ఇదేం దరిద్రం రా...బెడ్ రూమ్‌లో చేయాల్సిన పనులు మెట్రో స్టేషన్‌లోనా..!
ఈ మధ్య కాలంలో ప్రేమికులు రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే రొమాన్స్ చేస్తూ తమ ప్రేమను ఘనంగా చాటుకుంటున్నారు. తమ చూట్టు ఎవరున్నారనేది కూడా వారు పట్టించుకోవడం లేదు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగానే వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మెట్రో రైల్లో ప్రేమికులు రొమాన్స్ చేయడం ఈ మధ్యకాలంలో చాలానే చూశాం. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
రద్దీగా ఉన్న మెట్రో స్టేషన్‌లో ప్రేమ జంట రొమాన్స్‌తో రెచ్చిపోయారు. మెట్రో స్టేషన్‌లో చాలామంది ప్రయాణికులు ఉన్నప్పటికీ .. వారిని పట్టించుకోకుండా తమ పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. స్టేషన్‌లో ప్రయాణికులు ఉన్నారనే సంగతి మర్చిపోయి రొమాన్స్‌లో మునిగిపోయారు. ఇద్దరూ హగ్ చేసుకుని.. ముద్దులు పెట్టుకున్నారు. తరువాత తాకరాని చోట తాకుతూ రెచ్చిపోయారు. ఈ ఘటన బెంగళూరు మెట్రో స్టేషన్‌లో చోటు చేసుకుంది.

గత కొద్ది రోజులుగా బెంగళూరు మెట్రో స్టేషన్‌లో ఒక జంట అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన మాదావర మెట్రో స్టేషన్‌లో జరిగిందని తెలుస్తోంది. వీడియోలో ఆ జంట బహిరంగంగా అసభ్యకరమైన చర్యలకు పాల్పడుతూ కనిపించారు. చుట్టూ ఇతర ప్రయాణికులు, వృద్ధులు ఉన్నప్పటికీ వారు పట్టించుకోలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. చాలా మంది వారి ప్రవర్తనను తప్పుబడుతూ, ఇది బహిరంగ ప్రదేశంలో అభ్యంతరకరమని అభిప్రాయపడ్డారు. మరికొందరు మెట్రో అధికారులు, స్థానిక యంత్రాంగం వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ సంఘటన బెంగళూరు వంటి నగరంలో ఇలాంటి ప్రవర్తన పెరగడంపై ఆందోళన కలిగిస్తోంది. కొందరు నెటిజన్లు బెంగళూరు సంస్కృతి మారుతోందా అని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం కూడా వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఇంకా అధికారికంగా స్పందించలేదు.












Click it and Unblock the Notifications