కరుడుగట్టిన ఉగ్రవాది ఒమర్ ఖలీక్ అరెస్ట్: ఆయుధాలు సీజ్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో కరుడుగట్టిన లష్కరే తొయిబా ఉగ్రవాది సజీవంగా చిక్కాడు. ఉగ్రవాది ఒమర్ ఖలీక్‌ను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు.

లష్కరే తోయిబాకు చెందిన ఒమర్ లిక్, ఇండియాలో భారీ ఎత్తున విధ్వంసం జరపడమే లక్ష్యంగా సరిహద్దులు దాటి జమ్మూకాశ్మీర్ లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఇంటెలిజెన్స్ వర్గాలు సోపోర్ ప్రాంతంలో ఖలిక్‌ను అరెస్ట్ చేశాయి.
స్తుతం అతన్ని గుర్తు తెలియని ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నట్టు సమాచారం. ఒమర్ ఖలిక్ అరెస్టుపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.












Click it and Unblock the Notifications