బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lover: ప్రేమలో పడిన లేడీ కానీస్టేబుల్, ప్రియుడు, అతని తల్లి ఏం చేశారంటే, ప్రియురాలు ఆత్మహత్య !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ శివమొగ్గ: డిగ్రీ పూర్తి చేసిన యువతికి పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కూతురికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువకుడు పరిచయం కావడంతో లేడీ కానిస్టేబుల్ అతని ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి కొన్ని సంవత్సరాల నుంచి సంతోషంగా జీవిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ప్రేమికులు పెళ్లి చేసుకోవడాని కులం అడ్డు వచ్చింది. చివరికి ప్రియుడు తల్లి పెళ్లికి అంగీకరించడంతో ఇద్దరూ సంతోషించారు.

అయితే ప్రియురాలి జాతకం స్వామీజీకి చూపించిన ప్రియుడి తల్లి పెళ్లికి వ్యతిరేకించింది. ప్రియురాలికి కుజదోషం ఉందని, పెళ్లి చేసుకుంటే నీ కొడుక్కి ఆయుషు తగ్గిపోతుందని స్వామీజీ ప్రియుడి తల్లికి చెప్పాడని తెలిసింది. ఇదే సమయంలో ప్రియుడు తల్లి ప్రియురాలికి ఫోన్ చేసి నువ్వు మా అబ్బాయి జోలికి వస్తే నీ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చింది. ప్రియుడు కూడా నేను పెళ్లి చేసుకోలేను అని హ్యాండ్ ఇచ్చేశాడు. ఆవేదనతో లేడీ కానీస్టేబుల్ విషం సేవించి రెండు వారాలకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు వదిలేసింది.

Illegal affair: ప్రియుడి మోజులో పడిన భార్య, భర్తకు చిన్నగాయం కాకుండా నిద్రలోనే చంపేసిన భార్య, స్కెచ్ !Illegal affair: ప్రియుడి మోజులో పడిన భార్య, భర్తకు చిన్నగాయం కాకుండా నిద్రలోనే చంపేసిన భార్య, స్కెచ్ !

 లేడీ పోలీసు ఉద్యోగం

లేడీ పోలీసు ఉద్యోగం

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని భద్రావతి తాలుకాలోని కల్లాపురలో సుధా అనే యువతి నివాసం ఉంటున్నది. డిగ్రీ పూర్తి చేసిన సుధాకు పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది. శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి పోలీస్ స్టేషన్ లో సుధా కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కూతురు సుధాకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు.

 ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు

ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు

కర్ణాటకలోని బెళగావిలో నివాసం ఉంటున్న ప్రవీణ్ కుమార్ అలియాస్ ప్రవీణ్ అనే యువకుడు అటవి శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. 7 సంవత్సరాల క్రితం ప్రవీణ్, లేడీ కానిస్టేబుల్ సుధాకు పరిచయం అయ్యింది. ఆరు సంవత్సరాల నుంచి ప్రవీణ్, కానిస్టేబుల్ సుధా ప్రేమించుకుంటున్నారు. సుధా, ప్రవీణ్ ఇద్దరూ ఆరు సంవత్సరాల నుంచి లవర్స్ గా తిరుగుతూ సంతోషంగా జీవిస్తున్నారు.

 లేడీ పోలీసు పెళ్లికి కులం అడ్డు వచ్చింది

లేడీ పోలీసు పెళ్లికి కులం అడ్డు వచ్చింది

ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ప్రేమికులు ప్రవీణ్, సుధా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరుకావడంతో వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. కొంతకాలం తరువాత ప్రియుడు ప్రవీణ్ తల్లి పెళ్లికి అంగీకరించడంతో ఇద్దరూ సంతోషించారు. అయితే ప్రియురాలు సుధా జాతకం స్వామీజీకి చూపించిన ప్రియుడి ప్రవీణ్ తల్లి పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని వ్యతిరేకించింది.

 ప్రియురాలికి కుజదోషం ఉందని చెప్పిన స్వామీజీ

ప్రియురాలికి కుజదోషం ఉందని చెప్పిన స్వామీజీ

ప్రియురాలు సుధాకు కుజదోషం ఉందని, పెళ్లి చేసుకుంటే నీ కొడుకు ప్రవీణ్ ఆయుషు తగ్గిపోతుందని స్వామీజీ ప్రియుడి తల్లికి చెప్పాడని తెలిసింది. ఇదే సమయంలో ప్రియుడు ప్రవీణ్ తల్లి ప్రియురాలు సుధాకు ఫోన్ చేసి నువ్వు మా అబ్బాయి జోలికి వస్తే నీ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చింది. ప్రియుడు ప్రవీణ్ దూరం అవుతాడని లేడీ కానిస్టేబుల్ సుధా ఆవేదన చెందింది.

 హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు.... ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు

హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు.... ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు

ప్రియుడు ప్రవీణ్ కూడా ప్రాణభయంతో కుజదోషం ఉన్న నిన్ను నేను పెళ్లి చేసుకోలేను అని లేడీ కానిస్టేబుల్ సుధాకు హ్యాండ్ ఇచ్చేశాడు. ఆవేదనతో లేడీ కానీస్టేబుల్ సుధా 16 రోజుల క్రితం విషం సేవించింది. రెండు వారాలకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లేడీ కానిస్టేబుల్ సుధా ప్రాణాలు వదిలేసిందని పోలీసులు తెలిపారు. ప్రియుడు ప్రవీణ్ తో పాటు అతని తల్లి టార్చర్ పెట్డడం వలనే సుధా ఆత్మహత్య చేసుకుందని లేడీ పోలీసు కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు.

English summary
Lover: Lady constable commits suicide after refuses to marry her at Shivamogga in Karnataka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X