మాతృభూమిపై అడుగుపెట్టిన హీరో, పైలట్ అభినందన్‌కు ఘనస్వాగతం
శత్రుదేశం నుంచి వాఘా సరిహద్దుకు చేరుకున్నారు వాయుసేన పైలట్ అభినందన్. దీంతో అక్కడి పరిసర ప్రాంతాల్లో కోలాహలం ఏర్పడింది. ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. డప్పులు కొడుతూ, బాణాసంచా పేల్చుతూ ఆనందోత్సాహం వ్యక్తం చేస్తున్నారు. వెల్‌కమ్ రియల్ హీరో అంటూ ఫ్లెక్సీలు చేతబట్టారు. ఎయిర్ వైస్ మార్షల్ రవి కపూర్ పాక్ సైన్యం నుంచి అభినందన్ ను రిసీవ్ చేసుకోనున్నారు.

భారత్ దౌత్యవేత్తలకు అప్పగించినట్లుగా మొదట వార్తలు వచ్చాయి. అభినందన్‌ను ఇంకా అప్పగించలేదని పాకిస్తాన్ వర్గాలు చెప్పాయి. దౌత్యపరమైన టెక్నికల్స్ వల్ల ఆలస్యం అయిందని చెబుతున్నారు. దీంతో అభినందన్ విడుదలకు మరింత సమయం పట్టే అవకాశముంది. వాఘా బార్డర్ వద్ద వందలాది మంది భారతీయులు నిరీక్షిస్తున్నారు.
READ MORE












Click it and Unblock the Notifications