Girlfriend: ప్రియురాలిని ముక్కలుగా నరికి 6 కిలోమీటర్లు తల ఎత్తుకెళ్లిన మాజీ బాయ్ ఫ్రెండ్, యవ్యారం !

వారణాసి/లక్నో: యువతి, యువకుడు ప్రేమించుకుని హ్యాపీగా తిరిగారు. గుడికి వెలుతున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన యువతి కనపడకుండా పోయింది. పోలీసులు రంగంలోకి దిగి యువతి కోసం గాలించారు. పోలీసులు యువతి మాజీ ప్రియుడిని పట్టుకున్నారు. పోలీసులు నిందితుడు ఓ ప్రాంతానికి పిలుచుకుని వెలుతుంటే తప్పించుకుని పారిపోయాడు. మళ్లీ వెంటపడిన పోలీసులు ప్రియుడి మీద కాల్పులు జరిపి అరెస్టు చేశారు. ప్రియురాలిని హత్య చేశానని ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి బావిలో వేశానని, ఆరు కిలోమీటర్ల దూరంలో తల విసిరేశానని ప్రియుడు చెప్పడం కలకలం రేపింది.

లవర్స్ హ్మాపీ

లవర్స్ హ్మాపీ

ఉత్తరప్రదేశ్ లోని ఆజంగఢ్ జిల్లాలోని పశ్చిమ పట్టి ప్రాంతంలో ప్రిన్స్ యాదవ్ అలియాస్ ప్రిన్స్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ప్రిన్స్ నివాసం ఉంటున్న ప్రాంతంలో ఆరాధనా ప్రజాపతి అలియాస్ ఆరాధనా (22) అనే యువతి నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న ప్రిన్స్, ఆరాధాన హ్యాపీగా తిరిగేశారు.

ప్రియురాలు హ్యాండ్

ప్రియురాలు హ్యాండ్

కొన్ని సంవత్సరాలు పాటు ప్రియురాలు ఆరాధనాతో సంతోషంగా తిరిగిన ఆమె ప్రియుడు ప్రిన్స్ ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇదే సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆరాధనాకు ఆమె కుటుంబ సభ్యులు వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చెయ్యడంతో ప్రియుడు ప్రిన్స్ కు అతని అతని ప్రియురాలు దూరం అయ్యింది.

గుడికి వెళ్లి మాయం అయిన ప్రియురాలు

గుడికి వెళ్లి మాయం అయిన ప్రియురాలు

ఈనెల 9వ తేదీన గుడికి వెలుతున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన ఆరాధనా తరువాత కనపడకుండా పోయింది. ఆరాధనా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగి యువతి కోసం గాలించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన రోజు ఆరాధాన ఆమె ప్రియుడు ప్రిన్స్ ను కలిసింది. ప్రిన్స్ అతని ప్రియురాలిని గుడికి వెళ్లి రమ్మని చెప్పాడు.

బంధువుతో కలిసి ప్రియురాలిని ముక్కలుగా నరికేశాడు

బంధువుతో కలిసి ప్రియురాలిని ముక్కలుగా నరికేశాడు

గుడిలో నుంచి బయటకు వచ్చిన ఆరాధనాతో ప్రిన్స్ ఓ రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేశారు. తరువాత ప్రిన్స్ పచ్చిప పట్టి ప్రాంతంలోని అతని మేనమామ ఇంటికి ఆరాధనాను పిలుచుకుని వెళ్లాడు. తరువాత బంధువు సర్వేష్ తో కలిసి ప్రియురాలు ఆరాధనాను ప్రిన్స్ దారుణంగా హత్య చేశాడు. ఆరాధనా శవం గుర్తు పట్టకుండా ఆమె శవాన్ని ముక్కలుగా నరికేసి ఆ ప్రాంతంలోని పాడుపడిన బావిలో విసిరేశారు.

ఆరు కిలోమీటర్ల దూరంలో తల

ఆరు కిలోమీటర్ల దూరంలో తల

ప్రియురాలు ఆరాధన శవం ముక్కలు చేసి బావిలో విసిరేసిన తరువాత ప్రిన్స్ అతని బంధువు సర్వేస్ తో కలిసి ఆమె తలను బావికి ఆరు కిలోమీటర్ల దూరంలోని నిర్జనప్రదేశంలో విసిరేశారు. ఆరాధనా కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈనెల 19వ తేదీన ప్రిన్స్ ను పట్టుకున్నారు. పోలీసుల విచారణలో ప్రిన్స్ జరిగిన స్టోరీ, ఆరాధనాను హత్య చేసిన విషయం మొత్తం చెప్పాడు.

ఎన్ కౌంటర్ జస్ట్ మిస్

ఎన్ కౌంటర్ జస్ట్ మిస్

పోలీసులు ప్రిన్స్ ను వెంటపెట్టుకుని ఆరాధనా తల విసిరేసిన ప్రాంతానికి బయలుదేరారు. ఆ సందర్బంలో ప్రిన్స్ తప్పించుకుని పారిపోయాడు. ఆదివారం రాత్రి ప్రిన్స్ తలదాచుకున్న బంధువుల ఇంటి దగ్గరకు పోలీసులు వెళ్లారు. ఆ సందర్బంలో మళ్లీ తప్పించుకోవాలని ప్రయత్నించిన ప్రిన్స్ మీద పోలీసులు కాల్పులు జరిపారు.

ప్రియుడి ఫ్యామిలీ మీద కేసులు నమోదు

ప్రియుడి ఫ్యామిలీ మీద కేసులు నమోదు

కాలిలోకి తూటాలు దూసుకుపోవడంతో కూప్పకూలిపోయిన ప్రిన్స్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆరాధనా హత్య కేసులో ప్రిన్స్, సర్వేతో పాటు ఈ హత్యకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహరించి నిందితులకు ఆశ్రయం ఇచ్చిన ప్రిన్స్ ఇద్దరు మామలు, ఇద్దరు అత్తలు, కజిన్ బ్రదర్, సోదరితో సహ ప్రిన్స్ తల్లిదండ్రుల మీద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+