Lovers: లవ్ మ్యారేజ్, పెద్దలతో రాజీ, కులం తక్కువని పోలీస్ స్టేషన్ లో పెళ్లికొడుకుని, దెబ్బతో షాక్ !
చెన్నై/ తిరునల్వేలి: కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకున్న యువతి, యువకుడు వివాహం చేసుకోవాలని నిర్ణయించాడు. ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని ఆ యువతి డిసైడ్ అయ్యింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు నిరాకరించారు. ప్రేమించిన యువకుడిని వదల్లేని యువతి పెద్దలను ఎదిరించి స్నేహితుల సహాయంతో గుడిలో పెళ్లి చేసుకుంది. కుటుంబ సభ్యులు రెచ్చిపోతారని అనునమానం రావడంతో నవ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. దంపతుల కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు రాజీ చెయ్యడానికి ప్రయత్నించారు. అదే సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులు కత్తులు తీసుకుని ప్రియుడిని కత్తులతో పోలీస్ స్టేషన్ లో పొడిచి చంపేయడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. ఇదే సమయంలో ప్రియురాలికి గాయాలైనాయి.

కొన్ని సంవత్సరాలుగా ప్రేమికులు
తమిళనాడులోని తిరునల్వేలి (నెలై) పట్టణంోని కోడీశ్వరన్ నగర్ లో ఆనంద్ రాజ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఆనంద్ రాజ్ నివాసం ఉంటున్న ఏరియాలోనే రమ్యా (21) అనే యువతి నివాసం ఉంటున్నది. ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న రమ్యా, ఆనంద్ రాజ్ కు చిన్నప్పటి నుంచి పరిచయం ఉండటంతో ఇద్దరు కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు.

ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం
ఆనంద్ రాజ్, రమ్యా వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించిన ఆనంద్ రాజ్, రమ్యా ఇంతకాలం సంతోషంగా తిరిగారు. ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ప్రియుడు ఆనంద్ రాజ్ మంచి జీతం తీసుకుంటున్నాడు ఉద్యోగం చేస్తున్న ఆనంద్ రాజ్ ను పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు రమ్యా కూడా డిసైడ్ అయ్యింది.

కులాలు తెచ్చిన సమస్య
ఆనంద్ రాజ్, రమ్యాల మతాలు ఒక్కటే అయినా ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు నిరాకరించారు.
ఇదే విషయంలో కొంతకాలం రమ్యా ఇంటిలో పంచాయితీలు జరిగాయని సమాచారం. తక్కువ కులం వాడైన ఆనంద్ రాజ్ ను పెళ్లి చేసుకోవాడానికి మేము అంగీకరించమని రమ్యా కుటుంబ సభ్యులు, బంధువులు తేల్చి చెప్పారని తెలిసింది.

గుడిలో పెళ్లి
ప్రేమించిన యువకుడు ఆనంద్ రాజ్ ను వదల్లేని రమ్యా పెద్దలను ఎదిరించి స్నేహితుల సహాయంతో తిరునల్వేలిలోని వినాయకుడి గుడిలో శుక్రవారం పెళ్లి చేసుకుంది. రమ్యా కుటుంబ సభ్యులు రెచ్చిపోతారని, దాడి చేసే అవకాశం ఉందని అనునమానం రావడంతో నవ దంపతులు తిరునల్వేలి పోలీసులను ఆశ్రయించారు. మాకు రక్షణ కల్పించాలని ఆనంద్ రాజ్, రమ్యా దంతపతులు పోలీసు అధికారులకు మనవి చేశారు.

పోలీస్ స్టేషన్ లో ప్రియుడిని కత్తులతో పొడిచి ?
నవ దంపతుల ఆనంద్ రాజ్, రమ్యా కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు రాజీ చెయ్యడానికి ప్రయత్నించారు. అదే సమయంలో రమ్యా కుటుంబ సభ్యులు, బంధువు రామ్ కుమార్ అతని స్నేహితులు కలిసి కత్తులు తీసుకుని ప్రియుడు ఆనంద్ రాజ్ మీద కత్తులతో దాడి చేశారు. పోలీస్ స్టేషన్ లోనే ఆనంద్ రాజ్ ను కత్తులతో పొడిచి చంపేయడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. ఇదే సమయంలో ప్రియురాలు రమ్యాకు కూడా గాయాలైనాయి.
Recommended Video

అమ్మాయి ఫ్యామిలీ అరాచకం
దెబ్బకు వెంటనే తేరుకున్న పోలీసులు రామ్ కుమార్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రగాయాలైన ఆనంద్ రాజ్ ను, గాయాలైన పెళ్లి కూతురు రమ్యాను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అక్కడ ప్రథమ చికిత్స చేయించి తరువాత తిరునల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లోనే ప్రియుడు ఆనంద్ రాజ్ మీద హత్యాయత్నం చెయ్యడం తిరునల్వేలి పట్టణంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications