Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆటోలో లేడీతో రొమాన్స్ చేసిన రెజ్లర్, అభ్యంతరం చెప్పిన ఆటో డ్రైవర్ ?, రన్నింగ్ ఆటోలో అరాచకం!

రోడ్డు మీద ఆటో వెలుతున్న సమయంలో ప్రేమికులు చాలా అసభ్యంగా ప్రవర్తించడంతో అంతవరకు ఆటో డ్రైవర్ ఓపికగానే ఉన్నాడు. ప్రేమికుల ప్రవర్తనపై ఆటో డ్రైవర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.

పూణే/ముంబాయి: ఆటోలో కూర్చొన్న ప్రేమికులు అసభ్యంగా ప్రవర్తించారు. రోడ్డు మీద ఆటో వెలుతున్న సమయంలో ప్రేమికులు చాలా అసభ్యంగా ప్రవర్తించడంతో అంతవరకు ఆటో డ్రైవర్ ఓపికగానే ఉన్నాడు. అయితే ప్రేమికుల ప్రవర్తనపై ఆటో డ్రైవర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. మాటామాటా పెరిగిపోవడంతో ఆ సమయంలో ఆగ్రహించిన ప్రేమికుడు, రెజ్లర్ ఆ ఆటో డ్రైవర్ ను సిమెంట్ ఇటుకలతో బండరాళ్లతో కొట్టి చంపేశాడు.

రెజ్లర్ అమిత్ అరెస్టు

రెజ్లర్ అమిత్ అరెస్టు

మహారాష్ట్రలోని పూణేలోని పంప్రి చించవాడి ప్రాంతంలో ప్రేమికుల చేతిలో అమాయకుడైన ఆటో డ్రైవర్ హత్యకు గురైనాడు. దాపోడి సమీపంలోని గణేష్ గార్డెన్ ఫేజ్ 3 సమీపంలో సాయంత్రం 4.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఆటో డ్రైవర్ హత్య కేసులో రెజ్లర్ అమిత్ బాలాసాహెబ్ కాంబ్లే (26)ను పూణే పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆటో డ్రైవర్ అమాయకుడు

ఆటో డ్రైవర్ అమాయకుడు

పూణేలో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న ఆలీమ్ షేక్ అనే వ్యక్తి హత్యకు గురైనాడని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నానా పేట్‌లో నివాసం ఉంటున్న మృతుని సోదరుడు 46 ఏళ్ల ఆసిఫ్ ఇస్మాయిల్ షేక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

ఎక్కడా చోటు లేదని ఆటోలో?

ఎక్కడా చోటు లేదని ఆటోలో?

ఆదివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జవాల్కర్‌ నగర్‌లో ఆటో ఆపిన ఆలీమ్ షేక్ అక్కడ వేచి ఉన్నాడు. ఆటోలో కుర్చున్న నిందితుడు అమిత్‌ బాలాసాహెబ్‌ కాంబ్లే ఆటోలో అతనితో పాటు కుర్చున్న మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు ఆటో డ్రైవర్ ఆలీమ్ షేక్ గుర్తించారు. ఆటో డ్రైవర్ అమిత్ తన ఆటోలో అసభ్యంగా ప్రవర్తించకూడదని, మీరు కిందకు దిగేయాలని సూచించాడు.

సిమెంట్ ఇటుకలతో దాడి

సిమెంట్ ఇటుకలతో దాడి

అయితే అమిత్ మాత్రం అతనితో పాటు ఉన్న మహిళ మీద ఎక్కడంటే అక్కడ చేతులు వేసి చాలా అసభ్యంగా ప్రవర్తించాడని తెలిసింది. తరువాత ఆటో డ్రైవర్ ఆలీమ్ షేక్ తన ఆటో దిగేయాలని గట్టిగా చెప్పాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి గురైన రెజ్లర్ అమిత్ ఆటో డ్రైవర్‌ ఆలీమ్ షేక్ తలపై సిమెంట్‌ ఇటుకలతో కొట్టాడు.

మంచి రెజ్లర్, యువకులకు ట్రైనింగ్

మంచి రెజ్లర్, యువకులకు ట్రైనింగ్

దాడిలో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స విఫలమై ఆటో డ్రైవర్ ఆలీమ్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు, ఆటో డ్రైవర్ హత్య కేసులో అరెస్టయిన నిందితుడు అమిత్ కాంబ్లే ఒక రెజ్లర్, చాలా మంది అబ్బాయిలను కుస్తీ పోటీలకు సిద్ధం చేసే ట్రైనర్‌గా పనిచేశాడు. అతను ఔంద్‌లో రన్‌వాడి అనే ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించాడు మరియు అక్కడ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+