Wife: వేరువేరు కాపురాలు, భార్యను పొడిచి చంపేసి శవం మీదపడుకుని విలపించిన భర్త, అసలు మ్యాటర్ ?
చెన్నై/ అరియలూరు: దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. భర్త వేరే ఇల్లు చూసి అక్కడికి వెళ్లాడు. అయితే భార్య మాత్రం ఆ ఇంటికి నేను రాను అని ఆమె మరో ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం మొదలుపెట్టింది. దంపతులు ఒకే ఇంటిలో ఉండే విషయంలో గొడవలు మొదలైనాయి. భార్యను ఎలాగైనా తన ఇంటికి పిలుచుకుని రావాలని భర్త అనేక ప్రయత్నాలు చేశాడు. నీ ఇంటికి వచ్చి నీతో కాపురం చెయ్యాలంటే మొదట నా కోరిక తీర్చాలని భార్య షరతులు పెట్టింది. భార్య డిమాండ్ తో భర్త విసిగిపోయాడు. మద్యం మత్తులో భార్య నివాసం ఉంటున్న ఇంటి దగ్గరకు వెళ్లిన భర్త రెచ్చిపోయాడు. కత్తి తీసుకుని భార్యను చంపేసిన భర్త పారిపోకుండా ఆమె శవం మీద పడుకుని బోరున విలపిస్తూ పోలీసులు వచ్చే వరకు అక్కడే ఉన్నాడు. భార్య ఏమి కోరిక కోరింది, భర్త ఆమెను ఎందుకు హత్య చేశాడు ? అని అసలు మ్యాటర్ తెలుసుకున్న స్థానికులు, పోలీసులు హడలిపోయారు.

ముంబాయి మహిళతో పెళ్లి
తమిళనాడులోని అరియలూరు జిల్లాలోని జయంగొండట్ ప్రాంతంలో జాఫర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ముంబాయికి చెందిన రియాజ్ అలియాస్ రియా అనే మహిళను జాఫర్ పెళ్లి చేసుకున్నాడు, కర్రీకట్టర్ గా పని చేస్తున్న జాఫర్ అతని భార్యను చాలా సంతోషంగా చూసుకునేవాడు.

ఇల్లు మార్చిన భర్త
జాఫర్, రియా దంపతులు వొడియూర్ పాళ్యంలోని పెరుమాల్ కోవిల్ స్ట్రీట్ లో సొంత ఇంటిలో కాపురం పెట్టారు. చాలా సంవత్సరాలు జాఫర్, రియా దంపతులు అదే ప్రాంతంలో నివాసం ఉండేవాళ్లు.జాఫర్ ప్రతిరోజు వొడియూర్ పాళ్యం నుంచి జయంగొండ ప్రాంతానికి వెళ్లి పని చేసే వచ్చేవాడు. ప్రతిరోజు ప్రయాణం చెయ్యలేక జాఫర్ విసిగిపోయి జయంగొండలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.
3. వాడికంటేనా

వేరే చోట కాపురం పెట్టిన భర్త
కొంతకాలం జయంగొండ ప్రాంతంలో భర్త జాఫర్ తో కలిసి రియా కాపురం చేసింది, రియా, జాఫర్ దంపతులు ఒకే ఇంటిలో ఉండే విషయంలో గొడవలు మొదలైనాయి. తరువాత వొడియూర్ పాళ్యంలోని ఇంటికి వెళ్లిపోయిన రియా నేను అక్కడే ఉంటానని ఆమె భర్త జాఫర్ కు చెప్పింది.

టాయిలెట్ కావాలని భార్య డిమాండ్
తనకు అద్దె ఇంటి దగ్గర ప్రత్యేకంగా టాయిలెట్ కట్టించాలని రియా ఆమె భర్త జాఫర్ కు చెప్పింది. ప్రత్యేకంగా బాత్ రూమ్, టాయిలెట్ కావాలని డిమాండ్ చేసిన రియా ఆ రెండు కట్టించే వరకు నేను ఈ ఇంటికి రాను అని తేల్చి చెప్పి వేరే ఇంటికి వెళ్లిపోయి అక్కడే ఉండిపోయింది. భార్య రియాను ఎలాగైనా తన ఇంటికి పిలుచుకుని రావాలని జాఫర్ అనేక ప్రయత్నాలు చేశాడు.

భార్య కోరికలు తీర్చలేకపోయాడు
నీ ఇంటికి వచ్చి నీతో కాపురం చెయ్యాలంటే మొదట నేను అడిగిన టాయిల్ కట్టించాలని, నా కోరిక తీరే వరకు నేను నీ ఇంటికి రాను అంటూ రియా షరతులు పెట్టింది. భార్య రియా టాయిలెట్ కావాలని పదేపదే డిమాండ్ తో చెయ్యడంతో ఆమె భర్త జాఫర్ విసిగిపోయాడు. కొత్తగా టాయిల్ కట్టించలేక జాఫర్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

భార్యను చంపేసి శవం మీద పడుకుని విలపించిన భర్త
మద్యం మత్తులో భార్య రియా నివాసం ఉంటున్న ఇంటి దగ్గరకు వెళ్లిన జాఫర్ రెచ్చిపోయాడు. కత్తి తీసుకుని భార్య రియాను చంపేసిన జాఫర్ అక్కడి నుంచి పారిపోకుండా ఆమె శవం మీద పడుకుని పోలీసులు వెళ్లే వరకు బోరున విలపిస్తూ అక్కడే ఉన్నాడు. రియా టాయిలెట్ కావాలని కోరిక కోరింది, అందుకే ఆమెను జాఫర్ హత్య చేశాడని అసలు మ్యాటర్ తెలుసుకున్న స్థానికులు, పోలీసులు షాక్ అయ్యారు. రియాను హత్య చేసిన జాఫర్ ను పోలీసులు అరెస్టు చేశారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications