లాలూ సెటైర్.. బలవంతం చేయడానికి కేజ్రీ ఏమైనా హీరోయినా..!
కొన్ని అరుదైన కాంబినేషన్లను పక్క పక్కన చూడడం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సాధ్యపడుతుంది. ఉదాహరణకు లాలూ ప్రసాద్-కేజ్రీవాల్ కాంబినేషన్ లాగా. నితీష్ ప్రమాణ స్వీకారం రోజు మీడియా కెమెరాలు ఈ ఇద్దరి మీద ఎంతగా ఫోకస్ చేశాయో అందరికీ తెలిసిన విషయమే. పైగా అదే వేదికపై లాలూ కేజ్రీవాల్ ను కౌగిలించుకోవడం మీడియాకి మంచి మైలేజ్ ఇచ్చే వార్తగా మారింది.
లాలూ చేసిన పనికి ఆ తర్వాత చాలామంది కేజ్రీవాల్ ను విమర్శించారు. లాలూ ఆలింగనంతో కేజ్రీకి కూడా అవినీతి మరకలు అంటుకున్నాయని ఎద్దేవా చేశారు. దానికి సమాధానంగా లాలూనే తనను బలవంతంగా ఆలింగనం చేసుకున్నారని వివరణ ఇచ్చారు కేజ్రీవాల్. తాజాగా ఇదే విషయంపై స్పందించిన లాలూ.. 'బలవంతంగా కౌగిలించుకోవడానికి కేజ్రీవాల్ ఏమైనా హీరోయినా..!' అని సెటైర్ వేశారు.

ఛలోక్తులు విసరడంలో లాలూ గురించి కొత్తగా చెప్పేదేముంది. ఆయన సెటైర్ వేశారంటే వైరల్ అయిపోవాల్సిందే. ఇంతకీ ఎప్పుడో జరిగిన విషయంపై లాలూ ఇప్పుడెందుకు సెటైర్ వేశారంటే..! అగస్గా వెస్టు ల్యాండ్ కుంభకోణంలో సోనియా గాంధీని, కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ సీఎం తీరును తప్పుబట్టిన ఆర్జేడీ నేత లాలూ కేజ్రీ అతిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పనిలో పనిగా అప్పట్లో జరిగిన సంఘటనపై కూడా తనదైన స్టైల్ లో ఓ సెటైర్ వేశారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications