Liquor party: పోలీస్ స్టేషన్ లో పోలీసుల లిక్కర్ పార్టీ, ఆంధ్రా బార్డర్ లో ?, ఏంది చలపతి ఇది !
బెంగళూరు/కోలారు: పోలీసులుగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు విచ్చలవిడిగా లంచాలు వసూలు చేసి ఎంజాయ్ చేస్తున్నారు. సాయంత్రం దాటితే ఎస్ఐ ఇంటికి వెళ్లిపోవడంతో ఆ పోలీసులదే ఆడిందే ఆటగా పాడిందే పాటగా తయారైయ్యింది. పొరుగు రాష్ట్రం సరిహద్దులో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఉద్యోగాలు చేస్తుండటంతో పోలీసుల ఆగడాలకు అడ్డుఅదుపులేకుండా పోయింది. ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం మత్తులోనే పోలీసులు డ్యూటీ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దానికి తోడు పోలీసులు ఏకంగా ఉద్యోగం చేస్తున్న పోలీస్ స్టేషన్ లో దుకాణం ప్రారంభించి అక్కడే మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో వైరల్ అయ్యింది.

ఆంధ్రా బార్డర్ లో పోలీస్ స్టేషన్
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు జిల్లాలోని శ్రీనివాసపుర తాలుకాలోని గౌనిపల్లెలో పోలీస్ స్టేషన్ ఉంది. గౌనిపల్లె పోలీస్ స్టేషన్ లో చలపతి, మంజునాథ్, రమేష్ బాబు, అంజి అనే వ్యక్తులు కానీస్టేబుల్ గా ఉద్యోగాలు చేస్తున్నారు. కొన్ని ఊర్లకు, గ్రామాలకు ప్రతినిత్యం ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకలోకి, కర్ణాటకలో నుంచి ఆంధ్రప్రదేశ్ లోని వెళ్లాలంటే గౌనిపల్లె మార్గంలోనే వెళ్లాలి.

ఎంజాయ్ చేస్తున్న పోలీసులు
గౌనిపల్లె పోలీస్ స్టేషన్ లో పోలీసులుగా ఉద్యోగాలు చేస్తున్న చలపతి, మంజునాథ్, రమేష్ బాబు, అంజి విచ్చలవిడిగా లంచాలు వసూలు చేసి ఎంజాయ్ చేస్తున్నారు. సాయంత్రం దాటితే ఎస్ఐ ఇంటికి వెళ్లిపోవడంతో పోలీసులు చలపతి, మంజునాథ్, రమేష్ బాబు, అంజిలు ఆడిందే ఆటగా పాడిందే పాటగా తయారైయ్యిందని ఆరోపణలు ఉన్నాయి.

లిక్కర్ మత్తులో జల్సాలు ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులో ఉన్న గౌనిపల్లె పోలీస్ స్టేషన్ లో ఉద్యోగాలు చేస్తుండటంతో చలపతి, మంజునాథ్, రమేష్ బాబు, అంజి ఆగడాలకు అడ్డుఅదుపులేకుండా పోయిందని తెలిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం మత్తులోనే పోలీసులు డ్యూటీ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

పోలీస్ స్టేషన్ లో మందు పార్టీ
పోలీసులు చలపతి, మంజునాథ్, రమేష్ బాబు, అంజి ఏకంగా ఉద్యోగం చేస్తున్న పోలీస్ స్టేషన్ లో దుకాణం ప్రారంభించి అక్కడే మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మ్యాటర్ తెలుసుకున్న కోలారు జిల్లా ఎస్పీ దేవరాజ్ గౌనిపల్లె పోలీస్ స్టేషన్ కానీస్టేబుల్స్ చలపతి, మంజునాథ్, రమేష్ బాబును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

కొన్ని నెలల ముందే ?
కొన్ని నెలల క్రితం కూడా ఇదే పోలీస్ స్టేషన్ లో వీళ్లే మందు పార్టీ చేసుకున్న సమయంలో తీసిన వీడియో చిక్కడంతో రెండు వీడియోల మీద విచారణకు కోలారు జిల్లా ఎస్పీ దేవరాజ్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద ఆంధ్రా సరిహద్దులోని గౌనిపల్లె పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న పోలీసుల ఖర్మకాండ బయటకు రాడం హాట్ టాపిక్ అయ్యింది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications