‘లా’ విద్యార్థినిపై లైంగికదాడి : 11 మందికి జీవితఖైదు,
న్యాయ విద్యార్థినిపై లైంగికదాడి చేసిన 11 మందికి రాంచీ కోర్టు సోమవారం శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో గత నెల 26వ తేదీన 11 మందిని న్యాయస్థానం దోషులుగా ప్రకటించి.. తీర్పును సోమవారానికి వాయిదావేసింది. 11 మందికి జీవితఖైదు విధిస్తున్నట్టు జిల్లా జడ్జీ నవ్‌నీత్ కుమార్ తన తీర్పులో పేర్కొన్నారు. కుల్‌దీప్ ఒరాన్, నవీన్ ఓరాన్, బసంత్ కచ్చప్, రవీ ఒరాన్, రోహిత్ ఒరాన్, సునీల్ మందా, రిషి ఒరాన్ సహా 11 మందికి న్యాయస్థానం శిక్ష విధించింది.

గతేడాది నవంబర్ 26వ తేదీన తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి లా విద్యార్థి తిరిగి వస్తోన్నారు. రాంచీలో గల నేషనల్ లా వర్సిటీ నుంచి వారి స్కూటీలో పెట్రోల్ అయిపోయింది. అటుగా వస్తోన్న వాహనంలో సాయం అడగగా వారు యువతిని తమ వాహనంలోకి బలవంతంగా తీసుకెళ్లారు. సమీపంలోని ఇటుక బట్టిలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. యువతిని తీసుకొచ్చింి 8 మంది కాగా.. మరో నలుగురు చేరి, యువతిపై లైంగికదాడి చేశారు.
నిందితులపై నవంబర్ 17వ తేదీన యువతి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 12 మంది లైంగికదాడి చేసినట్టు గుర్తించారు. ఫోరెన్సిక్ ల్యాబిరేటరీ రిపోర్ట్ కూడా 12 మంది లైంగికదాడి చేసినట్టు పేర్కొన్నది. వీరిలో ఒకడు యువతిపై రెండుసార్లు లైంగికదాడికి తెగబడ్డాడు. మరొకడు మైనర్ కావడంతో.. అతని నేర విచారణను జువైనల్ కోర్టు చేపట్టనుంది.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..












Click it and Unblock the Notifications