5kg LPG Cylinder: చిన్న బండకు పెద్ద డిమాండ్-రికార్డు స్థాయి కొనుగోళ్లు..!

ఇరాన్ వార్ ప్రభావంతో మన దేశంలో ఎల్పీజీ సిలెండర్ల (LPG cylinder)కొరత ఏర్పడింది. యుద్ధ భయాలతో జనం ముందస్తు బుకింగ్స్ , కొనుగోళ్ల కోసం ఎగబడ్డారు. దీంతో ఎల్పీజీ సిలెండర్లు దొరకని పరిస్ధితి వచ్చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఐదు కేజీల గ్యాస్ సిలెండర్లను తెరపైకి తెచ్చింది. ఎలాంటి సబ్సిడీలు లేకుండా కనీస గుర్తింపు పత్రాలతో తీసుకునే అవకాశం కల్పించిన ఈ సిలెండర్ల కోసం ఇప్పుడు జనం భారీగా ఎగబడుతున్నారు. దీంతో ఇవాళ్టికి 6.6 లక్షల చిన్న సిలెండర్లు అమ్ముడయ్యాయి.

ఎల్‌పిజి పంపిణీ కేంద్రాలలో నేరుగా కౌంటర్‌లో కొనుగోలు చేసే అవకాశం ఉన్న 5 కేజీల చిన్న ఎల్‌పిజి సిలిండర్ల అమ్మకాలను కేంద్రం ముమ్మరం చేసింది. దీంతో మార్చి 23 నుంచి ఇప్పటివరకు సుమారు 6.6 లక్షల సిలెండర్లు ఇలా అమ్ముడయ్యాయి. సబ్సిడీతో లభించే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్లలా కాకుండా, ఎఫ్‌టిఎల్ సిలిండర్లు అని పిలిచే ఈ 5 కేజీల బాటిళ్లకు మార్కెట్ ధరలకే ధర నిర్ణయిస్తారు. సమీపంలోని ఎల్‌పిజి పంపిణీ కేంద్రం నుంచి వీటిని కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ కూడా అక్కర్లేదు. దీంతో జనం వీటి కోసం ఎగబడుతున్నారట.

LPG Supply Strategy Pays Off 6 6 Lakh Small Cylinders Sold as Government Ramps Up Distribution

నిన్న (ఏప్రిల్ 4న) 90 వేలు పైగా 5 కేజీల ఎఫ్‌టిఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి. మార్చి 23 నుంచి ఇప్పటివరకు సుమారు 6.6 లక్షల 5 కేజీల ఎఫ్‌టిఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయని చమురు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎల్‌పిజి పంపిణీ కేంద్రాల వద్ద కొరత ఉన్నట్లు ఎలాంటి నివేదికలు లేవని, రోజంతా 5.1 లక్షలకు పైగా గృహ వినియోగ సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. మొత్తం డిమాండ్‌లో 95 శాతం ఆన్‌లైన్ బుకింగ్‌ల ద్వారానే జరిగిందని పేర్కొంది. మరోవైపు ఎల్పీజీ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. మార్చి నుంచి 50,000కు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఎల్‌పిజి పంపిణీదారులకు 1,400కు పైగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 36 డీలర్‌షిప్‌లను రద్దు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+