ఛీ..ఛీ.. స్కూల్ లో పీరియడ్స్ చెకింగ్.. బలవంతంగా బాలికల బట్టలు విప్పి..

బాలికలు పీరియడ్స్ లో ఉన్నారో లేదో స్కూల్ యాజమాన్యం చెక్ చేసింది. బాలికల ప్రైవేట్​ పార్ట్స్​ టచ్‌ చేస్తూ స్కూల్ టీచర్లు ఈ పని చేశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పాఠశాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సభ్య సమాజం తలదించుకునే ఘటన మహారాష్ట్రలో జరిగింది. విద్యాబుద్ధులతో పాటు మంచీ చెడులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన టీచర్లే కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. పీరియడ్స్ లో ఉన్నామని ఆ బాలికలు చెప్పినా వినకుండాబాత్ రూమ్ లోకి తీసుకెళ్లి బలవంతంగా బట్టలు విప్పించి చెక్ చేసింది ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం.

మహారాష్ట్రలోని ఓ ప్రైవేటు స్కూల్​ లో ఈ అమానవీయ ఘటన జరిగింది. అక్కడి స్కూల్ యాజమాన్యం చేసిన పని సభ్య సమాజాన్ని సిగ్గు పడేలా చేస్తోంది. పాఠశాల బాత్ రూమ్ లో రక్తపు మరకలు కనిపించాయని కఠిన నిర్ణయం తీసుకుంది ఆ పాఠశాల యాజమాన్యం. బాలికలందరినీ వరుసగా నిలబెట్టి బలవంతంగా బట్టలు విప్పించి మరీ పీరియడ్స్ చెక్ చేశారు అక్కడి ఉపాధ్యాయులు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Maharashtra School Shocker Girls Stripped for Menstruation Check Sparks Outrage

రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటా ఆ పేరెంట్స్ కు హామీ ఇచ్చారు. అయితే పోలీసులకు స్కూల్ లోని బాలికలు, తల్లిదండ్రులు అందించిన సమాచారం ప్రకారం.. ఠాణె జిల్లాలో జులై 8న ఈ ఘటన జరిగింది. ఓ ప్రైవేటు స్కూల్ సిబ్బంది.. టాయిలెట్ లో రక్తపు మరకలను గుర్తించింది. వాళ్లు పాఠశాల యాజమాన్యంకు చూపించారు. వాటిని చూసిన స్కూల్ ప్రిన్సిపల్.. వెంటనే కోపంతో 5 నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలందరిని పిలిపించారు.

ఎవరెవరు పీరియడ్స్ లో ఉన్నారని మహిళా ఉపాధ్యాయురాలిని పిలిపించి బాలికలను బాత్ రూమ్ లోకి తీసుకెళ్లి బలవంతంగా బట్టలు విప్పించి ప్రైవేట్ భాగాలను చెక్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+