Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లవ్ మ్యారేజ్ చేసుకున్న భార్యకు అక్రమ సంబంధం ఉందని ?, రాత్రి భర్త ఇంట్లో ఏం చేశాడంటే !

బెంగళూరు/రాయచూరు: యువతి, యువకుడు కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించిన ప్రేమికులు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రేమించిన ప్రియుడి మాటలు నమ్మించిన ఆ యువతి పెద్దలను కాదని సబ్ రిజిస్టర్ ఆఫీసులో అతన్ని పెళ్లి చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తనను ఉద్దరిస్తాడని అతని వెంట వెళ్లింది. అయితే భర్త నిజంగానే లవ్ మ్యారేజ్ చేసుకున్న భార్యను దారుణంగా పొడిచి చంపేయడం కలకలం రేపింది.

కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని లింగసనూరు తాలుకాలోని చిక్కఉప్పేరి ప్రాంతంలో నివాసం ఉంటున్న బసవరాజ్ కు 10 ఏళ్ల క్రితం సునితా (30) అనే యువతి పరిచయం అయ్యింది. రెండుసంవత్సరాల ప్రేమించుకున్న బసవరాజ్, సునితా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. బసవరాజ్ కేటుగాడని, అతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు రోడ్డున పడుతావని, మేము మంచి సంబంధం చూస్తామని, అతన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే జీవితాంతం హ్యాపీగా ఉంటావని సునితాకు ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు.

Liquor addict husband killed his love married wife for having illicit relationship,

అయితే కుటంబ సభ్యులను ఎదిరించిన సునితా ఆమె ప్రియుడు బసవరాజ్ ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. 2015లో రాయచూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో బసవరాజ్, సునితా ప్రేమ వివాహాం చేసుకున్నారు. వివాహం చేసుకున్న ఏడాదిపాటు బసవరాజ్ అతని భార్య సునితాతో చాలా సంతోషంగా ఉండేవాడు. తరువాత బసవరాజ్ అతని అసలు స్వరూపం చూపించడంతో భార్య సునితా హడలిపోయింది.

పనిపాట చెయ్యకుండా తిరుగడం మొదలుపెట్టిన బసవరాజ్ మద్యం సేవించడం మొదలుపెట్టాడు. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు బసవరాజ్ మద్యం సేవిస్తున్నాడు. ఏపని చెయ్యకండా గాలికి తిరుగుతున్న భర్త బసవరాజ్ తీరుతో విసిగిపోయిన అతని భార్య సునితా చివరికి పొలం పనులకు వెళ్లి సంసారం సాగించడానికి డబ్బులు సంపాధించడం మొదలుపెట్టింది. ప్రేమ వివాహం చేసుకున్న భార్య సునితా పనికి వెలుతున్నా బసవరాజ్ ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించాడు.

చివరికి బసవరాజ్ మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వాలని అతని భార్య సునితాను వేధించడం మొదలుపెట్టాడు. మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వనని సునితా తేల్చి చెప్పింది. పని చెయ్యడానికి వెలుతున్న నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావని, ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ సాయంత్రం లేటుగా ఇంటికి వస్తున్నావని బసవరాజ్ అతని భార్య సునితాను చితకబాదడం మొదలుపెట్టాడు. అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని, మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వడం లేదని భార్య సునితా మీద బసవరాజ్ పగ పెంచుకున్నాడు.

ఇదే విషయంలో గొడవపడిన బసవరాజ్ పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లి అతని భార్య సునితతో గొడవ పెట్టుకున్నాడు. తరువాత సహనం కోల్పోయిన బసవరాజ్ కత్తి తీసుకుని అతని భార్య సునితాను ఇష్టం వచ్చినట్లు పొడిచి చంపేశాడు. లవ్ మ్యారేజ్ చేసుకున్న భర్తతో సుఖంగా ఉండాలని అనుకున్న సునితా చివరికి ఆమె భర్త బసవరాజ్ చేతిలోనే దారుణ హత్యకు గురికావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+