వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: తాగుబోతుల సంఘం జిందాబాద్, ఫెక్సీలు, బ్యానర్లు వైరల్, రోజుకు 500 మందికి, టోకన్లు !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ మదురై: తమిళనాడులో మద్యం విక్రయించడానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ రాష్ట్రంలోని తాగుబోతులు పండగ చేసుకుంటున్నారు. మద్యం విక్రయించడానికి కొన్ని షరతులు ఉండటంతో వేకువ జామున నుంచి టాస్మాక్ ( లిక్కర్ షాప్ లు) ముందు చెప్పులు, గొడుగులు, బ్యాగులు, హెట్మెట్లు ఇలా ఏదిపడితే అది తీసుకెళ్లి క్యూలో పెడుతున్నారు. మందుబాబులను గౌరవించండి, తాగుబోతుల సంఘం జిందాబాద్ అంటూ తమిళనాడులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు మద్యపాన నిషేధం కావాలని నినాదాలు చేస్తున్నారు, మేము మందు కావాలని డిమాండ్ చేస్తున్నాం అంటూ మందుబాబులకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఫెక్సీలు, బ్యానర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Lockdown: కాలేజ్ అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్, బీర్లు, బిరియానీలు, బ్లాక్ మెయిల్ !Lockdown: కాలేజ్ అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్, బీర్లు, బిరియానీలు, బ్లాక్ మెయిల్ !

మండేసూరీడు

మండేసూరీడు

తమిళనాడులో విపరీతంగా ఎండలు మండుతున్నాయి. ఎండలను సైతం లెక్క చెయ్యకుండా మందుబాబులు వైన్ షాప్ ల ముందుకు క్యూ కడుతున్నారు. ఇదే సమయంలో ఎండలో నిలబడలేని కొందరు మందుబాబులు క్యూ లైన్లలో చెప్పులు, గొడుగులు, బ్యాగులు, హెట్మెట్లు ఇలా ఏదిపడితే అది తీసుకెళ్లి పెడుతున్నారు. తరువాత వారి వంతు వచ్చిన వెంటనే వెళ్లి హ్యాపీగా వారికి కావలసి బ్రాండ్ మందు బాటిల్స్ తీసుకుని తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

రోజుకు 500 టోకన్లు

రోజుకు 500 టోకన్లు

ప్రతి వైన్ షాప్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మద్యం విక్రయించడానికి తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతే కాకుండా ప్రతి వైన్ షాప్ లో ముందుగా 500 టోకన్లు మాత్రమే జారీ చేస్తున్నారు. 500 టోకన్లుకు మించి ఎక్కువ టోకన్లు ఇవ్వకూడదని, ఎక్కువ మందికి మద్యం విక్రయించరాదని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చెయ్యడంతో మందు కొనుగోలు చెయ్యడానికి మందుబాబులు పోటీ పడుతున్నారు.

కరోనా జోన్లలో నో లిక్కర్

కరోనా జోన్లలో నో లిక్కర్

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు చెక్ పెట్టారు. చెన్నై సిటీలో మద్యం విక్రయాలు పూర్తిగా నిలిపివేశారు. ఇదే సమయంలో చెన్నై ప్రజలు చుట్టుపక్కల జిల్లాల వైన్ షాపుల దగ్గరకు వెళ్లిన మందుబాబులు వారి గొంతు తడుపుకుంటున్నారు.

తాగుబోతుల కోసం ఫెక్సీలు, బ్యానర్లు

తాగుబోతుల కోసం ఫెక్సీలు, బ్యానర్లు

తమిళనాడులో అనేక జిల్లాల్లో శనివారం మద్యం షాపులు తెరుచుకోవడంతో ఇప్పుడు మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో తాగుబోతులను గౌరవించండి, వారి వలన మీకు ఎలాంటి సమస్యలు ఉండవు అంటూ ఏర్పాటు చేసిన కొన్ని ఫెక్సీలు, బ్యానర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాగుబోతులు రోడ్ల మీద తూలుతూ వాలుతూ వెలుతుంటారని, వాళ్ల వలన మీకు ఎక్కడలేని నవ్వు తెప్పిస్తుందని తమిళనాడు లిక్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు సెల్లాపాండియన్ పేరు మీద ఏర్పాటు చేసిన ఫెక్సీలు, బ్యానర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మీరు మద్యనిషేధం అంటారు, మేము మద్యం సేవకులం

మీరు మద్యనిషేధం అంటారు, మేము మద్యం సేవకులం

అనేక సంఘ, సంస్థలు మద్య నిషేదం విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మీరు మద్య నిషేద చట్టం అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. మేము మద్యపానం కావాలని, మేము మందు సేవకులమని, మాకు మందు చాలా అవసరం అని చెప్పడంలో ఎలాంటి తప్పు అని పించడం లేదని తమిళనాడు లిక్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు సెల్లాపాండియన్ 2014లో కొన్ని బ్యానర్లు, ఫెక్సీలు ఏర్పాటు ఏర్పాటు చేయించారు.

Recommended Video

IPL Is The Best As Comapred To ICC Tournaments - Virat Kohli
తాగుబోతుల సంఘం జిందాబాద్

తాగుబోతుల సంఘం జిందాబాద్

2014లో సెల్లాపాండియన్ ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలు, బ్యానర్ల ప్రకటనల బోర్డులు ఇప్పుడు వ్యాట్సాప్, ఫేస్ బుక్ తో పాటు సోషల్ మీడియాలోని అనేక గ్రూప్ ల్లో చక్కర్లు కొడుతున్నాయి. మేము మద్యం సేవకులం, మాకు మందు కావాలని అనే నినాదంతో ఏర్పాట్లు చేసిన ఫెక్సీలు, బ్యానర్లు చూసి అనేక మంది తాగుబోతులు మాకు ఓ సంఘం ఉంది, ఇంకేం భయం లేదు అంటూ పండగ చేసుకుంటున్నారు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో మందుబాబులు తాగుబోతుల సంఘం జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు.

English summary
Lockdown: Tasmac shops reopen today in Tamil Nadu government actionA different advertising poster published by the Liquor drinkers Association in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X