కొనుగోలుదారులకు బిగ్ షాకిచ్చిన కేంద్రం- ఈ వస్తువులపై అదనపు పన్ను

CBDT: కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. లగ్జరీ వస్తువులపై అదనపు పన్ను విధించింది. ప్రస్తుతం అమలులో ఉన్న జీఎస్టీకి ఇది అదనం. రిస్ట్ వాచీలు, సన్ గ్లాసెస్, షూస్.. వంటి వస్తువులు ఈ జాబితాలో ఉన్నాయి. వాటిని కొనుగోలు చేసే సోర్స్ వద్దే అదనపు మొత్తాన్ని వసూలు చేస్తారు.

ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) గెజిట్ జారీ చేసింది. ఆదాయపు పన్ను చట్టం 1961లో సవరణలు చేసినట్లు తెలిపింది. కలెక్షన్ అట్ సోర్స్ వద్ద ఆయా విలాస వస్తువులన్నింటిపైనా ఒక శాతం మేర అదనపు పన్ను మొత్తాన్ని కొనుగోలుదారులు చెల్లించాల్సి ఉంటుంది.

Luxury goods priced above Rs 10 lakh like Wrist watches shoes will attract TCS

10 లక్షల రూపాయలు, అంతకంటే ఎక్కువ విలువ చేసే విలాస వస్తువులను ఈ అదనపు పన్నుల జాబితాలోకి చేర్చినట్లు సీబీడీటీ వెల్లడించింది. ఈ జాబితాలో- రిస్ట్ వాచీలు, పెయింటింగులు, విగ్రహాలు, ప్రాచీన వస్తువులు (యాంటిక్), కాయిన్ కలెక్షన్, స్టాంప్ కలెక్షన్.. వంటివి ఉన్నాయి.

యాచ్, రోయింగ్ బోట్స్, హెలికాప్టర్లు, సన్ గ్లాసెస్, హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు, షూస్, గోల్ఫ్ కిట్, స్కై-వియర్ వంటి స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్లు, హోమ్ థియేటర్ సిస్టమ్స్, రేసింగ్, పోలో స్పోర్ట్స్ కోసం కొనుగోలు చేసే గుర్రాలు.. వంటివాటిపైనా ఈ అదనపు ఒక శాతం ట్యాక్స్ వర్తిస్తుంది. ఈ పన్ను.. జీఎస్టీకి అదనం. వాటిని కొనుగోలు చేసే వాళ్లు ఒక శాతం ట్యాక్స్‌ను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ప్రభుత్వం గత సంవత్సరం జూలైలో సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో భాగంగా ఆర్థిక చట్టం- 2024 ద్వారా విలాస వస్తువుల కోసం ట్యాక్స్ కలెక్షన్ అట్ సోర్స్ (TCS)ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నిబంధనను అప్పటి బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది. అదనపు ట్యాక్స్ విధించడం వల్ల ఆడిట్ ట్రయల్‌ను బలోపేతం చేస్తుందని, ఆర్థిక పారదర్శకతను మరింత పెంపొందిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

ఈ ఒక శాతం అదనపు పన్ను.. కొనుగోలుదారు ఫారం 26ఏఎస్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. వారి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసేటప్పుడు క్రెడిట్‌గా ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ట్యాక్స్ డిడక్షన్, టీసీఎస్‌ను మరింత సరళీకృతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+