Lovers: కారులో సజీవదహనం, కాలి బూడిద అయిపోయారు వన్ సైడ్ లవ్, హత్య, ఆత్మహత్యా ?, ఏం మిగల్లేదు !
బెంగళూరు/మైసూరు: తనతో కలిసి చదువుకున్న అమ్మాయితో యువకుడు ప్రేమలో పడ్డాడు. ఒకే ఊరి వాళ్లు కావడం, కలిసి చదువుకోవడంతో మొదట ఆ యువతి అతనితో చనువుగా ఉందని సమాచారం. తరువాత యువకుడితో కలిసి తిరగడం తమకు నచ్చదని, అతన్ని వివాహం చేసుకోకూడదని యువతికి ఆమె కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. మీ అమ్మాయిని తనకు ఇచ్చి వివాహం చెయ్యాలని ఆ యువకుడు యువతి కుటుంబ సభ్యులకు ఇంతకు ముందే నాలుగు సార్లు మనవి చేశాడు. చచ్చినా నీతో మా అమ్మాయి పెళ్లి చెయ్యమని ఆమె కుటుంబ సభ్యులు కుండలు బద్దలు కొట్టి చెప్పారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగంలో చేరిన యువతి ఆమెపాటికి ఆమె ఉద్యోగం చేసుకుంటూ కుటుంబ సభ్యులు చెప్పినట్లు సైలెంట్ గా ఉండిపోయింది. ప్రేమించిన యువతి దూరం అవుతోందని ఆవేదనతో ఆ యువకుడు రగిలిపోయాడు. ఉద్యోగానికి వెళ్లిన యువతితో నీతో మాట్లాడాలని, ఓక్కసారి అవకాశం ఇవ్వాలని ఆమె కాళ్లు పట్టుకున్నాడు. యువకుడి మామమాటలు నమ్మిన యువతి అతని వెంట వెళ్లింది. కారులో కుర్చుని యువతి, యువకుడు మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో కారు డోర్ లాక్ చేసిన యువకుడు యువతి మీద పెట్రోల్ పోసి, అతను పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకోవడంతో సజీవదహనం అయ్యారు. ప్రియుడి దెబ్బతో కారులోని ఒకే సీటులో ఇద్దరూ సజీవదహనం కావడం కలకలం రేపింది. అయితే అమ్మాయిని హత్య చేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడా ?, లేక ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారా ? అనే విషయంపై పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు.

ఒకే ఊరి అమ్మాయి, అబ్బాయి
కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని మాంబళ్ళి గ్రామంలో శ్రీనివాస్ (23) అనే యువకుడు, కాంచనా (22) అనే యువతి నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ఒకే గ్రామంలో నివాసం ఉండటంతో 10వ తరరగతి వరకు శ్రీనివాస్, కాంచనా కలిసి చదువుకున్నారు, తరువాత శ్రీనివాస్ డ్రైవర్ అవతారం ఎత్తడంతో కాంచనా కాలేజ్ కు వెళ్లి నర్సింగ్ పూర్తి చేసి చామరాజనగర జిల్లా ప్రభత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది,

మొదట అమ్మాయి గ్రీన్ సిగ్నల్
కలిసి చదువుకున్న కాంచనాతో అదే ఊరి యువకుడు శ్రీనివాస్ ప్రేమలో పడ్డాడు. ఒకే ఊరి వాళ్లు కావడం, కలిసి చదువుకోవడంతో మొదట కాంచనా కూడా శ్రీనివాస్ తో చనువుగా ఉండేది. మూడు సంవత్సరాల క్రితం వరకు కాంచనా, శ్రీనివాస్ చాలా చనువుగా ఉన్నారని వారి స్నేహితులు అంటున్నారు.

ఫ్యామిలీ దెబ్బతో అమ్మాయి రివర్స్
కాంచనా, శ్రీనివాస్ వ్యవహారం ఆమె ఇంటిలో తెలిసిపోయింది. నువ్వు శ్రీనివాస్ తో కలిసి తిరగడం తమకు నచ్చదని, అతన్ని వివాహం చేసుకోకూడదని కాంచనాకు ఆమె కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో కాంచనా శ్రీనివాస్ తో మాట్లాడటం మానేసింది. కాంచనా దూరం కావడంతో శ్రీనివాస్ ఆవేదన చెందాడు. మీ అమ్మాయి కాంచనాను తనకు ఇచ్చి వివాహం చెయ్యాలని, ఆమెను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని శ్రీనివాస్ యువతి కుటుంబ సభ్యులకు ఇంతకు ముందే నాలుగు సార్లు మనవి చేశాడు.

టాటా చెప్పేసిన యువతి
చచ్చినా నీతో మా అమ్మాయి పెళ్లి చెయ్యమని కాంచనా కుటుం సభ్యులు శ్రీనివాస్ ముందు కుండలు బద్దలు కొట్టి చెప్పారు. చామరాజనగర ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తున్న కాంచనా ఆమెపాటికి ఆమె ఉద్యోగం చేసుకుంటూ కుటుంబ సభ్యులు చెప్పినట్లు సైలెంట్ గా ఉండగిపోయింది. ప్రేమించిన కాంచనా దూరం అవుతోందని ఆవేదనతో శ్రీనివాస్ రగిలిపోయాడు.

పక్కాప్లాన్.... కారులో ఇద్దరూ సజీవదహనం
ఉద్యోగానికి వెళ్లి కాంచనాను శ్రీనివాస్ కలిశాడు. నీతో మాట్లాడలని, ఓక్కసారి అవకాశం ఇవ్వాలని శ్రీనివాస్ ఆమె కాళ్లు పట్టుకున్నాడు. శ్రీనివాస్ మామమాటలు నమ్మిన కాంచనా అతని వెంట కారులో వెళ్లింది. కారులో కుర్చుకుని కాంచనా, శ్రీనివాస్ చాలా సేపు మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో కారు డోర్ లాక్ చేసిన శ్రీనివాస్ కారులో ఉన్న కాంచనా మీద పెట్రోల్ పోశాడు. వెంటనే శ్రీనివాస్ కూడా మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకోవడంతో ఇద్దరూ సజీవదహనం అయ్యారు. ప్రియుడు శ్రీనివాస్ దెబ్బతో కారులోని ఒకే సీటులో కాంచనా కూడా కాలి బూడిద కావడం కలకలం రేపింది.

ఆ రోజు మాత్రం కారులో ఎందుకు వెళ్లింది ?
ప్రతిరోజూ ఉరి నుంచి బస్సులో ఆసుపత్రిలో ఉద్యోగం చెయ్యడాకికి వెళ్లి వస్తున్న కాంచనా ఆ రోజు శ్రీనివాస్ కారులోకి ఎలా వెళ్లింది అని పోలీసులు ఆరా తీస్తున్నారు. బస్సులో వెలుతున్న కాంచనాకు నమ్మించి శ్రీనివాస్ అతని కారులో పిలుచుకుని వెళ్లాడని కొందరు అంటున్నారని పోలీసులు చెప్పారు.

హత్యా ?.... ఆత్మహత్యా
అయితే శ్రీనివాస్ తో కలిసి కాంచనా ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానం కూడా ఉందని పోలీసులు అంటున్నారు. నమ్మి వెంట వెళ్లిన కాంచనాను హత్య చేసిన శ్రీనివాస్ అదే కారులో అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కాంచనా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్, కాంచనాతో పాటు కారు కూడా పూర్తిగా కాలిపోయి బూడిద కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications