Lady: ఎక్స్ ప్రెస్ హైవే పక్కన ట్రాలీ బ్యాగ్, బాంబు భయం, ఓపెన్ చేసి చూస్తే యువతిని ?

లక్నో/మధురా: హైవే రోడ్డులో ఓ ట్రాలీ బ్యాగ్ వదిలేసి వెళ్లిపోయారు. ఎన్ని గంటలు అయినా ట్రాలీ బ్యాగ్ ఎవ్వరూ తీసుకోకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. కొందరు వెళ్లి ట్రాలీ బ్యాగ్ ఓపెన్ చెయ్యాలని అనుకున్నారు. ఏదైనా బాంబు ఉంటే మొదటికే మోసం వస్తుందని భయపడిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబు స్క్వాడ్ తో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాలీ బ్యాగ్ ఓపెన్ చూసి చూశారు. ట్రాలీలో యువతి శవం కనపడటంతో స్థానికులతో పాటు పోలీసులు హడలిపోయారు.

 యమునా ఎక్స్ ప్రెస్ హైవే రోడ్డు

యమునా ఎక్స్ ప్రెస్ హైవే రోడ్డు

ఉత్తరప్రదేశ్ లోని యమునా ఎక్స్ ప్రెస్ హైవేలో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు సంచరిస్తుంటాయి. యమునా ఎక్స్ ప్రెస్ హైవేలోని మధురా సమీపంలో ఎర్రటి పెద్ద ట్రాలీ బ్యాగ్ వదిలేసి వెళ్లిపోయారు. ఉదయం నుంచి ఆ బ్యాగ్ రోడ్డు పక్కనే పడిఉంది. ఎన్ని గంటలు అయినా ట్రాలీ బ్యాగ్ ఎవ్వరూ తీసుకోకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది.

 బాంబు ఉందని భయంతో ?

బాంబు ఉందని భయంతో ?

మధురా సమీపంలో నివాసం ఉంటున్న కొందరు వ్యక్తులు ట్రాలీ బ్యాగ్ దగ్గరకు వెళ్లి పరిశీలించారు, బ్యాగ్ లాక్ చేసి ఉండటంతో దానిని ఓపెన్ చెయ్యాలని కొందరు అనుకున్నారు. అయితే ట్రాలీ బ్యాగ్ లో బాంబు ఉంటే మొదటికే మోసం వస్తుందని, లేనిపోని సమస్యలు వస్తాయని భయపడిన స్థానికులు మధురా పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 అత్యాచారం చేసి హత్య ?

అత్యాచారం చేసి హత్య ?

బాంబు స్క్వాడ్ తో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎర్రటి ట్రాలీ బ్యాగ్ ఓపెన్ చూసి చూశారు. ట్రాలీలో సుమారు 22 ఏళ్ల వయసు ఉన్న యువతి శవం కనపడటంతో స్థానికులు హడలిపోయారు. యువతి మీద అత్యాచారం చేసి హత్య చేసి తరువాత ట్రాలీ బ్యాగ్ లో తీసుకు వచ్చి ఇక్కడ విసిరేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

 మిస్సింగ్ కేసులు ?

మిస్సింగ్ కేసులు ?

మధురాతో పాటు ఉత్తరప్రదేశ్ లో యువతుల మిస్సింగ్ కేసుల గురించి మధురా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ప్రియుడు హఫ్తాబ్ చేతిలో అతని ప్రియురాలు శ్రద్దా దారుణ హత్యకు గురి కావడం, ఆమె శరీరం ముక్కలు ముక్కలు చేసిన విషయం వెలుగు చూసిన తరువాత దేశంలో ఇలాంటి కేసులు ఎక్కువగా వెలుగు చూస్తుండటంతో సామాన్య ప్రజలు హడలిపోతున్నారు,

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+