ఫోన్ పేతో లంచం, ఇంజనీరుకు గూగుల్ లో మొత్తం సినిమా చూపించిన లోకాయుక్త, మ్యాటర్ !

ప్రభుత్వ అధికారులు లంచాలకు అలవాటు పడ్డారని దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు ఆరోపిస్తుంటారు. లంచాలు తీసుకునే కొందరు అధికారుల వలన ప్రభుత్వ అధికారులకు చెడ్డపేరు వస్తోందని నీతినిజాయితీ కలిగిన అధికారులు మండిపడుతున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగం చేసే కొందరు ఉద్యోగులు ఏదో ఒకరూపంలో లంచాలు తీసుకుంటూనే ఉన్నారనేది జగమెరిగిన సత్యం.

లంచాలు తీసుకుంటున్న అధికారుల భరతం పట్టడానికి సీబీఐ, ఈడీ, సీఐడీ, ఏసీబీ, లోకాయుక్త ఇలా పలు సంస్థల అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అధికారుల ఎత్తులకు పైఎత్తులు ఏస్తున్న అవినీతి అధికారులు మాత్రం వారిపని వాళ్లు చేస్తూ చాపకింద నీరులా లంచాలు తీసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. అవినీతి సొమ్ముతో ఇప్పటికే వందల కోట్ల రూపాయలు సంపాధించినఅధికారులు సీబీఐ, లోకాయుక్త, ఏసీబీ అధికారులకు చిక్కిపోవడంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

Lokayuktas departmental engineer caught red-handed while taking bribe from contractor through phone pay

ఓకాంట్రాక్టర్ వద్ద రూ 10,000 లంచం డిమాండ్ చేసి తరువాత క్యాష్ కాకుండా ఫోన్ పే ద్వారా రూ. 5, 000 లంచం తీసుకున్న కర్ణాటకలోని లింగసునూరు బెస్కాం ఏఈఈ లోకాయుక్త వలలో పడ్డారు. కెంచప్ప అనే బెస్కాం ఏఈఈ లోకాయుక్త వలలో పడి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. అవినీతి అధికారి కెంచప్ప రూ 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. కెంచప్ప డిమాండ్‌ మేరకు రూ 5, 000 రూపాయల ఫోన్‌ పే చెల్లించాడు. మిగిలిన 5000 రూపాయలు తీసుకుంటుండగా సదరు అధికారి కెంచప్ప రెడ్ హ్యాండెడ్‌గా లోకాయుక్త ఉచ్చులో పడ్డాడు.

లంచం తీసుకుంటుండగా ఏఈఈ అధికారి కెంచప్పపై దాడి చేసి విచారించిన లోకాయుక్త అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఏఈఈ కెంచెప్ప ఆరోగ్యం క్షీణించి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే కెంచప్పను విచారణ చెయ్యకుండా అతన్ని లోకాయుక్త అధికారులు లింగాసూరు తాలూకా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర వాంతులతో బాధపడుతున్న అవినీతి అధికారి కెంచప్ప. లింగసూగూరులోని బెస్కాం కార్యాలయంలోనే లోకాయుక్త అధికారులకు చిక్కిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+