విజయ్ గెలుపు వేళ కొత్త టెన్షన్, ఫలితాల్లో బిగ్ ట్విస్ట్ - 90 స్థానాల్లో మారుతున్న మెజార్టీలు..!!

తమిళనాడులో విజయ్ దే అధికారం. ఇప్పటి వరకు అంతా ఇదే లెక్క. అయితే, కౌంటింగ్ కొనసాగుతున్న వేళ లెక్కలు మారుతున్నాయి. విజయ్ పార్టీ ప్రస్తుతం 107 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. డీఎంకే 60, అన్నా డీఎంకే 67 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నాయి. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయమనే అంచనాలు వెల్లడవుతున్నాయి. విజయ్ కు మద్దతు కోసం ఆఫర్లు అందుతున్నాయి. అయితే, అనూహ్యంగా ఫలితాలు మారుతున్నాయి. తుది లెక్కల పైన ఉత్కంఠ పెంచుతున్నాయి.

తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ఊహించని ట్విస్ట్. పోస్టల్ బ్యాలెట్ లో తొలుత డీఎంకే హవా కనిపించింది. ఆ తరువాత ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం తరువాత విజయ్ పార్టీ ఒక్కసారిగా పుంజుకుంది. డీఎంకే- అన్నా డీఎంకే కంచుకోటల్లో ఆధిక్యత లో నిలిచింది. రౌండ్లు కొనసాగే కొద్దీ లెక్కలు మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ను తలకిందులు చేస్తూ డీఎంకేలో ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎం, 22 మంది మంత్రులను టీవీకే వెనుకంజలోకి నెట్టేసింది.

majorities-rapidly-change-in-tvk-leading-constituencies-in-tamil-nadu-assembly-counting-it-creatin

అన్నా డీఎంకే ఆశల పైన నీళ్లు చల్లింది. అధికారం చేపట్టటానికి కావాల్సిన 118 స్థానాల్లో ఇప్పటికే 107 సీట్లలో మెజార్టీలో కొనసాగుతోంది. తరువాతి స్థానాల్లో డీఎంకే, అన్నా డీఎంకే ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు అందుతున్న ట్రెండ్స్ మేరకు దాదాపు 90 నియోజకవర్గాల్లో మెజార్టీలు చాలా స్వల్పంగా ఉన్నాయి. ఇదే ఇప్పుడు టీవీకేకు కొత్త టెన్షన్ గా మారుతున్నాయి.

విజయ్ ఎమోషనల్.. త్రిషకు భారీ గుడ్ న్యూస్ - హంగ్ వేళ కొత్త బాధ్యతలు..!?
విజయ్ ఎమోషనల్.. త్రిషకు భారీ గుడ్ న్యూస్ - హంగ్ వేళ కొత్త బాధ్యతలు..!?

మారుతున్న మెజార్టీలు.. హంగ్ ఖాయం..?

దాదాపు 90 స్థానాల్లో హోరా హోరీ పోరు కొనసాగుతోంది. ఇక్కడ డీఎంకే..అన్నా డీఎంకే అభ్యర్దు లతో టీవీకే అభ్యర్ధులు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఎవరు గెలిచినా మెజార్టీ చాలా స్వల్పంగా ఉండే అవకాశం ఉంది. అయితే, తుది ఫలితాల వరకు కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు రావద్దని ఇప్పటికే సీఎం స్టాలిన్ పార్టీ నేతలను ఆదేశించారు. అదే రకమైన ఆదేశాలను అటు విజయ్ ఇచ్చారు.

ఇక.. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి సంఖ్యా బలం తగ్గితే ఎవరు మద్దతు ఇస్తారనే అంశం పైన కొత్త ప్రతిపాదనలు తెర పైకి వస్తున్నాయి. విజయ్ గెలుపు ఖాయమని అందరూ భావిస్తున్నారు. అయితే.. చివరి రౌండ్లలో మెజార్టీలు గెలుపు ఓటము లను మార్చి వేస్తే.. హంగ్ ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అప్పుడు తమిళనాడులో ఎవరు ఎవరితో జత కడతారు.. ఏం జరుగుతుందనేది మరింత ఉత్కంఠ పెంచే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. తుది ఫలితాల పైన ఎవరి అంచనాల్లో వారు నిమగ్నం అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+