ఢిల్లీలో హై అలర్ట్ .. పేలుళ్లలో 9 మంది మృతి
దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా భారీ పేలుడుతో ఉలిక్కిపడింది. నగరంలో అకస్మాత్తుగా నెలకొన్న ఈ హైటెన్షన్ వాతావరణం పౌరులను భయాందోళనలకు గురిచేసింది. సోమవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో, చారిత్రక ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నిలిపి ఉంచిన ఒక కారులో పేలుడు సంభవించింది. బ్లాస్ట్ తీవ్రతకు ఆ చుట్టుపక్కల నిలిపి ఉంచిన ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి, మంటలు చుట్టుపక్కలకూ వ్యాపించాయి.
తాజా అప్‌డేట్‌ల ప్రకారం.. 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడిన పలువురిని హుటాహుటిన ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది, ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. మంటలను ఆర్పిన తర్వాత, పోలీసులు పేలుడుకు సంబంధించిన ఆధారాలు సేకరించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించారు. ఫోరెన్సిక్ ,స్పెషల్ సెల్ బృందాలు ఘటనా స్థలాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని, పేలుడు స్వభావాన్ని నిర్ధారించే పనిలో నిమగ్నమయ్యాయి.
🚨 Big Blast near Lal Quila Metro Gate No.1! 😱
— अखण्ड भारत संकल्प (@Akhand_Bharat_S) November 10, 2025
चांदनी चौक इलाके में जबरदस्त धमाका, 3-4 गाड़ियां जलकर खाक 🔥
LNJP Hospital confirms – 8 dead! 💔
7 Islamic terrorists arrested with AK-47s & explosives! 😡
Delhi on High Alert! 🚓🚨#RedFort #LalQuila #DelhiBlast #BreakingNews… pic.twitter.com/C9qppAX287
ఈ పేలుడు జరగడం వెనుక ఉన్న సమయం మరింత సంచలనంగా మారింది. సోమవారం ఉదయమే ఢిల్లీ పోలీసులు నగర శివార్లలో ఉగ్రవాద కుట్రను భగ్నం చేసి, ఏడుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఈ కీలక పరిణామం జరిగిన కొద్ది గంటల్లోనే పేలుడు సంభవించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
🚨 BREAKING: #DelhiBlast ; near Red Fort, New Delhi a car explosion rocks the area.
— Kajukathli 🤍🕊️ (@Miss_Aarohi_18) November 10, 2025
Several vehicles engulfed in flames, multiple injuries reported.
Delhi Police, Fire Brigade & Special Cell have rushed to the scene. The situation remains tense...#RedFort pic.twitter.com/0eF0jyWlsW
ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించింది. నగరంలోని అన్ని కీలక ప్రాంతాలు , రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లు, మార్కెట్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ బ్లాస్ట్ కేవలం ప్రమాదమా, లేక ఉగ్రవాద చర్యలలో భాగమా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications