Street Food: మీరు మారర్రా నాయనా.. వీడియో చూసి తట్టుకోగలరా..?

ఇంట్లో వండిన పదార్థాల కంటే రోడ్డు మీద దొరికే పదార్థాలు భలే రుచిగా అనిపిస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్లు వరకు ఉదయం సాయంత్రం తేడా లేకుండా స్ట్రీట్ ఫుడ్ కు అలవాటు పడిపోతున్నారు. మారుతున్న జీవన విధానం, ఉద్యోగం, వ్యాపారం రిత్యా నేటి కపుల్స్ కు వంట వండే తీరిక కూడా లేకుండా పోయింది. దీంతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మిర్చీ, పకోడా సెంటర్లు, పానీపురీ బండ్లు కళకళలాడుతున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే విచ్చలవిడిగా ఈ స్ట్రీట్ ఫుడ్స్ లభిస్తున్నాయి. ప్రజలు కూడా విపరీతంగా వీటిని ఆస్వాదిస్తున్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో తయారు చేసే ఈ ఆహారం ఎంత వరకు నాణ్యమైనది, శుభ్రమైనది అంటే సమాధానం చెప్పలేం. తాజాగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే ఇక బజ్జీలు, పకోడీలు వద్దు బాబోయ్ అంటారేమో..!

ప్రస్తుతం రోజురోజుకూ స్ట్రీట్ ఫుడ్ కు డిమాండ్ పెరిగిపోతుంది. ఓ వైపు నాణ్యమైన, శుభ్రమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు, వైద్యులు చెబుతున్నా ప్రజలు మాత్రం స్ట్రీట్ ఫుడ్ నే ఆస్వాదిస్తున్నారు. అయితే వీధి వ్యాపారులు దీన్ని ఆదాయ వనరుగా మలుచుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వీది వ్యాపారి పకోడీలు చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనికి కారణం అక్కడి పకోడీలు టేస్టీ, క్వాలిటీ అనుకుంటే మీరు పొరబడినట్లే. ఆ వ్యాపారి చేసిన పని చూస్తే షాక్ అవ్వకుండా ఉండరు. నూనే ప్యాకెట్స్ ను ఓపెన్ చేసేందుకు ఏకంగా వేడి నూనెలో ముంచాడు. ఆ నూనెతోనే పకోడీలు చేశాడు. ఈ ఘటన పంజాబ్ లోని లుథియానాలో జరిగింది. ఈ వీడీయో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆ పకోడీలు మాకొద్దు బాబాయ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Ludhiana Street Vendor s Shocking Act Dipping Oil Packets in Hot Oil

ఓ వైపు కల్తీ ఆహారం చేస్తూనే ఆయిల్ ప్యాకెట్లను ఓపెన్ చేయడానికి వేడి నూనెలో ముంచడం.. దానితోనే పకోడీలు వేయించడంతో ఇంతకంటే ఘోరం ఉంటుందా అని నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+