మహా కుంభ్ మోనాలిసా: పూసల దండలు అమ్ముకునే యువతి అందానికి దాసోహం

Maha Kumbh Mona Lisa: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ నెల 13వ తేదీన ఆరంభమైన కుంభమేళాకు దేశం నలుమూలల నుంచీ లక్షలాదిమంది తరలి వెళ్తోన్నారు. గంగా-యమున- సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు.

ఇదంతా ఒక ఎత్తయితే- మహా కుంభమేళాలో ఓ పూసల దండలను అమ్మే యువతి చేస్తోన్న సందడి మరో ఎత్తు. ఆమె పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్‌‌లోని ఇండోర్ ఆమె స్వస్థలం. జీవనోపాధి కోసం రోడ్డు పక్కన పూసలు, పూసల దండలను విక్రయించడం ఆమె కుటుంబ వృత్తి. పూసల దండలను విక్రయించడానికి దీనికోసమే తన కుటుంబం, స్నేహితులతో కలిసి ఇండోర్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చారు.

Mahakumbh 2025 A garland seller captured the social media attention with her striking beauty

ప్రయాగ్‌రాజ్‌లో తాత్కాలిక శిబిరాల్లో నివసిస్తోన్నారు. ఇప్పుడామె సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్నారు. ఆమె అందం అలాంటిది. చారెడేసి తేనె కళ్లు, చిరునవ్వు, చామనఛాయతో మెరిసిపోతూ కనిపిస్తోన్నారమె. విలేజ్ బ్యూటీ, మహాకుంభ్ మోనాలిసాగా పేరు పెట్టేశారు నెటిజన్లు. సోషల్ మీడియా అటెన్షన్ మొత్తం ఆమె వైపు తిరిగింది. ఆమె ఫొటో, వీడియోలు వైరల్ అయ్యాయి.

ఎలాంటి మేకప్ లేకుండా భుజాన ఓ సంచి, అందులో అన్ని రకాల పూసలు, పూసల దండలు, కొన్ని రుద్రాక్ష మాలలను నింపుకొని జీవనోపాధి కోసం వాటిని త్రివేణి సంగమం ఒడ్డున విక్రయిస్తూ కనిపించారామె. ఒకరిద్దరు ట్రావెల్ బ్లాగర్లు తొలిసారిగా మోనాలిసాను గుర్తించారు. ఓ చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నారు. వివరాలను సేకరించారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై అవి పోస్ట్ అయిన వెంటనే వైరల్ అయ్యాయి. తనకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌పై అవగాహన ఉందని, అకౌంట్స్ ఉన్నప్పటికీ వాటిని ఎప్పుడూ వాడలేదని చెప్పారు మోనాలిసా. మహా కుంభ్ వరకు ప్రయాగ్‌రాజ్‌లో ఉంటానని, ఆ తరువాత ఇండోర్‌కు వెళ్లి రోజులాగే జీవనోపాధి కోసం పూసలదండలను విక్రయించుకుంటానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+