MH Election: అఘాడీలో సీఎం చిచ్చు-పవార్ వ్యాఖ్యలకు సంజయ్ రౌత్ కౌంటర్..!
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజులే మిగిలున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు అధికార మహాయుతి కూటమితో హోరాహోరీ తలపడుతున్న విపక్ష మహావికాస్ అఘాడీ కూటమి.. మరోవైపు అంతర్గత పోరుతో సతమతం అవుతోంది. ముఖ్యంగా కూటమిలో పార్టీల మధ్య ఇప్పుడు కాబోయే సీఎం ఎవరన్న చర్చ మొదలైంది. దీనికి ప్రధాన కారణం రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్.
ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న జయంత్ పాటిల్ సీఎం అయ్యే అవకాశం ఉందంటూ ఆ పార్టీ అధినేత శరద్ పవార్ తాజాగా వ్యాఖ్యానించారు. దీంతో మహా వికాస్ అఘాడీ కూటమిలో సీఎం పదవి రేసు మొదలైనట్లే అనుకుంటున్నారు. ఇప్పటివరకూ మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేనే మరోసారి కూటమి తరఫున సీఎంగా బరిలో ఉంటారని భావిస్తుండగా.. ఇప్పుడు జయంత్ పాటిల్ ను తెరపైకి తెచ్చి కూటమిలో మిత్రపక్షాల్ని ఆత్మరక్షణలో నెట్టేందుకు పవార్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

పవార్ వ్యాఖ్యలపై శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ స్పందించారు. జయంత్ పాటిల్‌కు సీఎం పదవి కోసం మద్దతు ఇవ్వాలని శరద్ పవార్ కోరితే ఆయనతో చర్చలు జరుపుతామని సంజయ్ రౌత్ ప్రకటించారు. అయితే ఇప్పటివరకూ శరద్ పవార్ ఎలాంటి సూచన ఇవ్వలేదని రౌత్ తెలిపారు. గతంలో మాత్రం ఎన్సీపీలో కీలక పాత్ర కోసం రోహిత్ పవార్ పేరు సూచించారని, కానీ ఓ పార్టీలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండకూడదంటూ పవార్ కు రౌత్ కౌంటర్ ఇచ్చారు. గతంలో సీఎం పదవి కోసం సుప్రియా సూలే పేరును పవార్ తెరపైకి తెచ్చారు. రౌత్ ఇప్పుడు దాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications