Marriage: పెళ్లి ఫిక్స్, నిశ్చితార్థం జరిగిపోయింది, ఐటీ హబ్ నుంచి వెళ్లి కాబోయే పెళ్లికూతురు ?

బెంగళూరు/విజయనగర: యువతికి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. పెళ్లి చేసుకుంటే మా కుమార్తె జీవితాంతం సంతోషంగా ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. యువతికి ఓ అబ్బాయిని చూసి పెళ్లి చెయ్యాలని అనుకున్నారు. పెళ్లికి ముందు నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అయితే తరువాత సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో హంపి ఎంతో ఫేమస్ అనే విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. విజయనగర సామ్రాజ్యంలో నిర్మించిన హంపితో పాటు పరిసర ప్రాంతాలను చూడటానికి ప్రతిరోజు వేల సంఖ్యలో పర్యాటకులు వచ్చి వెలుతున్నారు. హంపి గురించి తెలిసిన వాళ్లు విజయనగరలోని గోలి గుమ్మటపు కోటను కచ్చితంగా చూసి వెలుతారు.

Lovers: The marriage was fixed, the girl committed suicide unable to forget her boyfriend in Vijayanagar in Karnataka.

గోలిగుమ్మట ప్రాంతానికి ప్రతిరోజు వేల సంఖ్యలో పర్యాటకులు వచ్చి వెలుతుంటారు. ఈరోజు ఇదే చోట పైనుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడంతో పర్యాటకులు హడలిపోయారు. విజయనగర పోలీసులు దర్యాప్తు చేస్తే బెంగళూరులోని విజయనగరలో నివాసం ఉంటున్న సౌందర్యా (20) అనే యువతి ఆత్మహత్య చేసుకుందని వెలుగు చూసింది.

బెంగళూరులో నివాసం ఉంటున్న సౌందర్యాకు ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి ఫిక్స్ చేశారని, ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. వేరే అబ్బాయిని ప్రేమిస్తున్న సౌందర్యా ఆమె కుటుంబ సభ్యులు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టంలేక విజయనగరకు వచ్చి ఆత్మహత్య చేసుకుందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. విజయనగరలో ఇటీవల కాలంలో ఆత్మహత్యలు ఎక్కువ కావడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+