Lockdown Lovers: చిక్కింది చాన్స్, ఏకాంతంలో ప్రేమికులు, అంతలోనే రివర్స్, పాపం పసివాడు !

బెంగళూరు/ మైసూరు: ప్రపంచం మొత్తం కరోనా వైరస్ (COVID 19) కష్టాలను ఎదుర్కొంటోంది. భారతదేశంలో కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి లాక్ డౌన్ అమలు చేశారు. అయితే కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న ప్రేమికులకు వారి పెద్దల నుంచి ఊహించని కష్టాలు ఎదురైనాయి. కరోనా లాక్ డౌన్ సందర్బంగా చాన్స్ చిక్కడంతో ఏకాంతంగా కలుసుకున్న ప్రేమికులు వారి పెద్దల కంట్లో పడ్డారు. పెళ్లికి అబ్బాయి, అతని తండ్రి నిరాకరించడంతో ప్రియురాలికి మండిపోవడంతో ప్రియుడు కటకటాలపాలైనాడు. తనను ఆ యువకుడు అత్యాచారం చేశాడని అమ్మాయితో పాటు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకు ముందు ఊరి పెద్దలు చేసిన పంచాయితీ బెడిసికొట్టడంతో పోస్కో చట్టం కింద అరెస్టు అయిన ప్రియుడు జైలుకు వెళ్లాడు.

లాక్ డౌన్ ప్రేమికులు

లాక్ డౌన్ ప్రేమికులు

కర్ణాటకలోని మైసూరు జిల్లా హెచ్.డి. కోటే తాలుకా హంపాపుర సమీపంలో ఓ యువకుడు, యువతి నివాసం ఉంటున్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి ఆ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇటీవల వీరు కలుసుకోవడం కొంచెం కష్టం అయ్యిందని తెలిసింది.

ఏకాంతంలో ప్రేమికులు

ఏకాంతంలో ప్రేమికులు

అమ్మాయి కుటుంబ సభ్యులు పని మీద గ్రామం సమీపంలోని పోలం దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో విషయం తెలుసుకున్న ప్రియుడు ప్రియురాలిని కలవడానికి వెళ్లాడు. ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడపడం మొదలుపెట్టారు. ఆ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు ఇంటి వచ్చిన విషయం గుర్తించలేని పరిస్థితిలో ప్రేమికులు ఏకాంతంలో మునిగిపోయాడు.

ప్రియుడి తండ్రికి ప్రియురాలు వార్నింగ్

ప్రియుడి తండ్రికి ప్రియురాలు వార్నింగ్

కుమార్తెను, ఆమె ప్రియుడిని చూడరాని చోట చూడటంతో ఆమె తండ్రికి మండిపోయింది. వెంటనే ఇద్దరిని గట్టిగా మందలించాడు. తరువాత మరుసటి రోజు అమ్మాయి నేరుగా అబ్బాయి ఇంటికి వెళ్లింది. నీ కుమారుడితో తన వివాహం జరిపించాలని అబ్బాయి తండ్రితో అమ్మాయి చెప్పింది. నేను చచ్చినా తన కొడుకుతో నీ పెళ్లి జరిపించనని అబ్బాయి తండ్రి తేల్చిచెప్పాడని తెలిసింది. ప్రియుడు సైతం తన తండ్రిని ఎదిరించి నిన్ను వివాహం చేసుకోలేదని అమ్మాయికి చెప్పాడు.

లాక్ డౌన్ పంచాయితి

లాక్ డౌన్ పంచాయితి

అబ్బాయి, అతని తండ్రి పెళ్లికి అంగీకరించకపోవడంతో అమ్మాయికి మండిపోయింది. తనను వివాహం చేసుకోవడానికి ప్రియుడు, అతని తండ్రి అంగీకరించడం లేదని వెళ్లి ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. అమ్మాయి తండ్రి ఆ ప్రాంతం పెద్దలను ఆశ్రయించాడు. జరిగింది ఏదో జరిగిపోయింది, అమ్మాయి, అబ్బాయికి పెళ్లి చెయ్యండి అని పెద్దలు పంచాయితీ చేశారు.

రేప్ కేసు పెట్టడంతో ప్రియుడు !

రేప్ కేసు పెట్టడంతో ప్రియుడు !

పెద్దలు చేసిన పంచాయితీ విఫలం కావడంతో అమ్మాయి నేరుగా వెళ్లి పోలీసులను ఆశ్రయించింది. తన ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో అబ్బాయి తన మీద అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమ్మాయి మైనర్ కావడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. అమ్మాయితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కేసు నమోదు చెయ్యాలని పట్టుబట్టారు. అబ్బాయి, అతని తండ్రి పెళ్లికి ససేమిరా అంగీకరించకపోవడంతో పోలీసులు పోస్కో చట్టం కింద అత్యాచారం కేసు నమోదు చేసి ప్రియుడిని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+