Love Jihad: బర్త్ డే పార్టీ, గంటలోనే సినిమా, జైల్లో యువకుడు, లవ్ జీహాద్ దెబ్బ, పక్కాసాక్షం, వాడికేనా?
లక్నో/ఉత్తరప్రదేశ్: బర్త్ డే పార్టీకి వెళ్లి స్నేహితురాలితో కలిసి నడుచుకుంటూ వెలుతున్న యువకుడికి గంటలోనే సినిమా కష్టాలు ఎదరైనాయి. అమ్మాయితో కలిసి వెలుతున్న ముస్లీం యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు జైల్లో పెట్టారు. వారం రోజుల పాటు ఆ యువకుడు జైల్లో ఉన్నాడు. ఏం జరిగింది సార్ అంటూ అబ్బాయి కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకున్నారు. లవ్ జీహాద్ కు స్కెచ్ వేశాడు, అందుకే అరెస్టు చేశామని పోలీసులు సమాధానం చెబుతున్నారు. 18 ఏళ్లకే వాడికి ఇని తెలివితేటలు ఉంటే, మేము పోలీసులు మాకు ఎన్ని తెలివితేటలు ఉంటాయి అంటూ మామలు ప్రశ్నిస్తున్నారు.

డిసెంబర్ 15వ తేదీ రాత్రి 11. 30 గంటలు
ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూర్ ప్రాంతంలో డిసెంబర్ 15వ తేదీ రాత్రి 11. 30 గంటల సమయంలో 18 ఏళ్ల అబ్బాయి, 16 ఏళ్ల అమ్మాయి నడుచుకుంటూ వెలుతున్నారు. అదే సమయంలో కొందరు యువకులు ఇద్దరిని పట్టుకున్నారు. అబ్బాయి, అమ్మాయిని ప్రశ్నించిన తరువాత వారు వేరువేరు మతాలకు చెందిన వారని తెలుసుకున్న ఆ యువకులు రెచ్చిపోయారని తెలిసింది. కర్రలు తీసుకుని యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.

లవ్ జీహాద్ కేసులో అరెస్టు
హిందూ అమ్మాయికి మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకుని బలవంతంగా మంత మార్చి వివాహం చేసుకోవడానికి ప్రయత్నించాడని ఆయువకుడి మీద కేసు నమోదు చేసి ఎస్పీ, ఎస్టీ, పోక్సో చట్టం, లవ్ జీహాద్ సెక్షన్ ల కింద అరెస్టు చేశారు. హిందూ యువతితో కలిసి వెళ్లిన ఆ ముస్లీం యువకుడు వారం రోజులుగా జైల్లో ఉన్నాడు.

17 ఏళ్లు... కాదు 18 ఏళ్లు
పోలీసులు అరెస్టు చేసిన ముస్లీం యువకుడు డెహ్రాడూన్ లోని వెల్గింగ్ షాప్ లో వెల్డర్ గా పని చేస్తున్నాడని, అతనికి 17 ఏళ్లు వయసు మాత్రమే అని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే అరెస్టు అయిన ముస్లీం యువకుడికి 18 ఏళ్లు ఉన్నాయని పోలీసులు అంటున్నారు. ముస్లీం యువకుడికి 17 ఏళ్లు వయసు అని చెప్పడానికి అతని కుటుంబ సభ్యుల దగ్గర ఎలాంటి దృవీకరణ పత్రాలు లేవని, కేసు నుంచి తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నారని పోలీసులు అంటున్నారు.

ఇదీ ముస్లీం యువకుడి స్టోరీ
హిందూ దళిత అమ్మాయిని బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నించిన ముస్లీం యువకుడు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడని, అతని వయసు తగ్గించి చూపించి కేసు నుంచి తప్పించుకోవడానికి అతని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని, పక్కా సాక్షాలతో మేము కేసు నమోదు చేశామని ధంపూర్ పోలీస్ స్టేషన్ పోలీసు అధికారి అరుణ్ కుమార్ ది ఇండియన్ న్యూస్ ఎక్స్ ప్రెస్ మీడియాకు చెప్పారు.

అమ్మాయి స్టేట్ మెంట్ ఇచ్చింది
హిందూ మైనర్ అమ్మాయి, ఆమె తండ్రి ఫిర్యాదు మేరకే కేసు నమోదు అయ్యిందని, ఇప్పటికే బాధిత బాలిక మెజిస్ట్రేట్ ముందు స్టేట్ మెంట్ ఇచ్చిందని, పక్కాసాక్షాలతోనే ఆ యువకుడిని అరెస్టు చేశామని పోలీసు అధికారి అరుణ్ కుమార్ అంటున్నారు. అయితే ముస్లీం యువకుడి మీద తాము తప్పుడు కేసు (లవ్ జీహాద్) నమోదు చెయ్యలేదని ఉత్తరప్రదేశ్ పోలీసులు ట్వీట్ చేశారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications