Chandra Grahanam: శతాబ్దపు సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం: కార్తీక పౌర్ణమి రోజున, ఇక్కడ మాత్రం కనిపించదు..
శుక్రవారం కార్తీక పౌర్ణమి.. ఆ రోజే గ్రహణం కూడా ఏర్పడనుంది. అయితే అదీ భారత్‌లో మాత్రం కనిపించదు. శుక్రవారం రోజున శతాబ్దపు సుదీర్ఘ పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడనుంది. చంద్రగ్రహణం సుమారు 6 గంటల పాటు కనిపిస్తుంది. ఈ శతాబ్దంలో సుదీర్ఘమైన పాక్షిక చంద్రగహణంగా శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. నవంబరు 19వ తేదీన గ్రహణం దర్శనం ఇవ్వబోతుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ తెలియజేసింది.

రెండు రోజులు
నవంబరు 18 , 19 తేదీల్లో వివిధ సమయాల్లో గ్రహణం కనిపించనుండగా.. భారత కాలమానం ప్రకారం నవంబరు 19 శనివారం మధ్యాహ్నం గం.1.30 గంటలకు.. చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి ఒకే వరుసలో వచ్చి.. భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. 6 గంటల పాటు ఏర్పడే ఈ పాక్షిక చంద్ర గ్రహణం.. చంద్రుని ఉపరితలం మొత్తం 97 శాతం ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. చంద్రుడు ఎవరికీ కనిపించకుండా ఈ పాక్షిక గ్రహణం దాచేస్తుంది. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం. శుక్రవారం ఈ చంద్రగ్రహణం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 05:33 గంటలకు ముగుస్తుంది.

మే 26వ తేదీ
ఏడాది తొలి చంద్ర గహణం మే 26వ తేదీ వైశాఖ పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడింది. నిండు చంద్రుడు ఆ రోజు అరుణవర్ణంలో కనువిందు చేశాడు. దీన్నే బ్లడ్ మూన్, సూపర్ మూన్ అని కూడా పిలిచారు. నవంబర్ 19న ఏర్పడే గ్రహణం భారత్‌లో అసోం, అరుణాచల్ ప్రదేశ్ ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో గ్రహణాన్ని వీక్షించొచ్చు. దాదాపు గ్రహణం విడుపు దృశ్యాలను వీక్షించవచ్చు. కనుక ఇక్కడి వారు గ్రహణం నియమాలు పాటించనవసరం లేదు. ఉత్తర అమెరికాలోని 50 దేశాలతో పాటు మెక్సికో వాళ్లూ దీన్ని పూర్తిగా చూడొచ్చు.

అర్ధరాత్రి 2 గంటలు
అమెరికా తూర్పు తీరంలో రాత్రిపూట చూసేవారు అద్భుతాన్ని తెల్లవారుజామున 2 నుండి 4 గంటల వరకూ చూడొచ్చు. పశ్చిమ తీరంలో ఉన్నవారు రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట మధ్య ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశముందని నాసా పేర్కొంది. ఉత్తర, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలకు ఈ పాక్షిక చంద్ర గ్రహణం దర్శనమివ్వబోతోంది.

ఫ్రాస్ట్ మూన్
ఈ గ్రహణాన్ని 'ఫ్రాస్ట్ మూన్'గా పిలుస్తారు.. ఎందుకంటే.. కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే ఈ పాక్షిక చంద్ర గ్రహణాన్ని.. మంచుతో కప్పబడిన చంద్రుడిగా ఫ్రాస్ట్ మూన్ అని పిలుస్తారు. శరదృతువు చివరిలో ఏర్పడే మంచు కారణంగా దానికి ఆ పేరు వచ్చింది. శరదృతువు చివరి పౌర్ణమి కూడా ఇదే. అమెరికాలోని కొన్ని స్థానిక తెగలు ఈ పేరు పెట్టారు. భూమి యొక్క నీడతో చంద్రుడు పూర్తిగా నల్లబడటం వల్ల సంపూర్ణ చంద్రగ్రహణంలా ఇది అద్భుతమైనది కానప్పటికీ , ఈ పాక్షిక గ్రహణం చంద్రుని ఉపరితలంలో 97% కనిపించకుండా దాచేస్తుంది.

సంపూర్ణ, పాక్షిక, పెనుంబ్రల్
వచ్చే 80 సంవత్సరాల్లో 2021 , 2030 మధ్య 20 సంపూర్ణ , పాక్షిక , పెనుంబ్రల్ గ్రహణాలు ఏర్పడే అవకాశముందని నాసా వెల్లడించింది. 2001 నుంచి 2100 శతాబ్దం మధ్య అత్యంత ఈ పాక్షిక చంద్రగ్రహణమే సుదీర్ఘమైనది. 21వ శతాబ్దంలో ఇప్పటి వరకూ 228 చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి.ఈ ఏడాదికి ఇదే ఆఖరి కాగా చివరి చంద్ర గ్రహణం కాగా.. వచ్చే ఏడాది 2022 , మే 15 , 16 తేదీల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరంలో నాలుగు గ్రహణాలు ఏర్పడనుండగా ఇప్పటివరకు 1 చంద్ర గ్రహణం సూర్యగ్రహణం పూర్తయ్యాయి. నవంబర్ 19వ తేదీన మరో చంద్రగ్రహణం వస్తోంది. 2021, డిసెంబర్ 4న మరో సూర్యగ్రహణం ఏర్పడనుంది.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications