మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం; షిండే మంత్రివర్గంలో అజిత్ పవార్; డిప్యూటీ సీఎంగా ప్రమాణం!!

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం చోటు చేసుకుంది. మహారాష్ట్ర రాజకీయాలలో అజిత్ పవార్ ఏక్నాథ్ షిండే మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యటంతో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం శరత్ పవార్ కు, ఆయన సమీప బంధువు అజిత్ పవార్ ఊహించని షాక్ ఇచ్చారు. దీంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చినట్టు తెలుస్తుంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో కలిసి అజిత్ పవార్ తనకు అనుకూలంగా ఉన్న మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు వెంటబెట్టుకుని రాజ్ భవన్ కు వెళ్లి షిండే మంత్రివర్గంలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంత్రివర్గంలో ఆయన డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు . మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కూడా ప్రస్తుతం రాజ్ భవన్ లోనే ఉన్నారు, ఆయన అజిత్ పవార్ ను ఆయన మంత్రివర్గంలోకి స్వాగతించారు.

Ajit Pawar joined Eknath Shindes cabinet

అజిత్ పవార్ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకోవటం వెనుక అసలేం జరిగిందంటే.. ఎన్సిపి రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన అజిత్ పవర్ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. దీంతో ఎన్సీపిలో ముసలం చోటుచేసుకుంది. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో తన అధికారికనివాసం దేవ గిరిలో సమావేశమైన ఆయన రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి దక్కకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

అయితే ఈ వ్యవహారంలో రెండు నెలల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని అజిత్ పవార్ కు చెప్పినప్పటికీ ఆయన ఎన్సీపీలో ఉండటానికి ఇష్టపడలేదు. నేడు ఊహించని విధంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీకి ఊహించని ఝలక్ ఇచ్చారు. జూన్ 25వ తేదీన అజిత్ పవార్ వ్యవహారంపై మాట్లాడిన శరద్ పవార్ అజిత్ డిమాండ్ పై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

జులై 6వ తేదీన శరద్ పవార్ నేతృత్వంలో ఎన్‌సీపీ ఎమ్మెల్యేల సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశంలో అజిత్ పవార్ డిమాండ్ పై చర్చ జరగాలసి ఉంది. ఈ లోపు ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ మహా క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి శరద్ పవార్ ను సంక్షోభంలోకి నెట్టారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+