Viral Video: ప్రేయసి ఫోన్ ఎత్తలేదని.. ఊరికే కరెంటు కట్ చేసిన ప్రియుడు

Viral Video: ప్రేమలో అలిగినప్పుడు సాధారణంగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడం మెసేజ్‌లకు రిప్లై ఇవ్వకపోవడం జరగుతుంటాయి. కానీ ఓ యువకుడు తన ప్రేయసి ఫోన్ ఎత్తలేదని ఏకంగా ఆమె గ్రామానికి వెళ్లే కరెంట్ వైర్లనే కత్తిరించి వార్తల్లో నిలిచాడు. ఈ వింత సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో ఏం ఉందంటే?
ఆ వీడియోలో ఒక యువకుడు కరెంట్ పోల్ ఎక్కి.. పెద్ద కటింగ్ ప్లయర్‌తో వైర్లను కత్తిరించడం కనిపిస్తుంది. దీంతో ఆ గ్రామంలో విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. ఈ 17 సెకన్ల వీడియో లక్షల మంది దృష్టిని ఆకర్షించింది. తన ప్రేయసి ఫోన్ ఎత్తడం లేదని.. కరెంట్ లేకపోతే ఆమె టీవీ ఆఫ్ చేస్తుందని.. అప్పుడు తనతో మాట్లాడక తప్పదని ఆ యువకుడు ఆ పని చేసి ఉంటాడని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Lover Cuts Off Power to Girlfriend s Village for Not Answering Phone Viral Video

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
అయితే, ఈ వీడియోను ఓ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. "మహిళ ఫోన్ బిజీగా ఉన్నందుకు కోపంతో ప్రేమికుడు ఆమె గ్రామానికి కరెంటు కట్ చేశాడు" అని క్యాప్షన్ లో రాశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 1.5 కోట్లకు పైగా వ్యూస్, 2.5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. ఒక నెటిజన్ "అతను బాలీవుడ్ సినిమాలు చూడటం మానుకోవాలి" అని కామెంట్ పెట్టాడు.మరో యూజర్ "తన తెలివిని సరైన విధంగా ఉపయోగించుకుంటున్నాడు" అని రాశారు. ఇంకో యూజర్ "అరే భాయ్, ఈ సర్వీస్‌కు ఎంత ఛార్జ్ చేస్తావు?" అని అడిగాడు."కరెంటు పోతే మొబైల్ స్విచ్ ఆఫ్ అవుతుందని అతడు భావిస్తున్నాడు" అని మరో యూజర్ కామెంట్ చేశాడు.ఈ వీడియోలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, యువకులు ప్రేమలో ఎంత దూరం వెళ్లగలరో చూపించడానికి ఇది ఒక ఉదాహరణగా నిలిచిందని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+