Chandrayaan 3 landing: చేతికి అందబోతోన్న చందమామ: ఊపిరి బిగబట్టిన భారతావని

బెంగళూరు: ఇంకొన్ని గంటల్లో భారత్.. నింగిని జయించబోతోంది. చందమామపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగరబోతోంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. నేడు జాబిల్లి మీద అడుగు మోపబోతోంది. ఈ సాయంత్రం సరిగ్గా 6:04 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధృవంలో దిగబోతోంది ఈ మాడ్యుల్.

ఈ సువర్ణాధ్యాయం కోసం దేశం మొత్తం ఉత్కంఠతగా ఎదురు చూస్తోంది. జాబిల్లి మీద మువ్వన్నెల పతాకం ఎగురుతున్న వీడియో క్లిప్పులు, ఫొటోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. అంతరిక్షంపై ఇప్పటికే తన ఆధిపత్యాన్ని చాటుకున్న ఇస్రో.. ఇక చంద్ర మండలాన్ని జయించడాని ఉవ్విళ్లూరుతోంది.

Chandrayaan 3

ఇక అందరి దృష్టీ చంద్రయాన్ 3 మీదే నిలిచింది. గతంలో ఎదురైన చేదు సంఘటనలు పునరావృతం కాకూడదని యావత్ దేశం కోరుకుంటోంది. చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ కావాలని కోరుతూ పలువురు దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మసీదుల్లో ప్రార్థనలు జరిపారు.

బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్‌కు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం చంద్రయాన్ 3 ల్యాండింగ్ పట్ల ఉత్కంఠతగా ఎదురు చూస్తోన్నారు. వర్చువల్ విధానంలో ఆయన ల్యాండింగ్ ప్రక్రియను వీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎప్పటికప్పుడు మాడ్యుల్ పనితీరును పర్యవేక్షిస్తోన్నారు. ల్యాండింగ్ సమయంలో ఎలాంటి పొరపాట్లకూ అవకాశం ఇవ్వదలచుకోలేదు. 2019లో ప్రయోగించిన చంద్రయాన్ 2 విఫలమైన నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు.

Chandrayaan 3

ఇప్పటివరకూ చంద్రయాన్ 3 పనితీరులో ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తలేదు. దాని పనితీరు సంతృప్తికరంగా ఉంటోంది. చంద్రుడి ఉపరితలానికి మరింత చేరువైంది. ఈ మధ్యాహ్నానికి చంద్రుడి కక్ష్యలో 70 కిలోమీటర్ల ఎత్తున ఈ మాడ్యుల్ పరిభ్రమిస్తోంది. చందమామ ఆర్బిట్‌లో ఉన్న చంద్రయాన్ 2 ఆర్బిటర్‌తోనూ అనుసంధానమైంది.

ఈ సాయంత్రం 5:27 నిమిషాలకు ల్యాండింగ్ ప్రక్రియను ఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇస్రో అధికారిక వెబ్‌సైట్ isro.gov.in, యూట్యూబ్ https://youtube.com/watch?v=DLA_64yz8Ss, ఫేస్‌బుక్ పేజ్ https://facebook.com/ISRO ద్వారా ల్యాండింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+