Lovers: ప్రియుడితో జల్సా, ప్రియురాలికి నిశ్చితార్థం, మోసం చేసిందని నడిరోడ్డులో చంపేసిన ప్రియుడు !

బెంగళూరు/ ఉడిపి: కొన్ని సంవత్సరాలుగా యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. రెండు సంవత్సరాల నుంచి యువతి, యువకుడు బైక్ లో తిరుగుతూ విహారయాత్రలు, సినిమాలు, షికార్లకు తిరిగారు. ఇద్దరు వివాహం చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలని అనుకున్నారు. వివాహం చేసుకోవాలని అనుకున్న ప్రేమికులు ఇంతకాలం ఎంజాయ్ చేశారు. అయితే ఇంట్లో చూసిన యువకుడితో కొన్ని నెలల క్రితం యువతి నిశ్చితార్థం జరిగిపోయింది. ప్రేమించిన యువతి వేరే యువకుడికి భార్య అవుతోందని ఆ యువకుడు జీర్ణించుకోలేకపోయాడు. నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని, తనతో వచ్చేస్తే పారిపోయి పెళ్లి చేసుకుందామని, మనం జీవితాంతం సుఖంగా ఉందామని ప్రియుడు అతని ప్రియురాలికి అనేక విదాలుగా నచ్చచెప్పాడు. అయితే ఇంట్లో చూసిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయి డిసైడ్ అయ్యింది. ఎంత నచ్చచెప్పినా ప్రియురాలు మారకపోవడంతో ఆమె ప్రియుడు రగిలిపోయాడు. ఉద్యోగం నుంచి ఇంటికి వెలుతున్న ప్రియురాలిని నడిరోడ్డులో దారుణంగా పొడిచిన ప్రియుడు అదే కత్తితో అతను పొడుచుకున్నాడు. ప్రియుడి కత్తిపోట్లకు అమ్మాయి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రియుడికి తీవ్రగాయాలై అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

స్నేహితులైన యువతి, యువకుడు

స్నేహితులైన యువతి, యువకుడు

కర్ణాటకలోని ఉడిపిలోని సంతేకట్టి ప్రాంతంలో సందేష్ కులాల్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఉడిపిలో సౌమ్యా బండారి అనే యువతి నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం సందేష్, సౌమ్యాకు పరిచయం అయ్యింది. కొంతకాలానికి సౌమ్యా, సౌందర్య ఇద్దరి ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ప్రేమపావురాలు

ప్రేమపావురాలు

కొన్ని సంవత్సరాలుగా సౌమ్యా, సందేష్ ప్రేమించుకున్నారు. రెండు సంవత్సరాల నుంచి సౌమ్యా, సందేష్ హ్యాపీగా బైక్ లో తిరుగుతూ విహారయాత్రలు, సినిమాలు, షికార్లకు తిరిగారు. ఎలాగైనా సౌమ్యా, సందేష్ ఇద్దరూ వివాహం చేసుకుని జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలని అనుకున్నారు. వివాహం చేసుకోవాలని అనుకున్న ప్రేమికులు సందేష్, సౌమ్యా ఇంతకాలం ఎంజాయ్ చేశారు.

ప్రియురాలికి నిశ్చితార్థం

ప్రియురాలికి నిశ్చితార్థం

సందేష్ ను తమ కుమార్తె ప్రేమిస్తుందని తెలుసుకున్న సౌమ్యా కుటుంబ సభ్యులు ఆమెకు వేరే పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయ్యారు. ఇంట్లో చూసిన యువకుడితో కొన్ని నెలల క్రితం సౌమ్యా నిశ్చితార్థం చాలా సీక్రేట్ గా జరిగిపోయింది. ప్రేమించిన సౌమ్యా వేరే యువకుడికి భార్య అవుతోందని ఆమె ప్రియుడు సందేష్ ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు.

లేచిపోదామని చెప్పిన ప్రియుడు

లేచిపోదామని చెప్పిన ప్రియుడు

నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీలులేదని, తనతో వచ్చేస్తే ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందామని, మనం జీవితాంతం సుఖంగా ఉందామని ప్రియుడు సందేష్ అతని ప్రియురాలు సౌమ్యాకు అనేక విదాలుగా నచ్చచెప్పాడు. అయితే కటుుంబ సభ్యులను ఎదిరించి తాను రాలేనని, ఇప్పటికే తనకు నిశ్చితార్థం జరిగిపోందని, పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యిందని, తాను నిన్ను పేళ్లి చేసుకోనని సౌమ్యా తేల్చి చెప్పింది.

 నడిరోడ్డులో పొడిచేసిన ప్రియుడు

నడిరోడ్డులో పొడిచేసిన ప్రియుడు

ఇంట్లో చూసిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని సౌమ్యా డిసైడ్ అయ్యింది. ఎంత నచ్చచెప్పినా ప్రియురాలు సౌమ్యా మారకపోవడంతో ఆమె ప్రియుడు సందేష్ రగిలిపోయాడు. ఉద్యోగం నుంచి ఇంటికి వెలుతున్న ప్రియురాలు సౌమ్యాను సంతెకట్ట సమీపంలోని పెట్రోల్ బంకు దగ్గర నడిరోడ్డులో అడ్డగించిన సందేష్ ఆమెతో గొడవ పెట్టుకున్నాడు.

 షాక్ అయిన స్థానికులు

షాక్ అయిన స్థానికులు

నడిరోడ్డులో మాటామాటా పెరిగిపోవడంతో సందేష్ జోబులో ఉన్న కత్తి తీసుకుని అతని ప్రియురాలు సౌమ్యాను దారుణంగా పొడిచేశాడు. సౌమ్యా కుప్పకూలిపోవడంతో వెంటనే అమె ప్రియుడు సందేష్ కూడా అదే కత్తితో పొడుచుకున్నాడు. కత్తిపోట్లకు గురైన సౌమ్యా, సందేష్ ఇద్దరూ నడిరోడ్డులో కుప్పకూలిపోవడంతో స్థానికులు హడలిపోయారు.

ప్రియురాలి ప్రాణం పోయింది

ప్రియురాలి ప్రాణం పోయింది

రక్తపు మడుగులో పడివున్న సౌమ్యా, సందేష్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రియుడు సందేష్ కత్తిపోట్లకు గురైన సౌమ్యాను ఆసుపత్రికి తరలించే సమయానికే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రియుడు సందేష్ తీవ్రగాయాలై అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. నిశ్చితార్థం జరిగిన ప్రియురాలు సౌమ్యను హత్య చేసి ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+