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సౌజన్యా మాత్రం గంగప్ప ప్రలోభాలకు లొంగలేదు. సోమవారం వేకువ జామున గంగప్ప క్యాన్ లో పెట్రోల్ తీసుకుని బైక్ లో సౌజన్యా ఇంటి దగ్గరకు వెళ్లాడు. వేకువ జామున సౌజన్య భర్త నిద్రలేచి వాకింగ్ వెళ్లిన సమయంలో కామాంధుడు గంగప్ప ఆమె ఇంటిలోకి చొరబడ్డాడు.

 పెట్రోల్ పోసి నిప్పంటించి ఇంటికి తాళం వేసి

పెట్రోల్ పోసి నిప్పంటించి ఇంటికి తాళం వేసి


ఇంట్లో ఒంటరిగా ఉన్న సౌజన్యా మీద కామాంధుడు గంగప్ప అత్యాచారం చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఎదురు తిరిగిన సౌజన్యా గట్టిగా కేకలు వెయ్యడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో రగిలిపోయిన గంగప్ప అప్పటికే బైక్ లో వెంట తీసుకెళ్లిన పెట్రోల్ క్యాన్ తీసుకెళ్లి సౌజన్య మీద పోసి ఆమెకు నిప్పంటించి ఇంటి బయట తాళం వేసి పరారైనాడు.

Recommended Video

    Sonu Sood Meets Crowd Of People Hoping For Help At Outside Of His House | Oneindia Telugu
     వాడే నాకు నిప్పంటించాడు

    వాడే నాకు నిప్పంటించాడు


    తీవ్రగాయాలై సౌజన్యా ఆసుపత్రిలో 18 గంటలు మృత్యువుతో పోరాటం చేసింది. కోరిక తీర్చడానికి నేను నిరాకరించడంతో కామాంధుడు గంగప్ప తన మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడని సౌజన్య స్థానిక మెజిస్ట్రేట్ కు, పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చి ప్రాణాలు వదిలేయడం కలకలం రేపింది. గంగప్ప పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని యాదగిరి జిల్లా ఎస్పీ డాక్టర్ వేదమూర్తి మంగళవారం మీడియాకు చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+