ఎదురెదురుగా వచ్చేసిన రెండు భారీ విమానాలు-తృటిలో తప్పిన ప్రమాదం-300 మంది సేఫ్..
ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇవాళ ఓ భారీ ప్రమాదం తప్పింది. విస్తారా ఎయిర్ లైన్స్ కు చెందిన రెండు భారీ విమానాలు ఇవాళ రన్ వేపై ఎదురెదురుగా వచ్చేశాయి. దీంతో ఈ రెండు గుద్దుకోవడం ఖాయంగా కనిపించింది. కానీ రెండు విమానాల పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి పెను ప్రమాదాన్ని తప్పించారు. దీంతో రెండు విమానాల్లో ప్రయాణిస్తున్న దాదాపు 300 మంది ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.
ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయంలో అహ్మదాబాద్ నుండి వస్తున్న విస్తారా విమానం, అదే ఎయిర్‌లైన్‌కు చెందిన మరో విమానం ఒకేసారి రన్ వేపై ప్రవేశించాయి. అహ్మదాబాద్-ఢిల్లీ విమానం ల్యాండింగ్ కోసం రన్ వే పైకి రాగా.. మరో విమానం.. టేకాఫ్ అవుతోంది. తొలి విమానం ల్యాండింగ్ కోసం పార్కింగ్ బేకు చేరుకోవడానికి యాక్టివ్ రన్‌వేని దాటాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆదేశించింది. ఇంతలో అదే రన్‌వేపై విస్తారా ఎయిర్‌లైన్స్ ఢిల్లీ-బాగ్‌డోగ్రా విమానానికి టేకాఫ్ చేయడానికి అనుమతి లభించింది. దీంతో అహ్మదాబాద్-ఢిల్లీ విమానంలో 45 ఏళ్ల కెప్టెన్ సోను గిల్ అప్రమత్తతో ఈ ప్రమాదం తప్పింది.

ప్రమాదం జరుగుతుందని భావించిన సమయానికి ఈ రెండు విమానాలు 1.8 కి.మీ లేదా 1,800 మీటర్ల దూరంలో ఉన్నాయి. మరో విమానం రన్ వేపై ఉన్నట్లు పైలట్ ఏటీసీని హెచ్చరించి ఉండకపోతే ఫలితం వినాశకరంగా ఉండేదని తెలుస్తోంది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA వెల్లడించిన వివరాల ప్రకారం విస్తారా ఫ్లైట్ VTI926 రన్‌వే 29Lలో దిగింది. అలాగే దాని పార్కింగ్ బేకు వెళ్లే మార్గంలో రన్‌వే 29Rని దాటమని ఏటీసీ చెప్పింది. అయితే ATC అధికారి మాత్రం VTI926కి ఇచ్చిన సూచనలను మర్చిపోయారు. దీంతో రన్‌వే 29R నుండి టేకాఫ్ చేయమని VTI725 విమానానికి సూచన ఇచ్చారు.
రన్‌వేను దాటుతున్న ఢిల్లీ విమానంలో ఉన్న పైలట్ అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను అప్రమత్తం చేయడంతో టేకాఫ్ రన్‌లో ఉన్న విమానం టేకాఫ్‌ను నిలిపివేయవలసిందిగా ఆదేశించారు. దీంతో క్షణంలో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ రెండు విమానాలు ఢీకొని ఉంటే మాత్రం దాదాపు 300 మందికి పైగా ప్రయాణికులు, పైలట్లు ఇద్దరూ చనిపోయే ప్రమాదం ఏర్పడేదని తెలుస్తోంది.
-
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications