ప్రియురాలు కాలేజ్ అమ్మాయి, ప్రియుడుడ్రైవర్, తండ్రి పోలీసు, రెండు సార్లు పరార్, చంపేస్తామని!
బెంగళూరు: ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులు మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. అమ్మాయి తండ్రి హెడ్ కానిస్టేబుల్ కావడంతో నవ దంపతులు ఆందోళన చెందుతున్నారు. మీరు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టం, కచ్చితంగా మీ ప్రాణాలు తీసేస్తాం అంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారని, దయ చేసి మా ప్రాణాలు కాపాడాలని ప్రేమికులు పోలీసు ఉన్నతాధికారులకు మనవి చేశారు.

అమ్మాయి ఇంటి ముందు గదిలో!
కర్ణాటకలోని దావణగెరె జిల్లా హరిహర పట్టణంలో పవిత్ర అనే కాలేజ్ అమ్మాయి నివాసం ఉంటోంది. పరప్పనహళ్ళి తాలుకా ఖండేకెరె గ్రామానికి చెందిన కోట్రేష్ అనే యువకుడు మూడు సంవత్సరాల క్రితం హరిహర పట్టణం చేరుకుని పవిత్ర ఇంటి ముందు గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. కోట్రేష్ జేసీబీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

ప్రేమలో పడిన పవిత్ర
గత రెండు సంవత్సరాల క్రితం పవిత్ర, కోట్రేష్ లకు పరిచయం అయ్యింది. పవిత్ర, కోట్రేష్ ల పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. జేసీబీ డ్రైవర్ గా పని చేసి తనను కోట్రేష్ బాగా చూసుకుంటాడని పవిత్రకు నమ్మకం కలిగింది.

పవిత్ర తండ్రి పోలీసు
పవిత తండ్రి హరిహర పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. పవిత్ర, కోట్రేష్ ప్రేమించుకుంటున్న విషయం తెలుసుకున్న ఆమె తండ్రి పెళ్లి చేసుకుంటే మీ అంతు చూస్తానని కుమార్తెను హెచ్చరించాడు. తండ్రి విషయంలో పవిత్ర మొదట ఆందోళన చెందింది.

బెంగళూరులో పెళ్లి
ఇంటి నుంచి పారిపోయిన పవిత్ర, కోట్రేష్ బెంగళూరు చేరుకుని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులో పవిత్ర, కోట్రేష్ ఉన్నారని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు గాలించి వారిని పట్టుకుని ఇద్దరినీ విడదీశారు. పవిత్రను ఇంటికి తీసుకెళ్లిన ఆమె కుటుంబ సభ్యులు గదిలో నిర్బంధించారని తెలిసింది.

మళ్లీ చెక్కేసిన ప్రేమికులు
రెండు రోజుల క్రితం గదిలో నుంచి చాకచక్యంగా తప్పించుకున్న పవిత్ర ప్రియుడు కోట్రేష్ తో కలిసి మళ్లీ పారిపోయింది. తాను ఇష్టప్రకారం కోట్రేష్ ను పెళ్లి చేసుకున్నానని, తన తండ్రి పోలీసు కావడం వలనే మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని, దయచేసి మాకు రక్షణ కల్పించాలని, మాకు ప్రాణహాని ఉందని పవిత్ర పోలీసు అధికారులకు మనవి చేసింది. కట్రేష్ కు తండ్రి లేడని, అతన్ని వివాహం చేసుకున్న అమ్మాయిని తన కుమార్తె లాగే చూసుకుంటానని అతని తల్లి అంటోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications