Lockdown: బ్యూటీ పార్లర్ ఆంటీ, బేకార్ ప్రియుడు, ఆ విషయంలో తేడా, ఇంట్లో భర్త లేని టైంలో ?
చెన్నై/ తిరుపూర్: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న వివాహిత మహిళ, బేకార్ గా తిరుగుతున్న యువకుడు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోవాలని బ్యూటీ పార్లర్ ఆంటీ నిర్ణయించింది. లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటున్న మహిళకు ప్రియుడి మీద వ్యామోహం ఎక్కువైయ్యింది. తనను వెంటనే పిలుచుకుని వెళ్లిపోవాలని పదేపదే ప్రియుడి మీద ఆ వివాహిత మహిళ ఒత్తిడి చేసింది. వివాహిత మహిళ టార్చర్ ను ఆమె ప్రియుడు తట్టుకోలేకపోయాడు. లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటున్న వివాహిత మహిళను ఆమె ప్రియుడు పక్కాప్లాన్ తో రాసలీలల సమయంలో చాకచక్యంగా చంపేశాడు.

బ్యూటీ పార్లర్ ఆంటీ
తమిళనాడులోని తరుపూర్ జిల్లా ముత్తుకూరు కొడుముడి ప్రాంతంలో యువరాజ్ (37), సంగీత (34) దంపతులు నివాసం ఉంటున్నారు. యువరాజ్, సంగీత దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంగీత కొన్ని సంవత్సరాల నుంచి సొంతంగా బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నది.

బేకార్ యువకుడితో లింక్
సంగీత నివాసం ఉంటున్న కొడిముడి ప్రాంతంలోనే వివేక్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. పనిపాట లేకుండా వివేక్ బేకార్ గా తిరుగుతున్నాడు. బ్యూటీ పార్లర్ దగ్గరకు వెళ్లి వస్తున్న సంగీతకు వివేక్ కు పరిచయం అయ్యాడు. వీరి పరిచయంతో ఇద్దరు చనువుగా ఉన్నారు. అయితే ఓ వర్షం కురిసిన రాత్రి సినిమా స్టోరిలో లాగా సంగీత, వివేక్ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది.

వార్నింగ్ ఇచ్చిన భర్త
సంగీత వ్యవహారం తెలుసుకున్న ఆమె భర్త యువరాజ్ భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. పద్దతి మార్చుకోకపోతే నీకథ, వివేక్ కథ చూస్తానని యువరాజ్ భార్య సంగీతను హెచ్చరించాడు. అయితే సంగీత మాత్రం ఆమె పద్దతి మార్చుకోలేదు. తన భార్య సంగీత విషయం పిల్లలకు తెలిస్తే వారు పెడదోవ పడుతారని, ఈ విషయం పదిమందికి తెలిస్తే పరువు పోతుందని యువరాజ్ ఆవేదన చెందాడు.

భర్త, పిల్లలను వదిలేయ్యడానికి రెఢీ
తన భర్త యువరాజ్ తో పాటు ఇద్దరు పిల్లలను వదిలేసి నీతోపాటు వచ్చేస్తానని, తాను బ్యూటీ పార్లర్ నిర్విహిస్తూ నీకు అవసరాలకు డబ్బులు కూడా ఇస్తానని, తనను పెళ్లి చేసుకోవాలని సంగీత ప్రియుడు వివేక్ కు చెప్పింది. అయితే టైంపాస్ కోసం ఇంత కాలం ఎంజాయ్ చేసిన పిల్లల తల్లిని పెళ్లి చేసుకోవడానికి వివేక్ వెనకడుగు వేశాడు. అయితే సంగీత మాత్రం కొన్ని నెలల నుంచి తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడు వివేక్ ను వేధింపులకు గురి చెయ్యడం మొదలుపెట్టింది.

రాసలీలల కోసం ఇంటికి !
లాక్ డౌన్ సందర్బంగా బ్యూటీ పార్లర్ మూతపడటంతో గత రెండు నెలల నుంచి ఇంట్లోనే ఉంటున్న సంగీత ప్రియుడు వివేక్ ని చూడలేక, అతనితో ఎంజాయ్ చెయ్యలేకపోయింది. పదేపదే ఒత్తిడి చేస్తున్న సంగీతను ఎలాగైనా చంపేయాలని వివేక్ నిర్ణయించాడు. భర్త యువరాజ్ బయటకు వెళ్లడంతో సంగీత ఆమె ప్రియుడు వివేక్ కు ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పింది. సంగీత ఇంటికి వెళ్లిన వివేక్ ఆమెతో బెడ్ రూంలో రాసలీలలు సాగించాడు.
Recommended Video

పక్కాప్లాన్ తో ప్రియురాలి హత్య
రాసలీలలు సాగించిన తరువాత సంగీతకు మాయమాటలు చెప్పి ఆమెతో విషం మాత్రలు మింగించాడు. విషం మాత్రలు మింగిన సంగీత బెడ్ రూంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆమె గొంతు నులిమి హత్య చేసిన వివేక్ అక్కడి నుంచి తప్పించుకుని పరారైనాడు. ఇంటికి వచ్చిన భర్త యువరాజ్ విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వివేక్ ను అరెస్టు చేశారు. పెళ్లి చేసుకోవాలని ఎక్కువ ఒత్తిడి చెయ్యడం వలనే తాను సంగీతను హత్య చేశానని వివేక్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications