ఇండియాకు బిగ్ షాక్..!!

Mamata Banerjee: దేశం.. ఎన్నికల ఏడాదిలో ప్రవేశించింది. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చిలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

Lok Sabha elections 2024: TMC will contest alone, says Mamata Banerjee

ఈ క్రమంలో ఇండియా కూటమికి బిగ్ షాక్ తగిలింది. ఈ అలయెన్స్‌లో కీలకంగా వ్యవహరిస్తోన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ సంచలన అడుగు వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

తృణమూల్ కాంగ్రెస్- కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై కొద్దిరోజులుగా చర్చలు సాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉండగా.. వాటి పంపకాలపై ఈ రెండు పార్టీల మధ్య వరుసగా సమావేశాలు ఏర్పాటవుతున్నాయి.

రాష్ట్రంలో ఉన్న 42 లోక్‌సభ స్థానాల్లో రెండింటిని మాత్రమే కాంగ్రెస్‌కు ఇస్తామని తృణమూల్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ మాత్రం ఎనిమిది నుంచి 14 స్థానాలను డిమాండ్ చేస్తోంది. దీనిపై ఈ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదు. చర్చలు కొలిక్కి రావట్లేదు. మంగళవారం రాత్రి కూడా సుదీర్ఘంగా మంతనాలు సాగాయి. రెండు లోక్‌సభ స్థానాలను మాత్రమే తీసుకోవడానికి అంటు కాంగ్రెస్ అంగీకరించట్లేదు.

ఈ నేపథ్యంలో మమత బెనర్జీ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. ఎలాంటి పొత్తులూ ఉండబోవని స్పష్టం చేశారు. సీట్ల పంపకాల విషయంలో తాము పెట్టిన ప్రతిపాదనలను కాంగ్రెస్ అంగీకరించట్లేదని, వారు పెట్టిన డిమాండ్లకు అంగీకరించడానికి తాముు సిద్ధంగా లేమనీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+