march 20, 2020.. యోగాతో సత్ప్రవర్తన: పాఠ్యాంశాల్లో చేర్చాలి, చొరవ తీసుకోవాలి: రాందేవ్ బాబా..
నిర్బయ దోషులను ఉరి తీయడంతో యావత్‌జాతి హర్షం వ్యక్తం చేస్తోంది. యువత సంబరాలు చేసుకుంటోంది. దోషులకు శిక్ష అమలు చేయడంపై నిర్భయ తల్లి ఆశాదేవి, తండ్రి బద్రీనాథ్ సింగ్ స్వాగతించారు. ప్రముఖులు కూడా స్పందించారు. అయితే యోగాగురువు రాందేవ్ బాబా కాస్త భిన్నంగా రియాక్టయ్యారు. దేశంలో లైంగికదాడులను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వానికి సలహా కూడా ఇచ్చారు.
దోషులు అక్షయ్, ముఖేశ్, పవన్, వినయ్ ఉరిశిక్ష విధించి న్యాయవ్యవస్థ కొత్త చరిత్ర సృష్టించింది. మరొకరు తప్పు చేయాలంటే ఈ ఘటన గుర్తుచేసుకొని భయపడాలని రాందేవ్ బాబా అన్నారు. అయితే అత్యంత పాశవికంగా జరిగిన లైంగికదాడితో ప్రపంచం ముందు భారతదేశ పరువుపోయిందని చెప్పారు. నిర్భయ లాంటి ఘటన దేశానికి చెడ్డపేరు తీసుకొచ్చిందని అంగీకరించారు.

దేశంలోని విద్యా వ్యవస్థను కాస్త ప్రక్షాళన చేయాలని రాందేవ్ బాబా అభిప్రాయపడ్డారు. పాఠశాల స్థాయి పాఠ్యాంశాల్లో యోగాను తప్పనిసరి పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. ఇందుకోసం ప్రభుత్వం ముందుకు రావాలని, పేరంట్స్ కూడా పిల్లలకు యోగాపై అవగాహన కల్పించాలని సూచించారు. యోగా నేర్చుకోవడంతో మానసికంగా ఉత్సాహంగా ఉండి.. చెడు ఆలోచనలు రావు, రాబోవనే ఉద్దేశంతో రాందేబ్ బాబా హితవు పలికారు.
Recommended Video
రాందేవ్ వ్యాఖ్యలు దుమారం రేపే అవకాశం ఉంది. నిర్బయ ఘటనను యావత్ జాతి ముక్తకంఠంతో ఖండించింది. దోషులకు ఉరిశిక్ష విధించిన సమయంలో చేసిన వ్యాఖ్యల విపక్షాల ఆగ్రహానికి గురిచేసే ఛాన్స్ ఉంది. యోగా నేర్పాలనే పేరుతో.. ఘటనను తక్కువ చేసి చూపడం సరికాదని విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications