Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సర్జికల్ స్ట్రైక్ 2.0: భారత వాయుసేనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు

పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాలు దాడులు చేసి ధ్వంసం చేశాయి. దాదాపు వెయ్యి కిలోల బాంబులు జారవిడిచినట్లు సమాచారం.భారత వైమానిక బృందం మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో పేలుడు పదార్థాలతో ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత్‌ పాక్‌ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Live updates: India Strikes Terror Camp Across LoC, Say Reports

Feb 26, 2019, 6:33 pm IST

దాడులు జరిగిన ప్రదేశం నుంచి మృతదేహాలను తరలిస్తున్న పాక్ సైన్యం
Feb 26, 2019, 6:32 pm IST

భారత దాడులకు సంబంధించి రుజువులను సాక్షాలను మాయం చేస్తున్న పాక్ సైన్యం
Feb 26, 2019, 6:31 pm IST

బాలాకోట్ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్న పాక్ సైన్యం
Feb 26, 2019, 5:30 pm IST

దాడుల తీరు అసలు దాడులు ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చిందో అఖిలపక్షానికి వివరిస్తున్న కేంద్రం
Feb 26, 2019, 5:27 pm IST

అఖిలపక్ష సమావేశంలో సర్జికల్ దాడుల గురించి విపక్షాలకు వివరిస్తున్న కేంద్రం
Feb 26, 2019, 5:24 pm IST

భారత్ పాక్‌లు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి. శాంతి మంత్రం పాటించాలి. లేదంటే భారీ నష్టం చవిచూడాల్సి వస్తుంది: ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిస్ పెయిన్
Feb 26, 2019, 5:20 pm IST

సమావేశానికి హాజరైన ఆజాద్, సీతారాం ఏచూరి, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, డి.రాజీ, ఒమర్ అబ్దుల్లా
Feb 26, 2019, 5:19 pm IST

సుష్మా స్వరాజ్ నేతృత్వంలో ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం
Feb 26, 2019, 2:17 pm IST

భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం, వ్యూహాత్మక ప్రాంతాలకు సైన్యాన్ని తరలించిన భారత ఆర్మీ
Feb 26, 2019, 2:16 pm IST

సైనిక సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం: మోడీ
Feb 26, 2019, 2:15 pm IST

దేశం సంబరాలు చేసుకోవాల్సిన రోజు ఈ రోజు: మోడీ
Feb 26, 2019, 2:15 pm IST

మెరుపుదాడి చేసిన వీరులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను: మోడీ
Feb 26, 2019, 2:14 pm IST

దేశం ఇప్పుడు సురక్షితంగా ఉంది : మోడీ
Feb 26, 2019, 2:08 pm IST

దాడుల దృష్ట్యా భారత జవాన్లకు సెలవులు రద్దు చేసిన భారత ఆర్మీ
Feb 26, 2019, 2:05 pm IST

రాజస్థాన్ బహిరంగ సభలో మోడీ ప్రసంగం..భారత్ మాతాకీ జై నినాదాలు
Feb 26, 2019, 2:04 pm IST

భారత వాయుసేనకు ప్రధాని మోడీ అభినందనలు
Feb 26, 2019, 2:04 pm IST

ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా పాక్ పార్లమెంటులో నినాదాలు
Feb 26, 2019, 2:03 pm IST

భారత్‌కు ధీటుగా బదులిస్తామన్న పాక్ ఆర్మీ
Feb 26, 2019, 2:03 pm IST

భారత్ దెబ్బకు పాక్‌లో కలవరం, అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన ఇమ్రాన్ ఖాన్
Feb 26, 2019, 12:38 pm IST

పీఓకేలో భారత వాయుసేన దాడుల తర్వాత భారత సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షిస్తున్న అజిత్ దోవల్, భారత ఆర్మీ ఛీఫ్ బిపిన్ రావత్,ఐఏఎఫ్ ఛీఫ్ దనోవా
Feb 26, 2019, 12:36 pm IST

గుజరాత్‌లోని అబ్దాసాలో పాక్ నిఘా డ్రోన్‌ను కూల్చివేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
Feb 26, 2019, 12:26 pm IST

ఐఏఎఫ్ దాడులపై సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశం: సుష్మాస్వరాజ్
Feb 26, 2019, 12:15 pm IST

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరిగిన దాడిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వివరించిన ప్రధాని నరేంద్ర మోడీ
Feb 26, 2019, 11:42 am IST

మరిన్ని దాడులు జరుగుతాయనే సమాచారం రావడంతోనే జైషే మొహ్మద్‌ను అంతమొందించాలని దాడులు చేశాం: విజయ్ గోఖలే
Feb 26, 2019, 11:35 am IST

దేశవ్యాప్తంగా మరిన్ని ఆత్మాహుతి దాడులు జరుగుతాయనే సమాచారం ఉంది: విదేశాంగ కార్యదర్శి గోఖలే
Feb 26, 2019, 11:34 am IST

జైషే మొహ్మద్ ఉగ్రశిబిరాలను మాత్రమే భారత వాయుసేన టార్గెట్ చేసి దాడులు జరిపింది:విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి
Feb 26, 2019, 11:33 am IST

బాలాకోట్ లో ఈ రోజు పెద్ద ఎత్తున భారత్ వైమానిక దాడులు జరిపింది:విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే
Feb 26, 2019, 11:33 am IST

పుల్వామా దాడుల్లో జైషే మొహ్మద్ పాత్ర ఉన్నట్లు ఇప్పటికీ పాక్ అంగీకరించడం లేదు. భారత్ ఎప్పటికప్పుడు ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని పాక్‌ను కోరుతోంది: విదేశీ వ్యవహారాల కార్యదర్శి
Feb 26, 2019, 11:26 am IST

పాక్ పై భారత వాయుసేన దాడులను అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
Feb 26, 2019, 11:22 am IST

ఐఏఎఫ్‌కు చెందిన మిరాజ్ యుద్ధ విమానం టార్గెట్ చేసి ధ్వంసం చేసిన ప్రాంతం పాకిస్తాన్‌లోని ఖైబర్ పక్తుంఖ్వా ప్రాంతంగా గుర్తించారు
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+