Lovers: ప్రియుడిది తక్కువ కులం, ప్రియరాలి పెళ్లి ఏర్పాట్లు పూర్తి, పెళ్లి ఆపేస్తాడనే భయంతో పక్కాప్లాన్ !
కన్యాకుమారి/చెన్నై: ఒకే కాలేజీలో చదువుతున్న యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. ఒకే ప్రాంతం నుంచి కాలేజ్ కు వెళ్లి వస్తున్న సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. వివాహం చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని యువతి యువకుడు అనుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరుకావడంతో కొంతకాలం వేచి చూసి పెద్దలకు నచ్చచెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. యవకుడు కాంట్రాక్టు పనులు చేయిస్తున్నాడు. మా అమ్మాయిని తక్కువ కులం వాడు ప్రేమిస్తున్నాడని అమ్మాయి కుటుంబ సభ్యులు రగిలిపోయారు. పెద్దలు పంచాయితీలు పెట్టి యువకుడికి వార్నింగ్ ఇచ్చాడు. మా కులం అమ్మాయి జోలికి వస్తే మీ అంతు చూస్తామని ప్రియుడితో పాటు అతని కుటుంబ సభ్యులకు వార్నింగ్ ఇచ్చారు. వెంటనే యువతికి వేరే యువకుడితో పెళ్లి ఫిక్స్ చేసి పెళ్లి పనులు ముమ్మరం చేశారు. ముహుర్తం రోజు దగ్గర పడుతున్న సమయంలో ప్రియుడి మీద అమ్మాయి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ప్రియుడు కచ్చితంగా వచ్చి పెళ్లి ఆపేస్తాడని, మీరే వీడి కథ చూడాలని అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు. పోలీసుల ముందు విచారణకు బయలుదేరిన యువకుడు కొబ్బరి తోటలో శవమై కనిపించడం కలకలం రేపింది. ప్రియుడి శరీరం మీద తీవ్రగాయాలు ఉండటంతో హంతకులను అరెస్టు చేసే వరకు శవం ముట్టుకోమని అబ్బాయి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.

నాలుగు సంవత్సరాల నుంచి లవర్స్
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని నాగర్ కోవిల్ సమీపంలోని తోవలై ప్రాంతంలో సురేష్ కుమార్ (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కాలేజ్ లో చదివే సమయంలో సురేష్ కుమార్ కు రంజిత (పేరు మార్చడం జరిగింది) అనే యువతి పరిచయం అయ్యింది. తరువాత సురేష్ కుమార్, రంజిత మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.

పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు
ఒకే ప్రాంతం నుంచి కాలేజ్ కు వెళ్లి వస్తున్న సమయంలో సురేష్ కుమార్, రంజిత ఇద్దరూ ప్రేమించుకున్నారు. వివాహం చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని సురేష్ కుమార్, రంజిత అనుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరుకావడంతో కొంతకాలం వేచి చూసి పెద్దలకు నచ్చచెప్పి పెళ్లి చేసుకోవాలని సురేష్ కుమార్, రంజిత అనుకున్నారు.

తక్కువ కులం వాడితో లవ్ ఏమిటి ?
కాలేజ్ చదువు పూర్తి అయిన తరువాత సురేష్ కుమార్ పెయింటింగ్ కాంట్రాక్టు పనులు చేయిస్తున్నాడు. మా అమ్మాయి రంజితను మాకంటే తక్కువ కులం వాడు అయిన సురేష్ కుమార్ ను ప్రేమిస్తున్నాడని అమ్మాయి కుటుంబ సభ్యులు తెలిసి వారు రగిలిపోయారు. పెద్దలు పంచాయితీలు పెట్టి సురేష్ కుమార్ కు వార్నింగ్ ఇచ్చారు. మా కులం అమ్మాయి జోలికి వస్తే మీ అంతు చూస్తామని, కచ్చితంగా చంపేస్తామని ప్రియుడు సురేష్ కుమార్ తో పాటు అతని కుటుంబ సభ్యులకు రంజిత కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చారు.

పెళ్లి ఏర్పాట్లు చేస్తున్న అమ్మాయి ఫ్యామిలీ
రంజితకు వేరే యువకుడితో పెళ్లి ఫిక్స్ చేసి పెళ్లి పనులు ముమ్మరం చేశారు. ముహుర్తం రోజు దగ్గర పడుతున్న సమయంలో ప్రియుడు సురేష్ కుమార్ దగ్గర మా అమ్మాయితో తీసుకున్న కొన్ని ఫోటోలు ఉన్నాయని, వాడు కచ్చితంగా పెళ్లి టైమ్ కు వచ్చి పెళ్లి నిలిపేస్తాడని అతని మీద అమ్మాయి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. సురేష్ కుమార్ కచ్చితంగా పెళ్లి రోజు వచ్చి పెళ్లి ఆపేస్తాడని, మీరే వీడి కథ చూడాలని అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు.
Recommended Video

తోటలో శవమైన ప్రియుడు
పోలీసులు సురేష్ కుమార్ ఇంటికి వెళ్లి ఎస్ఐ పిలుస్తున్నాడు వచ్చి మాట్లాడు అని చెప్పి వెళ్లారు. సోమవారం సాయంత్రం పోలీసుల ముందు విచారణకు బయలుదేరిన సురేష్ కుమార్ ఊరి బయట ఉన్న కొబ్బరి తోటలో శవమై కనిపించడం కలకలం రేపింది. సురేష్ కుమార్ శరీరం మీద తీవ్రగాయాలు ఉండటంతో అతన్ని చంపేశారని అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సురేష్ కుమార్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అమ్మాయి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హంతకులను అరెస్టు చేసే వరకు నాగర్ కోవిల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సురేష్ కుమార్ శవం ముట్టుకోమని అతని కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications