బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lovers: బ్రేకప్, నర్సును చంపేసి ఆమె ఇంట్లోనే ప్రియుడి ఆత్మహత్య, డెత్ నోట్ లో మ్యాటర్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/బెళగావి: యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. యువతి బీఎస్సీ నర్సింగ్ చేసి ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది. యువకుడు ఎంఏ పూర్తి చేసి మంచి ఉద్యోగం చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమికులు సంతోషంగా తిరిగారు. ఇటీవల ప్రియురాలు ఆమె ప్రియుడిని దూరం పెట్టింది. సిటీలో అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్న యువతి ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. రాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు ఆమెతో గంటపాటు మాట్లాడాడు. తరువాత ఇద్దరి మద్య గొడవ జరిగింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన ప్రియుడు అతని ప్రియురాలిని చంపేశాడు. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు డెత్ నోట్ రాసి ఆమె ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Illegal affair: నేను లేనప్పుడు ఎందుకు వస్తున్నాడు ?, భార్యను షూ లేస్ తో చంపేసిన సులేమాన్ !Illegal affair: నేను లేనప్పుడు ఎందుకు వస్తున్నాడు ?, భార్యను షూ లేస్ తో చంపేసిన సులేమాన్ !

 ఆసుపత్రిలో నర్సు

ఆసుపత్రిలో నర్సు

కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని సవదత్తి తాలుకా బుదిగుప్పలో రామచంద్ర అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బెళగావిలోని బసవ కాలనీలో రేణుకా అనే యువతి నివాసం ఉంటున్నది. రామచంద్ర, రేణుకాకు పరిచయం అయ్యింది. రేణుకా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి బెళగావిలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది.

 ఏడు సంవత్సరాల లవ్

ఏడు సంవత్సరాల లవ్

బెళగావిలోని కిత్తూరు రాణి చెన్నమ్మ యూనివర్శిటీలో ఎంఏ పూర్తి చేసిన రామయంద్ర మంచి ఉద్యోగం చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. 7 సంవత్సరాల నుంచి రామచంద్ర, రేణుకా ప్రేమించుకున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమికులు రేణుకా, రామచంద్ర సంతోషంగా తిరిగి ఎంజాయ్ చేశారు.

 ప్రియుడిని దూరం పెట్టింది

ప్రియుడిని దూరం పెట్టింది

ఇటీవల ప్రేమికులు రామచంద్ర, రేణుకాల మద్య గొడవలు మొదలైనాయి. ప్రియురాలు రేణుకా ఆమె ప్రియుడు రామచంద్రను దూరం పెట్టింది. ప్రియురాలు రేణుకాను దగ్గర చేసుకోవాలని రామచంద్ర అనేక ప్రయత్నాలు చేశారు. అయినా రేణుకా మాత్రం ఆమె ప్రియుడు రామచంద్రను ఇంకా దూరం పెట్టింది.

 ప్రియురాలిని చంపేసి అక్కడే ఆత్మహత్య

ప్రియురాలిని చంపేసి అక్కడే ఆత్మహత్య

బెళగావిలోని బసవకాలనీలో అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్న రేణుకా ఆసుపత్రిలో ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. రాత్రి ప్రియురాలు రేణుకా ఇంటికి వెళ్లిన ఆమె ప్రియుడు రామచంద్ర ఆమెతో గంటపాటు మాట్లాడాడు. తరువాత రామచంద్ర, రేణుకాల మద్య గొడవ జరిగింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన రామచంద్ర అతని ప్రియురాలు రేణుకాను గొంతు నులిమి చంపేశాడు.

 డెత్ నోట్ లో మ్యాటర్ రాసిన ప్రియుడు

డెత్ నోట్ లో మ్యాటర్ రాసిన ప్రియుడు

ప్రియురాలు రేణుకాను హత్య చేసిన రామచంద్ర డెత్ నోట్ రాసి ఆమె ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నా ప్రియురాలు రేణుకా నాతో తిరిగి ఎంజాయ్ చేసింది. ఇప్పుడు నన్ను మోసం చేసి నా జీవితం నాశనం చేసింది, అందుకే ఆమెను చంపేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని రామచంద్ర డెత్ నోట్ రాసి పెట్టాడని పోలీసులు అన్నారు.

English summary
Lovers: Young man commits suicide after killing girlfriend in Belagavi in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X